RCB vs MI IPL 2020: ఆర్‌సీబీ ‘సూపర్’ విజయం... సూపర్ ఓవర్‌లో సాగిన ఉత్కంఠ...

RCB vs MI IPL 2020 Live Updates with telugu commentary CRA

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. నాలుగుసార్లు టైటిల్ ఛాంపియన్ అయిన ముంబైని, ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమైన బెంగళూరు ఢీకొనడంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య పోరు ఆసక్తికరంగా సాగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగనున్న నేటి మ్యాచ్ ఇరు జట్లకీ కీలకం కానుంది. 

11:48 PM IST

సూపర్ ఓవర్‌లో కోహ్లీ సూపర్ విక్టరీ...

కోహ్లీ ఆఖరి బంతికి ఫోర్ బాదడంతో బెంగళూరు అద్భుత విజయం సాధించింది.

11:47 PM IST

ఐదో బంతికి సింగిల్...

ఐదో బంతికి సింగిల్ తీశాడు ఏబీడీ. విజయానికి ఆఖరి బంతికి సింగిల్ కావాలి.

11:45 PM IST

ఫోర్ బాదిన ఏబీడీ...

ఏబీడీ నాలుగో బంతికి ఫోర్ బాదాడు. దీంతో 2 బంతుల్లో 2 పరుగులు కావాలి.

11:42 PM IST

మూడో బంతికి వికెట్... రివ్యూలో నాటౌట్..

ఏబీ డివిల్లియర్స్ అవుట్ అయినట్టు అంపైర్ అవుట్ ఇచ్చాడు. కానీ రివ్యూ తీసుకుంది ఆర్‌సీబీ. ఏబీ డివిల్లియర్స్ బ్యాటుకి బంతి తగలకపోవడంతో నాటౌట్‌గా తేలింది.

11:42 PM IST

రెండో బంతికి సింగిల్..

కోహ్లీ మంచి షాట్ కొట్టినా, ముంబై ఫీల్డర్ బౌండరీని అడ్డుకోవడంతో కేవలం సింగిల్ రన్ మాత్రమే వచ్చింది.

11:39 PM IST

మొదటి బంతికి సింగిల్..

బుమ్రా వేసిన మొదటి బంతికి కేవలం సింగిల్ మాత్రమే వచ్చింది.

11:39 PM IST

క్రీజులోకి కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్...

సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ చేసేందుకు విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ క్రీజులోకి వచ్చారు. ముంబై తరుపున బుమ్రా బౌలింగ్ వేయనున్నాడు. విజయానికి 6 బంతుల్లో 8 పరుగులు కావాలి.

11:34 PM IST

ఆఖరి బంతికి సింగిల్... బెంగళూరు టార్గెట్ 8...

ఆఖరి బంతికి హార్దిక్ పాండ్యా మిస్ అయ్యాడు. ఒక సింగిల్ మాత్రమే వచ్చింది. దాంతో బెంగళూరు టార్గెట్ 8 పరుగులు...

11:32 PM IST

పోలార్డ్ అవుట్...

పోలార్డ్ భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. సూపర్ ఓవర్‌లో ఆఖరి బంతి మిగిలి ఉంది. 6 పరుగులు మాత్రమే వచ్చాయి.

11:31 PM IST

మొదటి బౌండరీ...

నాలుగో బంతికి మొదటి బౌండరీ వచ్చింది. దీంతో సూపర్ ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి.

11:30 PM IST

డాట్ బాల్...

షైనీ వేసిన మూడో బంతిని పోలార్డ్ మిస్ అయ్యాడు. దాంతో పరుగులేమీ రాలేదు.

11:30 PM IST

2 బంతుల్లో 2 పరుగులు...

షైనీ వేసిన మొదటి రెండు బంతుల్లో 2 పరుగులు మాత్రమే వచ్చాయి. 

11:27 PM IST

మొదటి బంతికి సింగిల్..

షైనీ వేసిన సూపర్ ఓవర్ మొదటి బంతికి సింగిల్ మాత్రమే వచ్చింది.

11:27 PM IST

సూపర్ ఓవర్‌లో పోలార్డ్, హార్ధిక్ పాండ్యా...

సూపర్ ఓవర్‌లో పోలార్డ్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌కి వచ్చారు. 

11:26 PM IST

సీజన్‌లో రెండో ‘సూపర్’ ఓవర్ మ్యాచ్

13వ సీజన్ ఐపీఎల్‌లో ఇది రెండో సూపర్ ఓవర్ మ్యాచ్. ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌కి వెళ్లింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్ 2 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ ఈజీ విక్టరీ కొట్టింది.

11:22 PM IST

ఆఖరి బంతికి ఫోర్...

ఆఖరి బంతికి పోలార్డ్ ఫోర్ బాదడంతో స్కోర్లు టై అయ్యాయి. మ్యాచ్ సూపర్ ఓవర్‌కి దారి తీసింది.

11:20 PM IST

99 పరుగులకి అవుట్...

ఇషాన్ కిషన్ 58 బంతుల్లో 9 సిక్సర్లు, 2 ఫోర్లతో 99 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

11:20 PM IST

ఆఖరి బంతికి 5 పరుగులు...

ఆఖరి ఓవర్ నాలుగో బంతికి ఇషాన్ కిషన్ అవుట్ కావడంతో ఆఖరి బంతికి 5 పరుగులు కావాలి.

11:20 PM IST

2 బంతుల్లో5 పరుగులు

వరుసగా రెండు సిక్సర్లు బాదాడు ఇషాన్ కిషన్... చివరి 2 బంతుల్లో 5 పరుగులు కావాలి.

11:16 PM IST

3 బంతుల్లో 11 పరుగులు...

ఆఖరి ఓవర్ మూడో బంతికి భారీ సిక్సర్ కొట్టాడు ఇషాన్ కిషన్. ముంబై విజయానికి 3 బంతుల్లో 11 పరుగులు కావాలి. 

11:16 PM IST

రెండో బంతికి సింగిల్...

రెండో బంతికి కూడా సింగిల్ మాత్రమే వచ్చింది. 

11:16 PM IST

మొదటి బంతికి సింగిల్...

మొదటి బంతికి సింగిల్ వచ్చింది. ఇషాన్ కిషన్ డ్రైవ్ చేసి రనౌట్ నుంచి తప్పించుకున్నాడు. 

11:14 PM IST

6 బంతుల్లో 19 పరుగులు...

ముంబై విజయానికి చివరి ఓవర్‌లో 19 పరుగులు కావాలి.

11:11 PM IST

ఇషాన్ సిక్సర్...

ఐదో బంతికి అద్భుతమైన సిక్సర్ కొట్టాడు ఇషాన్ కిషన్... దీంతో 100 పరుగుల భాగస్వామ్యం పూర్తైంది. 7 బంతుల్లో 20 పరుగులు కావాలి. 

11:11 PM IST

డెత్ స్పెషలిస్ట్ షైనీ...

నవ్‌దీప్ షైనీ 19వ ఓవర్ మొదటి 4 బంతుల్లో 4 సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. 

11:10 PM IST

షైనీ షైనింగ్...

19వ ఓవర్ మొదటి మూడు బంతుల్లో మూడు సింగిల్స్, ఓ వైడ్ మాత్రమే ఇచ్చాడు నవ్‌దీప్ షైనీ...

11:08 PM IST

10 బంతుల్లో 28 పరుగులు...

షైనీ మొదటి రెండు బంతుల్లో రెండు సింగిల్స్, ఓ వైడ్ మాత్రమే ఇచ్చాడు. ముంబై విజయానికి 10 బంతుల్లో 28 పరుగులు కావాలి.

11:03 PM IST

పోలార్డ్ సునామీ హాఫ్ సెంచరీ...

20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు పోలార్డ్. 2 ఫోర్లు, 5 సిక్సర్లతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు పోలార్డ్. 

11:03 PM IST

కిషన్ ‘కిల్లింగ్ షాట్’...

ఇషాన్ కిషన్ కూడా భారీ సిక్సర్ బాదాడు. చాహాల్ బౌలింగ్‌లో ఇప్పటికే 2 సిక్సర్లు వచ్చాయి. 

11:00 PM IST

పోలార్డ్ పవర్...

చాహాల్ బౌలింగ్‌లో మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు పోలార్డ్.

11:00 PM IST

18 బంతుల్లో 53 పరుగులు...

ముంబై విజయానికి 18 బంతుల్లో 53 పరుగులు కావాలి. 

10:58 PM IST

రాయల్ ఫీల్డింగ్ మాత్రం మారలేదు....

బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్, బౌలింగ్‌లోనూ సత్తా చాటింది. కానీ ఫీల్డింగ్ మాత్రం మారలేదు. పోలార్డ్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను జారవిడిచారు బెంగళూరు ఫీల్డర్లు.

10:57 PM IST

పోలార్డ్ సిక్సర్ల మోత...

జంపా ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదాడు పోలార్డ్. ఓ ఫోర్, ఓ టూడీ,ఓ త్రీడీ 27 పరుగులు రాబట్టాడు పోలార్డ్. 

10:56 PM IST

పోలార్డ్ షో...

జంపా వేసిన 17వ ఓవర్ మూడు బంతుల్లో 2 సిక్సర్లు, ఓ ఫోర్ బాదాడు పోలార్డ్.

10:54 PM IST

పోలార్డ్ ‘పవర్’ మొదలు...

17వ ఓవర్‌ మొదటి బంతికే ఫోర్ బాదిన పోలార్డ్, ఆ తర్వాతి బంతికి సిక్సర్ బాదాడు. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్ క్యాచ్ డ్రాప్ చేయడంతో భారీ సిక్సర్ బాదాడు పోలార్డ్.

10:52 PM IST

24 బంతుల్లో 80 పరుగులు..

ముంబై విజయానికి 24 బంతుల్లో 80 పరుగులు కావాలి. ఇషాన్ కిషన్ 70, పోలార్డ్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

10:47 PM IST

మొదటి బంతికే ఫోర్...

ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. 16వ ఓవర్ మొదటి బంతికే ఫోర్ బాదిన ఇషాన్ కిషన్. ఆ తర్వాత బంతికి 2 పరుగులు తీశాడు.

10:45 PM IST

5 ఓవర్లలో 90... సాధ్యమేనా

ముంబై విజయానికి 30 బంతుల్లో 90 పరుగులు కావాలి. ఇషాన్ కిషన్ భారీ సిక్సర్లతో బాగా ఆడుతున్నా, పోలార్డ్ వంటి హిట్టర్ క్రీజులో ఉన్నా ఓవర్‌కి 18 పరుగులు సాధిస్తేనే ముంబైకి విజయం దక్కుతుంది.

10:43 PM IST

కిషన్ హిట్టింగ్...

చాహాల్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ భారీ సిక్సర్ బాదాడు.

10:38 PM IST

36 బంతుల్లో 104 పరుగులు...

14 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది ముంబై. విజయానికి చివరి 36 బంతుల్లో 104 పరుగులు కావాలి. 

10:37 PM IST

సిక్సర్‌తో హాఫ్ సెంచరీ...

14వ చివరి బంతికి భారీ సిక్సర్ కొట్టి 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు ఇషాన్ కిషన్.

10:32 PM IST

42 బంతుల్లో 113 పరుగులు

13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది ముంబై. విజయానికి 42 బంతుల్లో 113 పరుగులు కావాలి. 

10:26 PM IST

టార్గెట్ 48 బంతుల్లో 119 పరుగులు...

ముంబై ఇండియన్స్ విజయాని‌కి 48 బంతుల్లో 119 పరుగులు కావాలి.

10:26 PM IST

12 ఓవర్లలో 83 పరుగులు...

12 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..

10:22 PM IST

హార్ధిక్ పాండ్యా అవుట్...

హార్ధిక్ పాండ్యా అవుట్... కష్టాల్లో ముంబై ఇండియన్స్...78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్. 13 బంతుల్లో 15 పరుగులు చేసిన పాండ్యా, జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.

10:20 PM IST

11 ఓవర్లలో 77 పరుగులు...

11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది ముంబై.

10:16 PM IST

కిషన్ ‘షైనింగ్’ సిక్సర్...

సైనీ వేస్తున్న 11 వ ఓవర్‌లో మూడో బంతిని కూడా సిక్సర్‌గా మలిచాడు ఇషాన్ కిషన్.

10:16 PM IST

ఇషాన్ కిషన్ సిక్సర్

11వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు ఇషాన్ కిషన్...

10:14 PM IST

10 ఓవర్లలో 63 పరుగులు...

10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది ముంబై. లక్ష్యానికి చివరి 10 ఓవర్లలో 139 పరుగులు కావాలి. 

10:07 PM IST

9 ఓవర్లలో 58 పరుగులు..

ముంబై ఇండియన్స్ భారీ లక్ష్యచేధనలో 9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది.

10:02 PM IST

పాండ్యా సిక్సర్...

జంపా బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యా భారీ సిక్సర్ బాదాడు. 8 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది ముంబై. 

9:59 PM IST

7 ఓవర్లలో 41 పరుగులు...

7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది ముంబై.

9:59 PM IST

డి కాక్ అవుట్..

14 పరుగులు చేసిన డి కాక్, చాహాల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ముంబై.

9:35 PM IST

సూర్యకుమార్ అవుట్...

సూర్యకుమార్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్. 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ముంబై.

9:33 PM IST

2 ఓవర్లలో 16...

రెండో ఓవర్‌లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో రెండు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది ముంబై.

9:31 PM IST

రోహిత్ అవుట్...

 రోహిత్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్... 14 పరుగులకి తొలి వికెట్ కోల్పోయిన ముంబై

9:27 PM IST

మొదటి ఓవర్‌లోనే 14 పరుగులు...

భారీ లక్ష్యచేధనలో మొదటి ఓవర్‌లోనే 14 పరుగులు రాబట్టింది ముంబై. రోహిత్ సిక్సర్ బాదగా డి కాక్ బౌండరీ బాదాడు.

9:18 PM IST

ముంబై ఎప్పుడూ కొట్టలేదే..

ముంబై ఇండియన్స్ ఎప్పుడూ 200+ టార్గెట్‌ను విజయవంతంగా చేధించలేకపోయింది. నేటి మ్యాచ్ గెలిస్తే ఐపీఎల్ కెరీర్‌లో సరికొత్త చరిత్ర క్రియేట్ చేస్తుంది ముంబై.

9:13 PM IST

200+ కొట్టినా కష్టమే...

200+ స్కోరు చేసినా మూడు సార్లు ఓడిన ఒకే ఒక్క జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 

9:07 PM IST

ముంబైకి భారీ టార్గెట్...

ఆఖరి బంతికి కూడా సిక్సర్ రావడంతో 3 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్.

9:05 PM IST

దూబే సిక్సర్ల మోత...

ఆఖరి ఓవర్‌లో వరుసగా 2 సిక్సర్లు బాదాడు శివమ్ దూబే...

9:03 PM IST

సిక్సర్‌తో హాఫ్ సెంచరీ...

ఏబీ డివిల్లియర్స్ భారీ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 19 ఓవర్లు ముగిసేసరికి 181 పరుగులు చేసింది ఆర్‌సీబీ.

9:00 PM IST

ఏబీడీ ఆన్ ఫైర్...

22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరగులు చేశాడు ఏబీ డివిల్లియర్స్. 

8:57 PM IST

డివిల్లియర్స్ సిక్సర్...

18వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు ఏబీ డివిల్లియర్స్. దీంతో 18 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది ఆర్‌సీబీ.

8:53 PM IST

పడిక్కల్ అవుట్...

18వ ఓవర్ మొదటి బంతికే భారీ షాట్ కోసం ప్రయత్నించిన దేవ్‌దత్ పడిక్కల్, బౌండరీ లైన్ దగ్గర పోలార్డ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు పడిక్కల్.

8:52 PM IST

17 ఓవర్లలో 154...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. 

8:47 PM IST

డివిల్లియర్స్ సిక్సర్...

17వ ఓవర్ మూడో బంతికే సిక్సర్ బాదాడు డివిల్లియర్స్. 16.4 ఓవర్లలో 147 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

8:47 PM IST

ఏబీ డివిల్లియర్స్ బౌండరీ...

17వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు ఏబీ డివిల్లియర్స్. 

8:43 PM IST

16 ఓవర్లలో 136 పరుగులు...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.

8:40 PM IST

పడిక్కల్ హాఫ్ సెంచరీ...

37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు దేవ్‌దత్ పడిక్కల్. మూడో మ్యాచ్ ఆడుతున్న పడిక్కల్‌కి ఇది రెండో హాఫ్ సెంచరీ.

8:33 PM IST

పడిక్కల్ పవర్‌ఫుల్ సిక్సర్ల మోత...

ప్యాటిన్సన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు దేవ్‌దత్ పడిక్కల్.

8:32 PM IST

పడిక్కల్ సిక్సర్...

దేవ్‌దత్ పడిక్కల్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో ఆర్‌సీబీ స్కోరు 100 మార్కు దాటింది. 

8:29 PM IST

అటు నుంచి ఇటు...

ఫించ్ అవుటైన తర్వాత కోహ్లీ బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడి త్వరగా అవుట్ కావడంతో మొదటి 10 ఓవర్లు బెంగళూరు వైపు ఉన్న మ్యాచ్... ఇప్పుడు ముంబై ఇండియన్స్‌ వైపు మళ్లింది. 10 ఓవర్లలో 85 పరుగులు చేసిన ఆర్‌సీబీ, 13 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 95 పరుగులు మాత్రమే చేయగలిగింది.

8:26 PM IST

కోహ్లీ మళ్లీ ఫ్లాప్...

కోహ్లీ మళ్లీ ఫ్లాప్... రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్... 92 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 11 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులే చేసి అవుటైన కోహ్లీ.

8:16 PM IST

10 ఓవర్లలో 85 పరుగులు...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది.

8:14 PM IST

81 పరుగుల వద్ద...

35 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్... ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో పోలార్డ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 81 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది బెంగళూరు. 

8:13 PM IST

ఫించ్ అవుట్...

ఫించ్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:08 PM IST

8 ఓవర్లలో 74 పరుగులు...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసింది.

8:06 PM IST

ఫించ్ హాఫ్ సెంచరీ..

ఆరోన్ ఫించ్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫించ్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, ఓ సిక్స్ ఉన్నాయి. 

8:04 PM IST

7 ఓవర్లలో 65 పరుగులు...

7 ఓవర్లలో 65 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్. ఫించ్ 45, దేవ్‌దత్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.

7:58 PM IST

6 ఓవర్లలో 59 పరుగులు...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది.

7:54 PM IST

పడిక్కల్ బౌండరీ...

మొదటి ఓవర్‌లో బౌండరీ కొట్టిన పడిక్కల్‌, మళ్లీ ఆరో ఓవర్‌లో రెండో బౌండరీ బాదాడు. 

7:53 PM IST

రోల్ మార్చుకున్న ఫించ్, పడిక్కల్...

మొదటి మ్యాచ్‌లో దేవ్‌దత్ పడిక్కల్ భారీ షాట్లు ఆడుతుంటే, ఆరోన్ ఫించ్ అతనికి స్టైయిక్ ఇస్తూ బ్యాటింగ్ చేశాడు. నేటి మ్యాచ్‌లో ఫించ్ భారీ షాట్లు కొడుతుంటే దేవ్‌దత్ సింగిల్స్ తీస్తూ ఫించ్‌కి స్టైయిక్ ఇస్తున్నాడు. ఫించ్ 23 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేయగా, దేవ్‌దత్ పడిక్కల్ 9 పరుగులతో ఆడుతున్నాడు.

7:51 PM IST

ఆరోన్ ఫించ్ దూకుడు...

రాహుల్ చాహార్ బౌలింగ్‌లో వరుసగా హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు ఆరోన్ ఫించ్. దీంతో 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది ఆర్‌సీబీ. 

7:40 PM IST

2 ఓవర్లలో 16 పరుగులు...

ఆర్‌సీబీ రెండు ఓవర్లు పూర్తయేసరికి 16 పరుగులు చేసింది.

7:36 PM IST

ఫించ్‌కి గాయం...

ప్యాటిన్సన్ వేసిన బంతి, బలంగా వచ్చి ఆరోన్ ఫించ్‌కి తగిలింది. సరిగ్గా మధ్య భాగంలో బంతి తగలడంతో నొప్పితో బాధపడుతున్నాడు ఫించ్. 1.2 ఓవర్లలో 10 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 

7:32 PM IST

రెండో బంతికే ఫోర్...

యంగ్ బ్యాట్స్‌మెన్ దేవ్‌దత్ పడిక్కల్, తాను ఎదుర్కొన్న మొదటి బంతికి 2 పరుగులు, రెండో బంతికి ఫోర్ బాదాడు. 

7:12 PM IST

కోహ్లీ జట్టులో కీలక మార్పులు...

గత మ్యాచ్‌లో ఎదురైన దారుణ ఓటమి కారణంగా జట్టులో మూడు మార్పులు చేశాడు విరాట్ కోహ్లీ. డేల్ స్టేయిన్‌తో పాటు ఫిలిప్‌ను పక్కనబెట్టిన కోహ్లీ, ఆ స్థానంలో జంపా, ఉదానాలకు చోటు కల్పించాడు. భారీగా పరుగులిస్తున్న ఉమేశ్ యాదవ్‌ను తప్పించి, గుర్‌కిరట్ మాన్‌కి అవకాశం ఇచ్చాడు.

7:10 PM IST

ముంబై జట్టు ఇది...

ముంబై జట్టు ఇది...
డి కాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, కిరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహార్, జేమ్స్ ప్యాటిన్సన్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రిత్ బుమ్రా

7:10 PM IST

బెంగళూరు జట్టు ఇది...

బెంగళూరు జట్టు ఇది...
విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, ఏబీ డివిల్లియర్స్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, గుర్‌కీరట్ సింగ్ మాన్, ఇసురు ఉదాన, నవ్‌దీప్ శైనీ, యజ్వేంద్ర చాహాల్, ఆడమ్ జంపా

7:05 PM IST

పదిలో 2 మాత్రమే...

ఇప్పటిదాకా జరిగిన 10 మ్యాచుల్లో కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే టాస్ గెలిచిన జట్టుకి విజయం దక్కింది. మొదటి మ్యాచ్‌లో ధోనీ టాస్ గెలిచి విజయం సాధించగా... నిన్నటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్‌కి విజయం దక్కింది. 

7:05 PM IST

10లో మూడు మాత్రమే....

ఇప్పటిదాకా జరిగిన 10 మ్యాచుల్లో కేవలం 3 మ్యాచుల్లో మాత్రమే మొదట బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. 

7:03 PM IST

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్...

 టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. బెంగళూరు బ్యాటింగ్ చేయనుంది. 

6:54 PM IST

పదిలో రెండు మాత్రమే...

గత 10 మ్యాచుల్లో కేవలం 2 మ్యాచుల్లో మాత్రమే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కి విజయం దక్కింది. 8 మ్యాచుల్లో ముంబైకి దక్కింది. 

6:54 PM IST

రికార్డులన్నీ ముంబై వైపే...

గత మ్యాచుల రికార్డులన్నీ ముంబై ఇండియన్స్‌కు ఫేవర్‌గానే ఉన్నాయి. ఇరు జట్ల మధ్య 25 మ్యాచులు జరగగా 16 మ్యాచుల్లో విజయం సాధించగా... బెంగళూరుకి 9 మ్యాచుల్లో విజయం దక్కింది...

6:51 PM IST

కెప్టెన్‌గా కోహ్లీకి 150వ మ్యాచ్...

టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇది 150వ మ్యాచ్. భారత జట్టుకు 37 టీ20 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహారించిన కోహ్లీ, ఐపీఎల్‌లో 113 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. 

11:48 PM IST:

కోహ్లీ ఆఖరి బంతికి ఫోర్ బాదడంతో బెంగళూరు అద్భుత విజయం సాధించింది.

11:47 PM IST:

ఐదో బంతికి సింగిల్ తీశాడు ఏబీడీ. విజయానికి ఆఖరి బంతికి సింగిల్ కావాలి.

11:46 PM IST:

ఏబీడీ నాలుగో బంతికి ఫోర్ బాదాడు. దీంతో 2 బంతుల్లో 2 పరుగులు కావాలి.

11:45 PM IST:

ఏబీ డివిల్లియర్స్ అవుట్ అయినట్టు అంపైర్ అవుట్ ఇచ్చాడు. కానీ రివ్యూ తీసుకుంది ఆర్‌సీబీ. ఏబీ డివిల్లియర్స్ బ్యాటుకి బంతి తగలకపోవడంతో నాటౌట్‌గా తేలింది.

11:43 PM IST:

కోహ్లీ మంచి షాట్ కొట్టినా, ముంబై ఫీల్డర్ బౌండరీని అడ్డుకోవడంతో కేవలం సింగిల్ రన్ మాత్రమే వచ్చింది.

11:42 PM IST:

బుమ్రా వేసిన మొదటి బంతికి కేవలం సింగిల్ మాత్రమే వచ్చింది.

11:40 PM IST:

సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ చేసేందుకు విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ క్రీజులోకి వచ్చారు. ముంబై తరుపున బుమ్రా బౌలింగ్ వేయనున్నాడు. విజయానికి 6 బంతుల్లో 8 పరుగులు కావాలి.

11:35 PM IST:

ఆఖరి బంతికి హార్దిక్ పాండ్యా మిస్ అయ్యాడు. ఒక సింగిల్ మాత్రమే వచ్చింది. దాంతో బెంగళూరు టార్గెట్ 8 పరుగులు...

11:33 PM IST:

పోలార్డ్ భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. సూపర్ ఓవర్‌లో ఆఖరి బంతి మిగిలి ఉంది. 6 పరుగులు మాత్రమే వచ్చాయి.

11:32 PM IST:

నాలుగో బంతికి మొదటి బౌండరీ వచ్చింది. దీంతో సూపర్ ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి.

11:31 PM IST:

షైనీ వేసిన మూడో బంతిని పోలార్డ్ మిస్ అయ్యాడు. దాంతో పరుగులేమీ రాలేదు.

11:30 PM IST:

షైనీ వేసిన మొదటి రెండు బంతుల్లో 2 పరుగులు మాత్రమే వచ్చాయి. 

11:29 PM IST:

షైనీ వేసిన సూపర్ ఓవర్ మొదటి బంతికి సింగిల్ మాత్రమే వచ్చింది.

11:28 PM IST:

సూపర్ ఓవర్‌లో పోలార్డ్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌కి వచ్చారు. 

11:27 PM IST:

13వ సీజన్ ఐపీఎల్‌లో ఇది రెండో సూపర్ ఓవర్ మ్యాచ్. ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌కి వెళ్లింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్ 2 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ ఈజీ విక్టరీ కొట్టింది.

11:23 PM IST:

ఆఖరి బంతికి పోలార్డ్ ఫోర్ బాదడంతో స్కోర్లు టై అయ్యాయి. మ్యాచ్ సూపర్ ఓవర్‌కి దారి తీసింది.

11:22 PM IST:

ఇషాన్ కిషన్ 58 బంతుల్లో 9 సిక్సర్లు, 2 ఫోర్లతో 99 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

11:21 PM IST:

ఆఖరి ఓవర్ నాలుగో బంతికి ఇషాన్ కిషన్ అవుట్ కావడంతో ఆఖరి బంతికి 5 పరుగులు కావాలి.

11:20 PM IST:

వరుసగా రెండు సిక్సర్లు బాదాడు ఇషాన్ కిషన్... చివరి 2 బంతుల్లో 5 పరుగులు కావాలి.

11:19 PM IST:

ఆఖరి ఓవర్ మూడో బంతికి భారీ సిక్సర్ కొట్టాడు ఇషాన్ కిషన్. ముంబై విజయానికి 3 బంతుల్లో 11 పరుగులు కావాలి. 

11:18 PM IST:

రెండో బంతికి కూడా సింగిల్ మాత్రమే వచ్చింది. 

11:17 PM IST:

మొదటి బంతికి సింగిల్ వచ్చింది. ఇషాన్ కిషన్ డ్రైవ్ చేసి రనౌట్ నుంచి తప్పించుకున్నాడు. 

11:14 PM IST:

ముంబై విజయానికి చివరి ఓవర్‌లో 19 పరుగులు కావాలి.

11:13 PM IST:

ఐదో బంతికి అద్భుతమైన సిక్సర్ కొట్టాడు ఇషాన్ కిషన్... దీంతో 100 పరుగుల భాగస్వామ్యం పూర్తైంది. 7 బంతుల్లో 20 పరుగులు కావాలి. 

11:12 PM IST:

నవ్‌దీప్ షైనీ 19వ ఓవర్ మొదటి 4 బంతుల్లో 4 సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. 

11:10 PM IST:

19వ ఓవర్ మొదటి మూడు బంతుల్లో మూడు సింగిల్స్, ఓ వైడ్ మాత్రమే ఇచ్చాడు నవ్‌దీప్ షైనీ...

11:09 PM IST:

షైనీ మొదటి రెండు బంతుల్లో రెండు సింగిల్స్, ఓ వైడ్ మాత్రమే ఇచ్చాడు. ముంబై విజయానికి 10 బంతుల్లో 28 పరుగులు కావాలి.

11:05 PM IST:

20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు పోలార్డ్. 2 ఫోర్లు, 5 సిక్సర్లతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు పోలార్డ్. 

11:03 PM IST:

ఇషాన్ కిషన్ కూడా భారీ సిక్సర్ బాదాడు. చాహాల్ బౌలింగ్‌లో ఇప్పటికే 2 సిక్సర్లు వచ్చాయి. 

11:01 PM IST:

చాహాల్ బౌలింగ్‌లో మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు పోలార్డ్.

11:00 PM IST:

ముంబై విజయానికి 18 బంతుల్లో 53 పరుగులు కావాలి. 

11:00 PM IST:

బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్, బౌలింగ్‌లోనూ సత్తా చాటింది. కానీ ఫీల్డింగ్ మాత్రం మారలేదు. పోలార్డ్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను జారవిడిచారు బెంగళూరు ఫీల్డర్లు.

10:58 PM IST:

జంపా ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదాడు పోలార్డ్. ఓ ఫోర్, ఓ టూడీ,ఓ త్రీడీ 27 పరుగులు రాబట్టాడు పోలార్డ్. 

10:56 PM IST:

జంపా వేసిన 17వ ఓవర్ మూడు బంతుల్లో 2 సిక్సర్లు, ఓ ఫోర్ బాదాడు పోలార్డ్.

10:56 PM IST:

17వ ఓవర్‌ మొదటి బంతికే ఫోర్ బాదిన పోలార్డ్, ఆ తర్వాతి బంతికి సిక్సర్ బాదాడు. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్ క్యాచ్ డ్రాప్ చేయడంతో భారీ సిక్సర్ బాదాడు పోలార్డ్.

10:53 PM IST:

ముంబై విజయానికి 24 బంతుల్లో 80 పరుగులు కావాలి. ఇషాన్ కిషన్ 70, పోలార్డ్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

10:48 PM IST:

ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. 16వ ఓవర్ మొదటి బంతికే ఫోర్ బాదిన ఇషాన్ కిషన్. ఆ తర్వాత బంతికి 2 పరుగులు తీశాడు.

10:46 PM IST:

ముంబై విజయానికి 30 బంతుల్లో 90 పరుగులు కావాలి. ఇషాన్ కిషన్ భారీ సిక్సర్లతో బాగా ఆడుతున్నా, పోలార్డ్ వంటి హిట్టర్ క్రీజులో ఉన్నా ఓవర్‌కి 18 పరుగులు సాధిస్తేనే ముంబైకి విజయం దక్కుతుంది.

10:44 PM IST:

చాహాల్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ భారీ సిక్సర్ బాదాడు.

10:39 PM IST:

14 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది ముంబై. విజయానికి చివరి 36 బంతుల్లో 104 పరుగులు కావాలి. 

10:38 PM IST:

14వ చివరి బంతికి భారీ సిక్సర్ కొట్టి 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు ఇషాన్ కిషన్.

10:33 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది ముంబై. విజయానికి 42 బంతుల్లో 113 పరుగులు కావాలి. 

10:28 PM IST:

ముంబై ఇండియన్స్ విజయాని‌కి 48 బంతుల్లో 119 పరుగులు కావాలి.

10:27 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..

10:23 PM IST:

హార్ధిక్ పాండ్యా అవుట్... కష్టాల్లో ముంబై ఇండియన్స్...78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్. 13 బంతుల్లో 15 పరుగులు చేసిన పాండ్యా, జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.

10:21 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది ముంబై.

10:18 PM IST:

సైనీ వేస్తున్న 11 వ ఓవర్‌లో మూడో బంతిని కూడా సిక్సర్‌గా మలిచాడు ఇషాన్ కిషన్.

10:17 PM IST:

11వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు ఇషాన్ కిషన్...

10:15 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది ముంబై. లక్ష్యానికి చివరి 10 ఓవర్లలో 139 పరుగులు కావాలి. 

10:08 PM IST:

ముంబై ఇండియన్స్ భారీ లక్ష్యచేధనలో 9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది.

10:03 PM IST:

జంపా బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యా భారీ సిక్సర్ బాదాడు. 8 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది ముంబై. 

10:00 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది ముంబై.

9:59 PM IST:

14 పరుగులు చేసిన డి కాక్, చాహాల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ముంబై.

9:35 PM IST:

సూర్యకుమార్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్. 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ముంబై.

9:34 PM IST:

రెండో ఓవర్‌లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో రెండు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది ముంబై.

9:31 PM IST:

 రోహిత్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్... 14 పరుగులకి తొలి వికెట్ కోల్పోయిన ముంబై

9:28 PM IST:

భారీ లక్ష్యచేధనలో మొదటి ఓవర్‌లోనే 14 పరుగులు రాబట్టింది ముంబై. రోహిత్ సిక్సర్ బాదగా డి కాక్ బౌండరీ బాదాడు.

9:19 PM IST:

ముంబై ఇండియన్స్ ఎప్పుడూ 200+ టార్గెట్‌ను విజయవంతంగా చేధించలేకపోయింది. నేటి మ్యాచ్ గెలిస్తే ఐపీఎల్ కెరీర్‌లో సరికొత్త చరిత్ర క్రియేట్ చేస్తుంది ముంబై.

9:14 PM IST:

200+ స్కోరు చేసినా మూడు సార్లు ఓడిన ఒకే ఒక్క జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 

9:08 PM IST:

ఆఖరి బంతికి కూడా సిక్సర్ రావడంతో 3 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్.

9:05 PM IST:

ఆఖరి ఓవర్‌లో వరుసగా 2 సిక్సర్లు బాదాడు శివమ్ దూబే...

9:03 PM IST:

ఏబీ డివిల్లియర్స్ భారీ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 19 ఓవర్లు ముగిసేసరికి 181 పరుగులు చేసింది ఆర్‌సీబీ.

9:01 PM IST:

22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరగులు చేశాడు ఏబీ డివిల్లియర్స్. 

8:58 PM IST:

18వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు ఏబీ డివిల్లియర్స్. దీంతో 18 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది ఆర్‌సీబీ.

8:54 PM IST:

18వ ఓవర్ మొదటి బంతికే భారీ షాట్ కోసం ప్రయత్నించిన దేవ్‌దత్ పడిక్కల్, బౌండరీ లైన్ దగ్గర పోలార్డ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు పడిక్కల్.

8:53 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. 

8:49 PM IST:

17వ ఓవర్ మూడో బంతికే సిక్సర్ బాదాడు డివిల్లియర్స్. 16.4 ఓవర్లలో 147 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

8:47 PM IST:

17వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు ఏబీ డివిల్లియర్స్. 

8:43 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.

8:41 PM IST:

37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు దేవ్‌దత్ పడిక్కల్. మూడో మ్యాచ్ ఆడుతున్న పడిక్కల్‌కి ఇది రెండో హాఫ్ సెంచరీ.

8:34 PM IST:

ప్యాటిన్సన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు దేవ్‌దత్ పడిక్కల్.

8:33 PM IST:

దేవ్‌దత్ పడిక్కల్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో ఆర్‌సీబీ స్కోరు 100 మార్కు దాటింది. 

8:31 PM IST:

ఫించ్ అవుటైన తర్వాత కోహ్లీ బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడి త్వరగా అవుట్ కావడంతో మొదటి 10 ఓవర్లు బెంగళూరు వైపు ఉన్న మ్యాచ్... ఇప్పుడు ముంబై ఇండియన్స్‌ వైపు మళ్లింది. 10 ఓవర్లలో 85 పరుగులు చేసిన ఆర్‌సీబీ, 13 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 95 పరుగులు మాత్రమే చేయగలిగింది.

8:27 PM IST:

కోహ్లీ మళ్లీ ఫ్లాప్... రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్... 92 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 11 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులే చేసి అవుటైన కోహ్లీ.

8:17 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది.

8:14 PM IST:

35 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్... ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో పోలార్డ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 81 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది బెంగళూరు. 

8:13 PM IST:

ఫించ్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:09 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసింది.

8:07 PM IST:

ఆరోన్ ఫించ్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫించ్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, ఓ సిక్స్ ఉన్నాయి. 

8:05 PM IST:

7 ఓవర్లలో 65 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్. ఫించ్ 45, దేవ్‌దత్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.

7:59 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది.

7:55 PM IST:

మొదటి ఓవర్‌లో బౌండరీ కొట్టిన పడిక్కల్‌, మళ్లీ ఆరో ఓవర్‌లో రెండో బౌండరీ బాదాడు. 

7:54 PM IST:

మొదటి మ్యాచ్‌లో దేవ్‌దత్ పడిక్కల్ భారీ షాట్లు ఆడుతుంటే, ఆరోన్ ఫించ్ అతనికి స్టైయిక్ ఇస్తూ బ్యాటింగ్ చేశాడు. నేటి మ్యాచ్‌లో ఫించ్ భారీ షాట్లు కొడుతుంటే దేవ్‌దత్ సింగిల్స్ తీస్తూ ఫించ్‌కి స్టైయిక్ ఇస్తున్నాడు. ఫించ్ 23 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేయగా, దేవ్‌దత్ పడిక్కల్ 9 పరుగులతో ఆడుతున్నాడు.

7:52 PM IST:

రాహుల్ చాహార్ బౌలింగ్‌లో వరుసగా హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు ఆరోన్ ఫించ్. దీంతో 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది ఆర్‌సీబీ. 

7:40 PM IST:

ఆర్‌సీబీ రెండు ఓవర్లు పూర్తయేసరికి 16 పరుగులు చేసింది.

7:37 PM IST:

ప్యాటిన్సన్ వేసిన బంతి, బలంగా వచ్చి ఆరోన్ ఫించ్‌కి తగిలింది. సరిగ్గా మధ్య భాగంలో బంతి తగలడంతో నొప్పితో బాధపడుతున్నాడు ఫించ్. 1.2 ఓవర్లలో 10 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 

7:33 PM IST:

యంగ్ బ్యాట్స్‌మెన్ దేవ్‌దత్ పడిక్కల్, తాను ఎదుర్కొన్న మొదటి బంతికి 2 పరుగులు, రెండో బంతికి ఫోర్ బాదాడు. 

7:15 PM IST:

గత మ్యాచ్‌లో ఎదురైన దారుణ ఓటమి కారణంగా జట్టులో మూడు మార్పులు చేశాడు విరాట్ కోహ్లీ. డేల్ స్టేయిన్‌తో పాటు ఫిలిప్‌ను పక్కనబెట్టిన కోహ్లీ, ఆ స్థానంలో జంపా, ఉదానాలకు చోటు కల్పించాడు. భారీగా పరుగులిస్తున్న ఉమేశ్ యాదవ్‌ను తప్పించి, గుర్‌కిరట్ మాన్‌కి అవకాశం ఇచ్చాడు.

7:12 PM IST:

ముంబై జట్టు ఇది...
డి కాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, కిరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహార్, జేమ్స్ ప్యాటిన్సన్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రిత్ బుమ్రా

7:10 PM IST:

బెంగళూరు జట్టు ఇది...
విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, ఏబీ డివిల్లియర్స్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, గుర్‌కీరట్ సింగ్ మాన్, ఇసురు ఉదాన, నవ్‌దీప్ శైనీ, యజ్వేంద్ర చాహాల్, ఆడమ్ జంపా

7:07 PM IST:

ఇప్పటిదాకా జరిగిన 10 మ్యాచుల్లో కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే టాస్ గెలిచిన జట్టుకి విజయం దక్కింది. మొదటి మ్యాచ్‌లో ధోనీ టాస్ గెలిచి విజయం సాధించగా... నిన్నటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్‌కి విజయం దక్కింది. 

7:06 PM IST:

ఇప్పటిదాకా జరిగిన 10 మ్యాచుల్లో కేవలం 3 మ్యాచుల్లో మాత్రమే మొదట బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. 

7:03 PM IST:

 టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. బెంగళూరు బ్యాటింగ్ చేయనుంది. 

6:57 PM IST:

గత 10 మ్యాచుల్లో కేవలం 2 మ్యాచుల్లో మాత్రమే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కి విజయం దక్కింది. 8 మ్యాచుల్లో ముంబైకి దక్కింది. 

6:56 PM IST:

గత మ్యాచుల రికార్డులన్నీ ముంబై ఇండియన్స్‌కు ఫేవర్‌గానే ఉన్నాయి. ఇరు జట్ల మధ్య 25 మ్యాచులు జరగగా 16 మ్యాచుల్లో విజయం సాధించగా... బెంగళూరుకి 9 మ్యాచుల్లో విజయం దక్కింది...

6:53 PM IST: