గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత నుంచి టీమిండియ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆటను చూసేందుకు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు అభిమానులు. ఐపీఎల్‌లో చెన్నై తరపున ఆయన బరిలోకి దిగుతాడని ఎదురుచూసిన వారి ఆశలపై కరోనా వైరస్ నీళ్లు చల్లింది.

దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో అన్ని క్రీడలతో పాటు ఐపీఎల్ కూడా వాయిదా పడింది. దీంతో మిస్టర్ కూల్ కెరీర్ ఇక ముగిసినట్లేనని అభిమానులు ఫీలవుతున్నారు.

Also Read:ధోని ఫిట్ గా ఉన్నాడు, టి20 వరల్డ్ కప్ ఆడుతాడు: కోచ్

అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనాలు నమోదు చేసే సత్తా ఇంకా మిగిలేవుందన్నాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ వాయిదా పడిన నేపథ్యంలో ధోనీ ఇక రిటైర్‌మెంట్ చేస్తాడా అని ట్విట్టర్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు హాగ్ పై విధంగా స్పందించాడు.

ధోనీ ఎట్టి పరిస్ధితుల్లోనూ రిటైర్మెంట్ ప్రకటించడని తాను భావిస్తున్నాని.. మీడియాలో వస్తున్న కథనాలపైనా మిస్టర్ కూల్ మౌనం వహిస్తున్నాడని ఆయన చెప్పాడు. అతను సాధించాల్సింది ఇంకా కొంత మిగిలేవుందని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు.

Also Read:రూ.800కోట్ల ఆదాయం..కరోనా బాధితుకు రూ.లక్ష విరాళం.. ధోనీపై ట్రోల్స్

వచ్చే రెండేళ్లలో టీమిండియా తరుపున అతని సంచలనాలు నమోదవుతాయిన హాగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 38 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోనీ 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో భారత్ ఓటమి పాలైన తర్వాత మళ్లీ బ్యాట్ పట్టలేదు.

అప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్న ధోనీ తన స్థానాన్ని సంపాదించుకోవడానికి రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కు అవకావాలు ఇచ్చాడు. అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ధోనీ ఆడతాడేమోనని క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తోంది.