Asianet News TeluguAsianet News Telugu

అదరగొట్టిన రంజీ ఆటగాళ్లు... భారత క్రికెట్ చరిత్రలో రికార్డ్ స్కోర్

ఈ మ్యాచ్ ఫిబ్రవరి 12వ తేదీన మ్యాచ్‌ ఆరంభం కాగా, రెండో రోజు ఆటకే మణిపూర్‌ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించడం గమనార్హం. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మణిపూర్‌ జట్టు  వికెట్‌ కోల్పోకుండా 33 పరుగులు చేసింది. 
 

Ranji Trophy: Chandigarh's 1st innings lead vs Manipur 4th biggest in India cricket history
Author
Hyderabad, First Published Feb 14, 2020, 10:22 AM IST

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత భారీ స్కోర్ నమోదైంది. అత్యధిక తొలి ఇన్నింగ్స్  లీడ్ లో  చండీగఢ్ చరిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీలో రౌండ్-9 ప్లేట్ గ్రూప్ లో భాగంగా మణిపూర్ తో జరిగిన మ్యాచ్ లో చండీగఢ్ కు 609 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

మణిపూర్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్ లో 26.4 ఓవర్లలో 63 పరుగులకే కుప్పకూలగా, ఆపై చండీగఢ్ 672 పరుగులకు 8వికెట్ల నష్టంతో మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ ేసింది. బిపుల్ శర్మ 200 పరుగులు చేశాడు. మొత్తం 276 బంతుల్లో 27 ఫోర్లు, 4 సిక్స్ లు కొట్టాడు. ఇక గురిందర్ సింగ్ కూడా 200 పరుగులు చేసి నాటౌట్ గా నలిాచాడు. వీరికి జతగా కీపర్ ఉదయ్ కౌల్(148) పరుగుల చేశాడు. ఫలితంగా భారత క్రికెట్‌ చరిత్రలో నాల్గో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని చండీగఢ్‌ లిఖించింది.

Also Read కాస్త హుందాగా ఉండు.. గంగూలీని టీజ్ చేసిన యూవీ...

ఈ మ్యాచ్ ఫిబ్రవరి 12వ తేదీన మ్యాచ్‌ ఆరంభం కాగా, రెండో రోజు ఆటకే మణిపూర్‌ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించడం గమనార్హం. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మణిపూర్‌ జట్టు  వికెట్‌ కోల్పోకుండా 33 పరుగులు చేసింది. 

కాగా, మణిపూర్‌ జట్టును నిన్న తొలి సెషన్‌లోనే ఆలౌట్‌ చేసి, దాదాపు రెండు రోజులు పాటు ఆడిన చండీగఢ్‌ అరుదైన రికార్డును నమెదు చేసింది. ఇప్పటివరకూ భారత క్రికెట్‌ ఫస్ట్‌క్లాస్‌ హిస్టరీలో తాజా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కంటే మూడు మాత్రమే ముందు వరుసలో ఉన్నాయి. 

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక ఆధిక్యం సాధించిన జట్లలో  హెల్కర్‌ జట్టు 722 పరుగుల మొదటి ఇన్నింగ్స్‌ను సాధించి తొలి స్థానంలో కొనసాగుతోంది. 1945-46 సీజన్‌లో హోల్కర్‌ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో912 పరుగులకు డిక్లేర్‌ చేయగా, మైసూర్‌ 190 పరుగులకే ఆలౌటైంది. 

ఆ తర్వాత 1993-94 సీజన్‌లో హైదరాబాద్‌ 681 పరుగుల ఆధిక్యాన్ని సాధించి రెండో స్థానంలో ఉంది. ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 944/6 వద్ద డిక్లేర్డ్‌ చేయగా, ఆంధ్ర తమ మొదటి ఇన్నింగ్స్‌లో  263 పరుగులకు ఆలౌటైంది. ఇక 2014-15 సీజన్‌లో కర్ణాటక 628 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సాధించింది. తమిళనాడు జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక తమ మొదటి ఇన్నింగ్స్‌లో 762 పరుగులు చేయగా, తమిళనాడును 134 పరుగులకు ఆలౌట్‌ చేసింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios