ప్రేమ ఓ గొప్ప అనుభూతి... ఎంతటివారైనా ఏదో ఒక సమయంలో ప్రేమలో పడాల్సిందే. ఆ మధురమైన భావనలో పరవశించాల్సిందే. అంతమటి అందమైన, అద్భుతమైన అనుభూతి ప్రేమ కలిగిస్తుంది. శుక్రవారం వాలంటటైన్స్ డే సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ తమ ప్రేమికులతో ఆనందంగా గడిపారు. వారిలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఉన్నారు.

Also Read వాలంటైన్స్ డే: నా ఫస్ట్ లవర్ ఇదే... వీడియో షేర్ చేసిన సచిన్...

శిఖర్ ధావన్ తన భార్య ఆయేషా ధావన్ తో కలిసి వాలంటైన్స్ డే జరుపుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా తన ప్రేమను ఆయన తెలియజేశాడు.  భార్య ఆయేషాతో రొమాంటిక్ దిగిన ఓ ఫోటోని ధావన్ షేర్ చేశాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Valentine's Day with my one and only 🥰 @aesha.dhawan5

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on Feb 14, 2020 at 3:31am PST

 

‘‘ నా ఏకైక ఆయేషాతో వాలంటైన్స్ డే(వాలంటైన్స్ డే విత్ మై వన్ అండ్ ఓన్లీ)’’ అని ఆయన పోస్టు చేశారు. కాగా... శిఖర్ భార్య  ఆయేషా కూడా సోషల్ మీడియాలో తనకు తన భర్త పై ఉన్న ప్రేమను తెలియజేశారు.

అచ్చంగా ఇద్దరూ ఒకే ఫోటోని షేర్ చేశారు. ‘‘ వాలంటైన్స్ డే , నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’’ అంటూ ఆయేషా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా... వీరి రొమాంటిక్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్స్ వస్తున్నాయి.