Asianet News TeluguAsianet News Telugu

తొలి టెస్ట్, రెండో రోజు: ముగిసిన ఆట, న్యూజిలాండ్ స్కోరు 216/5

భారత్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ ఐదు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. విలియమ్సన్ సెంచరీ మిస్సయ్యాడు.

New Zealand vs India: First test second day updates
Author
Wellington, First Published Feb 22, 2020, 4:31 AM IST

వెల్లింగ్టన్: భారత్ పై జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్సులో న్యూజిలాండ్ రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. అంతకు ముందు నికోల్స్ 207 పరుగుల వద్ద ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. నికోల్స్ 62 బంతులను ఎదుర్కుని కేవలం 17 పరుగులు చేసి అశ్విన్ బౌలింగులో అవుటయ్యాడు.

భారత్ పై తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సెంచరీ మిస్సయ్యాడు. అతను 89 పరుగులు చేసి మొహమ్మద్ షమీ బౌలింగ్ లో వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ 185 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

నిలకడగా ఆడుతూ వచ్చిన రాస్ టైలర్ ఇషాంత్ శర్మ  బౌలింగులో 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. న్యూజిలాండ్ దాంతో మూడు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అర్థ సెంచరీ చేశాడు. న్యూజిలాండ్ 73 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. బ్లండెల్ 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాంత్ శర్మ బౌలింగులో అవుటయ్యాడు.

భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ 26 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. లాథమ్ ఇషాంత్ శర్మ బౌలింగులో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరుకున్నాడు.

న్యూజిలాండ్ పై జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 165 పరుగులకే కుప్పకూలింది. మొహమ్మద్ షమీ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సౌథీ బౌలింగులో అవుట్ కావడంతో భారత్ తొలి ఇన్నింగ్సు ముగిసింది. తొలి రోజు జెమీసన్ భారత బ్యాటింగ్ ను తుత్తునియలు చేయగా, రెండో రోజు సౌథీ ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఈ ఇద్దరు బ ౌలర్లు నాలుగేసి వికెట్లు పడగొట్టారు. ట్రెంట్ బౌల్ట్ కు ఒక్క వికెట్ మాత్రమే వచ్చింది.

భారత్ 165 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జెమీసన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.ఓ వైపు వికెట్లు టపటపా రాలిపడుతుంటే గోడలా నిలబడిన అజింక్యా రహానే ఎట్టకేలకు అవుటయ్యాడు. అతను అర్థ సెంచరీ మిస్సయ్యాడు. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సౌథీ బౌలింగులో వెనుదిరిగాడు. రహానే సహనంతో కివీస్ బౌలర్లకు పరీక్ష పెడుతూ  138 బంతులను ఎదుర్కున్నాడు. దీంతో 143 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది.

న్యూజిలాండ్ పై జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో భారత్ రెండో రోజు ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఐదు వికెట్ల నష్టానికి 122 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో శనివారం బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా మరో పది పరుగులు మాత్రమే జోడించి రెండు వికెట్లు కోల్పోయింది. 

భారత్ 132 పరుగుల వద్దనే రెండు వికెట్లు కోల్పోయింది. రిషబ్ పంత్ శనివారంనాడు తన వ్యక్తిగత స్కోరుకు మరో 9 పరుగులు జోడించాడు. అతను 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రన్నవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన రవిచంద్రన్ అశ్వన్ సౌథీ బౌలింగులో డకౌట్ అయ్యాడు. 

మొదటి రోజు ఆట రిపోర్ట్: కివీస్ బౌలర్ జెమీసన్ దెబ్బ: తొలి రోజు భారత్ స్కోరు 122/5

తొలి రోజు శుక్రవారం టీ విరామ సమయానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం కారణంగా ఆట సాగలేదు. దాంతోనే తొలి రోజు ఆట ముగిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios