Asianet News TeluguAsianet News Telugu

రెండో టెస్టు: మరోసారి చేతులెత్తేసిన భారత్, వికెట్ నష్టపోకుండా కివీస్

న్యూజిలాండ్ పై జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో భారత్ తొలి ఇన్నింగ్స్  242 పరుగుల వద్ద ముగిసింది. ఛతేశ్వర పుజారా, హనుమ విహారి ఇద్దరు అర్థ సెంచరీలు చేశారు. కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు.

New zealnad vs India: second test match updates
Author
Christchurch, First Published Feb 29, 2020, 7:06 AM IST

క్రైస్ట్ చర్చ్: న్యూజిలాండ్ భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో భారత్ ధోరణి ఏ మాత్రం మారలేదు. 242 పరుగులకే భారత్ చేతులెత్తేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్సును ప్రారంభించి వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. టామ్ లాథమ్ 27 పరుగులతో, బ్లండెల్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

న్యూజిలాండ్ పై జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో భారత్ తొలి ఇన్నింగ్సు 242 పరుగుల వద్ద ముగిసింది. రవీంద్ర జడేజా 9 పరుగులు చేయగా, మొహమ్మద్ షమీ 16 పరుగులు చేశాడు. బుమ్రా 10 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జెమీసన్ ఐదు వికెట్లు తీయగా, సౌథీ, బౌల్ట్ లకు రెండేసి వికెట్లు దక్కాయి. వాగ్నర్ ఒక్క వికెట్ తీసుకున్నాడు.

న్యూజిలాండ్ పై జరుగుతున్న రెండో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో భారత్ 207 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఛతేశ్వర్ పుజారా 54 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ (12), ఉమేష్ యాదవ్ వెంటవెంటనే అవుటయ్యారు.భారత్ 194 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. హనుమ విహారి అర్థ సెంచరీ (55) చేసి వాగ్నర్ బౌలింగులో ఔటయ్యాడు. 

భారత బ్యాట్స్ మన్ ఛతేశ్వర పుజారా నిలకడగా ఆడుతూ అర్థ సెంచరీ సాధించాడు.  భారత్ 113 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. తొలి మ్యాచులో రాణించిన అజింక్యా రహానే ఈ మ్యాచులో కేవలం 7 పరుగులు చేసి సౌథీ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి బోల్తా కొట్టాడు. కేవలం 3 పరుగులు చేసి సౌథీ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు. దీంతో భారత్ 85 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.భారత్ లంచ్ విరామ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 3 పరుగులతోనూ ఛతేశ్వర్ పుజారా 15 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.

న్యూజిలాండ్ పై జరుగుతున్న రెండో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా రాణించాడు. టాస్ గెలిచి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. అయితే, ఆదిలోనే భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. తొలి టెస్టు మ్యాచులో రాణించిన మయాంక్ అగర్వాల్ కేవలం 7 పరుగులు చేసి ట్రెంట్ బౌలింగులో వెనుదిరిగాడు. దీంతో భారత్ 30 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 

బౌలింగ్ కు స్వర్గధామమైన క్రైస్ట్ చర్చ్ హెగ్లే ఓవల్ మైదానంలో పృథ్వీ షా స్వేచ్ఛగా ఆడుతూ షాట్లు కొడుతూ పరుగులు సాధిస్తూ వచ్చాడు. టెస్టు మ్యాచుల్లో పృథ్వీ షా తొలి అర్థ సెంచరీ సాధించాడు. 64 బంతుల్లో 54 పరుగులు చేసిన పృథ్వీషా జెమీసన్ బౌలింగ్ లో లాథమ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ 80 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios