టీమిండియా వైస్ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ  తన సోషల్ మీడియా మేనేజర్ గా ఎవరినైనా కొత్తగా ఎవరినైనా నియమించుకున్నారా..? అంటే ముంబయి ఇండియన్స్ జట్టు అవుననే అంటోంది. ఈ కొత్త సోషల్ మీడియా మేనేజర్ చాలా క్యూట్ గా ఉంది కదా.. ఎన్ని మార్కులు వేస్తారు అని కూడా అడుగుతున్నారు. ఇంతకీ ఆ మేనేజర్ ఎవరో తెలుసా...? రోహిత్ ముద్దుల కుమార్తె సమైరా.

Aslo Read కోహ్లీని ఔట్ చేసి సత్తాను పరీక్షించుకుంటా: ట్రెంట్ బౌల్ట్...

పూర్తి వివరాల్లోకి వెళితే... ఇటీవల రోహిత్ శర్మ గాయం కారణంగా న్యూజిలాండ్‌ వన్డే, టెస్టు సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ విశ్రాంతి సమయంలో సతీమణి రితిక, కుమార్తె సమైరాలతో కలిసి రోహిత్‌ సరదాగా గడుపుతున్నాడు. సమైరాతో కలిసి అతడు దిగిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫోన్‌లో తన కూతురికి రోహిత్‌ ఏదో చూపిస్తున్నాడు.

 

 అయితే సమైరా కూడా ఎంతో ఆసక్తిగా తండ్రి చూపిస్తున్న వైపే ఆసక్తిగా చూస్తోంది. చూడముచ్చటగా ఉన్న  ఈ ఫోటోను ముంబై ఇండియన్స్‌ ఫన్నీగా మార్చి  తిరిగి రీపోస్ట్‌ చేసింది. ‘రోహిత్‌ కొత్త సోషల్‌ మీడియా మేనేజర్‌.. ఎంత క్యూట్‌గా ఉంది. అమెకు ఒకటి నుంచి పది వరకు ఎన్ని పాయింట్లు ఇస్తారు’అంటూ ముంబై ఇండియన్స్‌ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది.

ఇక ఆ పోస్ట్ కూడా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. పదికి పది మార్కులు వేస్తామంటూ నెటిజన్లు ఆ పోస్టుకి స్పందించడం గమనార్హం. ఇదిలా ఉండగా ఐపీఎల్ 2020 మార్చి 29 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ముంబయి  ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.