న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే.. ఆ ఓటమికి కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యమే కారణమంటూ మాజీ క్రికెటర్, క్రికెట్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు.

మ్యాచ్ ముగిసిన అనంతరం మంజ్రేకర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండు ఇన్నింగ్స్ ల్లో కోహ్లీ త్వరగా ఔటవ్వడం వల్లే జట్టు ఓటమిపాలైందన్నారు. ఒకవేళ కోహ్లీ బాగా ఆడి ఎక్కువ పరుగులు సాధించి ఉంటే.. న్యూజిలాండ్ వేసిన ప్లాన్స్ వర్కౌట్ అయ్యేవి కావన్నారు. 

Also Read అప్పుడు నా దగ్గరకు ధోనీ తప్ప ఒక్కరు కూడా రాలేదు.. బుమ్రా..

కివీస్ జట్టు వేసుకున్న ప్లాన్స్ ని కచ్చితంగా అమలు చేసిందని చెప్పారు. టీమిండియా కౌంటర్ ఎటాక్ చేయడానికి ఎవరూ నిలవలేకపోయారన్నారు. అందుకే కోహ్లీ సేన ఓటమిపాలైందని వివరించారు. 

కాగా... ఇటీవల జరిగిన మ్యాచ్ లో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు.తొలి వన్డేలో అర్థశతకం తప్ప తన స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయాడు. పరుగులు కూడా చాలా తక్కువగా చేశాడు. ఇదిలా ఉండగా తొలి టెస్టులో విఫలమయ్యాక కోహ్లీ తన బ్యాటింగ్ పై స్పందించాడు. తాను బాగానే ఆడుతున్నానని.. కొన్ని సార్లు విఫలమౌతుంటామని చెప్పాడు. తీరికలేకుండా ఆడుతుండటం వల్ల కూడా ఒక్కోసారి ఫెయిల్ అవుతూ ఉంటామని చెప్పాడు.