MIvsRCB: ఆఖరి ఓవర్, ఆఖరి బంతికి ఆర్‌సీబీ ఉత్కంఠ విజయం... ముంబై ఇండియన్స్‌కి..

MIvsRCB IPL 2021 Live Updates in Telugu Commentary CRA

IPL 2021: క్రికెట్ ప్రపంచంలోనే మెగా క్రికెట్ సమరం ఐపీఎల్ సీజన్ 14కి తెర లేచింది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలబడుతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రోహిత్ శర్మ ‘హిట్ మ్యాన్’ వర్సెస్ ‘కింగ్’ విరాట్ కోహ్లీ జట్ల మధ్య హోరాహోరీ ఫైట్‌ జరుగుతుందని అంచనా వేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు.

11:45 PM IST

ఆర్‌సీబీ మొదటిసారి...

ఇప్పటిదాకా మూడు సార్లు ఐపీఎల్ సీజన్‌ ఆరంభ మ్యాచులు ఆడిన ఆర్‌సీబీకి ఇదే తొలి విజయం... 2008తో పాటు 2017, 2019 సీజన్లలో మొదటి మ్యాచ్‌లో ఓడింది ఆర్‌సీబీ...

11:43 PM IST

ఐదు మ్యాచుల తర్వాత...

చెన్నైలో వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన రాయల్ ఛాలెంజర్స్‌, ఇది మొదటి విజయం కాగా... వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచిన ముంబై ఇండియన్స్‌కి ఇక్కడ ఇది తొలి ఓటమి...

11:40 PM IST

వరుసగా 9వ సీజన్‌లోనూ...

రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముంబై ఇండియన్స్ వరుసగా 9 సీజన్లలోనూ మొదటి మ్యాచుల్లో ఓటమి పాలైంది...

11:26 PM IST

ఆఖరి బంతికి ఉత్కంఠ విజయం...

160 పరుగుల విజయ లక్ష్యాన్ని 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

11:18 PM IST

డివిల్లియర్స్ రనౌట్...

డివిల్లియర్స్ రనౌట్... విజయానికి రెండు బంతుల్లో రెండు పరుగుల దూరంలో ఆర్‌సీబీ...

11:07 PM IST

12 బంతుల్లో 19 పరుగులు...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి ఆఖరి రెండు ఓవర్లలో 19 పరుగులు కావాలి...

10:59 PM IST

ఆరో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ...

ఆరో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ... 122 పరుగులకే 6 వికెట్లు... విజయానికి ఇంకా 21 బంతుల్లో 38 పరుగులు కావాలి...

10:48 PM IST

ఐదో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ...

 ఐదో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ... పీకల్లోతు కష్టాల్లో విరాట్ సేన...షాబజ్ అహ్మద్ భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఇంకా విజయానికి 5 ఓవర్లలో 54 పరుగులు కావాలి...

10:42 PM IST

మ్యాక్స్‌వెల్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ...

మ్యాక్స్‌వెల్ అవుట్... 103 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ...

10:35 PM IST

బుమ్రా వర్సెస్ కోహ్లీ...

29 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు... 

10:34 PM IST

విరాట్ కోహ్లీ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ...

10:24 PM IST

సిక్సర్ బాదిన మ్యాక్స్‌వెల్...

గత సీజన్‌లో 13 మ్యాచులు ఆడిన సిక్సర్ బాదలేకపోయిన మ్యాక్స్‌వెల్, ఐపీఎల్ 2021 సీజన్ మొదటి మ్యాచ్‌లోనే భారీ సిక్సర్ బాదాడు...

10:08 PM IST

7 ఓవర్లలో 50 పరుగులు...

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

10:07 PM IST

రజత్ పటిదార్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ...

ఓపెనర్‌గా వచ్చిన వాషింగ్టన్ సుందర్ 10 పరుగులు చేసి అవుటైన తర్వాత వచ్చిన రజత్ పటిదార్ 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

9:41 PM IST

మొదటి ఓవర్‌లో 10 పరుగులు...

ట్రెంట్ బౌల్ట్ వేసిన మొదటి ఓవర్‌లో 10 పరుగులు రాబట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

9:38 PM IST

రోహిత్ శర్మ క్యాచ్ డ్రాప్...

ఓపెనర్‌గా వచ్చిన సుందర్ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ శర్మ జారవిడిచాడు... 

9:37 PM IST

గేమ్ ఛేంజర్ హర్షల్ పటేల్...

20వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ మ్యాజిక్ చేశాడు. మొదటి బంతికి కృనాల్ పాండ్యాను అవుట్ చేసిన హర్షల్ పటేల్, తర్వాతి బంతికి కిరన్ పోలార్డ్ వికెట్ తీశాడు. మూడో బంతికి వికెట్ రాకపోయినా నాలుగో వికెట్‌కి మార్కో జెన్సన్‌ను డకౌట్ చేసిన హర్షల్ పటేల్... ఐదు వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు హర్షల్ పటేల్.

9:19 PM IST

టార్గెట్ 160..

ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.

9:17 PM IST

ఐదు వికెట్లు తీసిన హర్షల్ పటేల్...

ఐదు వికెట్లు తీసిన హర్షల్ పటేల్... 8వ వికెట్ కోల్పోయిన ముంబై...

9:14 PM IST

పోలార్డ్ అవుట్...

పోలార్డ్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్... వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసిన హర్షల్ పటేల్...

9:13 PM IST

కృనాల్ పాండ్యా అవుట్...

కృనాల్ పాండ్యా అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన ముంబై...

9:06 PM IST

విరాట్ డ్రాప్ క్యాచ్...

కృనాల్ పాండ్యా ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచాడు విరాట్ కోహ్లీ... 

9:03 PM IST

ఇషాన్ కిషన్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన ముంబై...

ఇషాన్ కిషన్ అవుట్...145 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన ముంబై...

9:02 PM IST

మరో డ్రాప్ క్యాచ్...

ఇషాన్ కిషన్ ఇచ్చిన క్యాచ్‌ను మరోసారి జారవిడిచాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డర్ సిరాజ్...

8:59 PM IST

17 ఓవర్లలో 142...

17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:57 PM IST

సుందర్ క్యాచ్ డ్రాప్...

సిరాజ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోలేకపోయాడు వాషింగ్టన్ సుందర్. దీంతో ఆ బంతికి బౌండరీ వచ్చింది...

8:48 PM IST

హార్ధిక్ పాండ్యా అవుట్...

హార్ధిక్ పాండ్యా అవుట్... 135 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై...

8:37 PM IST

క్రిస్ లీన్ హాఫ్ సెంచరీ మిస్...

35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేసిన క్రిస్ లీన్, హాఫ్ సెంచరీ ముగింట సుందర్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

8:33 PM IST

క్రిస్ లీన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ముంబై...

క్రిస్ లీన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:32 PM IST

100 మార్కు దాటిన ముంబై ఇండియన్స్...

సుందర్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన క్రిస్ లీన్... ముంబై ఇండియన్స్ స్కోరును 100 మార్కు దాటించాడు. 12.4 ఓవర్లలో 105 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:25 PM IST

సూర్యకుమార్ అవుట్...

సూర్యకుమార్ అవుట్... 94 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్..

8:23 PM IST

సూర్యకుమార్ యాదవ్ సూపర్ సిక్సర్....

జెమ్మీసన్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు సూర్యకుమార్ యాదవ్. 

8:20 PM IST

10 ఓవర్లలో 86...

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. చాహాల్ వేసిన 10వ ఓవర్‌లో కేవలం 3 పరుగులే ఇచ్చాడు.

8:12 PM IST

50 పరుగుల భాగస్వామ్యం...

రోహిత్ శర్మ అవుటైన తర్వాత స్పీడ్ పెంచిన క్రిస్ లీన్, సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి రెండో వికెట్‌కి 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు..

8:05 PM IST

క్రిస్ లీన్ దూకుడు...

క్రిస్ లీన్ సిక్సర్ల మోత మోగిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు చేశాడు క్రిస్ లీన్...

7:59 PM IST

ఆరు ఓవర్లలో 41...

ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:52 PM IST

వస్తూనే బౌండరీ...

రోహిత్ శర్మ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, వస్తూనే తాను ఎదుర్కొన్న మొదటి బంతిని ఫోర్‌ బాదాడు. 

7:50 PM IST

రోహిత్ రికార్డు ఫీట్...

2015లో ఐపీఎల్ సీజన్‌లో మొట్టమొదటి సిక్సర్‌ బాదిన రోహిత్ శర్మ, మళ్లీ 2021లో ఈ ఫీట్ సాధించాడు. 15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసిన రోహిత్ శర్మ, చాహాల్ బౌలింగ్‌లో లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.

7:48 PM IST

రోహిత్ రనౌట్... తొలి వికెట్ కోల్పోయిన ముంబై...

రోహిత్ రనౌట్... 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ముంబై...

7:45 PM IST

రోహిత్ శర్మ రికార్డు ఫీట్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో మొదటి పరుగు, మొదటి బౌండరీ బాదిన ప్లేయర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ... గత నాలుగు సీజన్లలో మూడు సార్లు ఈ ఫీట్ సాధించాడు రోహిత్ శర్మ...

7:41 PM IST

రెండో ఓవర్‌లో ఒకే పరుగు...

రూ.15 కోట్లు కొనుగోలు చేసిన కేల్ జెమ్మీసన్ వేసిన రెండో ఓవర్‌లో కేవలం ఒకే పరుగు వచ్చింది. రెండు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది ముంబై...

7:35 PM IST

మొదటి ఓవర్‌లో 5 పరుగులు...

సిరాజ్ వేసిన మొదటి ఓవర్‌లో ఐదు పరుగులు రాబట్టాడు రోహిత్ శర్మ...

7:17 PM IST

చాహాల్ 100వ మ్యాచ్...

యజ్వేంద్ర చాహాల్ నేడు తన కెరీర్‌లో వందో ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్నాడు...

7:13 PM IST

ముంబై ఇండియన్స్ జట్టు:

ముంబై ఇండియన్స్ జట్టు:

క్రిస్ లీన్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, మార్కో జెన్సన్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, కిరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహార్, ట్రెంట్ బౌల్డ్, జస్ప్రిత్ బుమ్రా.

7:09 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇది:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇది: 

విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, మ్యాక్స్‌వెల్, జెమ్మీసన్, డాన్ క్రిస్టియన్, ఏబీ డివిల్లియర్స్, వాషింగ్టన్ సుందర్, హర్షల్ పటేల్, షాబజ్ అహ్మద్, సిరాజ్, చాహాల్

7:04 PM IST

రజత్ పటిదార్‌కి ఛాన్స్...

కరోనా బారిన పడిన దేవ్‌దత్ పడిక్కల్ స్థానంలో రజత్ పటిదార్ ఆరంగ్రేటం మ్యాచ్‌లో ఆడబోతున్నాడు... 

7:03 PM IST

టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ...

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై తొలుత బ్యాటింగ్ చేయనుంది...

6:58 PM IST

డి కాక్ దూరం...

ముంబై ఇండియన్స్ తరుపున స్టార్ ప్లేయర్లుగా గుర్తింపు పొందిన డి కాక్ మొదటి మ్యాచ్‌కి దూరం కానున్నాడు. 

6:51 PM IST

క్రిస్ లీన్ ఆరంగ్రేటం...

ముంబై ఇండియన్స్ తరుపున క్రిస్ లీన్ ఆరంగ్రేటం చేయనున్నాడు. అతనితో పాటు మార్కో జాన్సన్‌ కూడా ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇద్దరికీ ముంబై ఇండియన్స్ క్యాప్ అందించాడు రోహిత్ శర్మ... 

6:50 PM IST

వరుసగా హ్యాట్రిక్ ఓటములు...

గత సీజన్‌లో మొదటి 9 మ్యాచుల్లో 7 మ్యాచుల్లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచుల్లోనూ ఓడి, 2021 ఐపీఎల్‌ను నాలుగో స్థానంతో ముగించింది... వరుస పరాజయాలకు చెక్ పెట్టాలని చూస్తోంది ఆర్‌సీబీ...

6:49 PM IST

ముంబై మొదటి మ్యాచ్‌ సెంటిమెంట్...

రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చెపట్టిన తర్వాత వరుసగా 8 సీజన్లలోనూ మొదటి మ్యాచ్‌లో ఓడింది ముంబై ఇండియన్స్. మొదటి మ్యాచ్‌లో ఓడడం, ఆ తర్వాత అదిరిపోయే ప్రదర్శనతో టైటిల్ గెలవడం ఆనవాయితీగా వస్తోంది...

6:48 PM IST

ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ...

ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ... ఐపీఎల్ 2021లో కూడా ఓపెనర్‌గా కొనసాగుతాడని ప్రకటించాడు. దీంతో ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా కొనసాగే అవకాశం ఉంది.

6:47 PM IST

టాస్‌లో సమవుజ్జీలు...

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మధ్య జరిగిన 14 మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ ఏడు సార్లు, ఆర్‌సీబీ ఏడుసార్లు టాస్ గెలవడం విశేషం...

6:45 PM IST

రోహిత్ 10- విరాట్ 4...

ఇప్పటిదాకా రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 14 మ్యాచులు జరగగా 10 మ్యాచుల్లో ముంబైకి విజయం దక్కింది. నాలుగు మ్యాచుల్లో మాత్రమే విరాట్ సేనను విజయం దక్కింది.

11:46 PM IST:

ఇప్పటిదాకా మూడు సార్లు ఐపీఎల్ సీజన్‌ ఆరంభ మ్యాచులు ఆడిన ఆర్‌సీబీకి ఇదే తొలి విజయం... 2008తో పాటు 2017, 2019 సీజన్లలో మొదటి మ్యాచ్‌లో ఓడింది ఆర్‌సీబీ...

11:45 PM IST:

చెన్నైలో వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన రాయల్ ఛాలెంజర్స్‌, ఇది మొదటి విజయం కాగా... వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచిన ముంబై ఇండియన్స్‌కి ఇక్కడ ఇది తొలి ఓటమి...

11:41 PM IST:

రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముంబై ఇండియన్స్ వరుసగా 9 సీజన్లలోనూ మొదటి మ్యాచుల్లో ఓటమి పాలైంది...

11:27 PM IST:

160 పరుగుల విజయ లక్ష్యాన్ని 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

11:20 PM IST:

డివిల్లియర్స్ రనౌట్... విజయానికి రెండు బంతుల్లో రెండు పరుగుల దూరంలో ఆర్‌సీబీ...

11:08 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి ఆఖరి రెండు ఓవర్లలో 19 పరుగులు కావాలి...

11:00 PM IST:

ఆరో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ... 122 పరుగులకే 6 వికెట్లు... విజయానికి ఇంకా 21 బంతుల్లో 38 పరుగులు కావాలి...

10:49 PM IST:

 ఐదో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ... పీకల్లోతు కష్టాల్లో విరాట్ సేన...షాబజ్ అహ్మద్ భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఇంకా విజయానికి 5 ఓవర్లలో 54 పరుగులు కావాలి...

10:43 PM IST:

మ్యాక్స్‌వెల్ అవుట్... 103 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ...

10:36 PM IST:

29 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు... 

10:34 PM IST:

విరాట్ కోహ్లీ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ...

10:25 PM IST:

గత సీజన్‌లో 13 మ్యాచులు ఆడిన సిక్సర్ బాదలేకపోయిన మ్యాక్స్‌వెల్, ఐపీఎల్ 2021 సీజన్ మొదటి మ్యాచ్‌లోనే భారీ సిక్సర్ బాదాడు...

10:09 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

10:08 PM IST:

ఓపెనర్‌గా వచ్చిన వాషింగ్టన్ సుందర్ 10 పరుగులు చేసి అవుటైన తర్వాత వచ్చిన రజత్ పటిదార్ 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

9:42 PM IST:

ట్రెంట్ బౌల్ట్ వేసిన మొదటి ఓవర్‌లో 10 పరుగులు రాబట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

9:38 PM IST:

ఓపెనర్‌గా వచ్చిన సుందర్ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ శర్మ జారవిడిచాడు... 

9:38 PM IST:

20వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ మ్యాజిక్ చేశాడు. మొదటి బంతికి కృనాల్ పాండ్యాను అవుట్ చేసిన హర్షల్ పటేల్, తర్వాతి బంతికి కిరన్ పోలార్డ్ వికెట్ తీశాడు. మూడో బంతికి వికెట్ రాకపోయినా నాలుగో వికెట్‌కి మార్కో జెన్సన్‌ను డకౌట్ చేసిన హర్షల్ పటేల్... ఐదు వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు హర్షల్ పటేల్.

9:20 PM IST:

ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.

9:18 PM IST:

ఐదు వికెట్లు తీసిన హర్షల్ పటేల్... 8వ వికెట్ కోల్పోయిన ముంబై...

9:15 PM IST:

పోలార్డ్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్... వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసిన హర్షల్ పటేల్...

9:13 PM IST:

కృనాల్ పాండ్యా అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన ముంబై...

9:07 PM IST:

కృనాల్ పాండ్యా ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచాడు విరాట్ కోహ్లీ... 

9:04 PM IST:

ఇషాన్ కిషన్ అవుట్...145 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన ముంబై...

9:03 PM IST:

ఇషాన్ కిషన్ ఇచ్చిన క్యాచ్‌ను మరోసారి జారవిడిచాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డర్ సిరాజ్...

8:59 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:58 PM IST:

సిరాజ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోలేకపోయాడు వాషింగ్టన్ సుందర్. దీంతో ఆ బంతికి బౌండరీ వచ్చింది...

8:50 PM IST:

హార్ధిక్ పాండ్యా అవుట్... 135 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై...

8:53 PM IST:

35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేసిన క్రిస్ లీన్, హాఫ్ సెంచరీ ముగింట సుందర్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

8:34 PM IST:

క్రిస్ లీన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:33 PM IST:

సుందర్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన క్రిస్ లీన్... ముంబై ఇండియన్స్ స్కోరును 100 మార్కు దాటించాడు. 12.4 ఓవర్లలో 105 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:25 PM IST:

సూర్యకుమార్ అవుట్... 94 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్..

8:24 PM IST:

జెమ్మీసన్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు సూర్యకుమార్ యాదవ్. 

8:21 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. చాహాల్ వేసిన 10వ ఓవర్‌లో కేవలం 3 పరుగులే ఇచ్చాడు.

8:14 PM IST:

రోహిత్ శర్మ అవుటైన తర్వాత స్పీడ్ పెంచిన క్రిస్ లీన్, సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి రెండో వికెట్‌కి 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు..

8:06 PM IST:

క్రిస్ లీన్ సిక్సర్ల మోత మోగిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు చేశాడు క్రిస్ లీన్...

8:00 PM IST:

ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:00 PM IST:

ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:52 PM IST:

రోహిత్ శర్మ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, వస్తూనే తాను ఎదుర్కొన్న మొదటి బంతిని ఫోర్‌ బాదాడు. 

7:51 PM IST:

2015లో ఐపీఎల్ సీజన్‌లో మొట్టమొదటి సిక్సర్‌ బాదిన రోహిత్ శర్మ, మళ్లీ 2021లో ఈ ఫీట్ సాధించాడు. 15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసిన రోహిత్ శర్మ, చాహాల్ బౌలింగ్‌లో లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.

7:49 PM IST:

రోహిత్ రనౌట్... 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ముంబై...

7:47 PM IST:

ఐపీఎల్ 2021 సీజన్‌లో మొదటి పరుగు, మొదటి బౌండరీ బాదిన ప్లేయర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ... గత నాలుగు సీజన్లలో మూడు సార్లు ఈ ఫీట్ సాధించాడు రోహిత్ శర్మ...

7:41 PM IST:

రూ.15 కోట్లు కొనుగోలు చేసిన కేల్ జెమ్మీసన్ వేసిన రెండో ఓవర్‌లో కేవలం ఒకే పరుగు వచ్చింది. రెండు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది ముంబై...

7:35 PM IST:

సిరాజ్ వేసిన మొదటి ఓవర్‌లో ఐదు పరుగులు రాబట్టాడు రోహిత్ శర్మ...

7:18 PM IST:

యజ్వేంద్ర చాహాల్ నేడు తన కెరీర్‌లో వందో ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్నాడు...

7:14 PM IST:

ముంబై ఇండియన్స్ జట్టు:

క్రిస్ లీన్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, మార్కో జెన్సన్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, కిరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహార్, ట్రెంట్ బౌల్డ్, జస్ప్రిత్ బుమ్రా.

7:16 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇది: 

విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, మ్యాక్స్‌వెల్, జెమ్మీసన్, డాన్ క్రిస్టియన్, ఏబీ డివిల్లియర్స్, వాషింగ్టన్ సుందర్, హర్షల్ పటేల్, షాబజ్ అహ్మద్, సిరాజ్, చాహాల్

7:05 PM IST:

కరోనా బారిన పడిన దేవ్‌దత్ పడిక్కల్ స్థానంలో రజత్ పటిదార్ ఆరంగ్రేటం మ్యాచ్‌లో ఆడబోతున్నాడు... 

7:04 PM IST:

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై తొలుత బ్యాటింగ్ చేయనుంది...

7:13 PM IST:

ముంబై ఇండియన్స్ తరుపున స్టార్ ప్లేయర్లుగా గుర్తింపు పొందిన డి కాక్ మొదటి మ్యాచ్‌కి దూరం కానున్నాడు. 

6:53 PM IST:

ముంబై ఇండియన్స్ తరుపున క్రిస్ లీన్ ఆరంగ్రేటం చేయనున్నాడు. అతనితో పాటు మార్కో జాన్సన్‌ కూడా ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇద్దరికీ ముంబై ఇండియన్స్ క్యాప్ అందించాడు రోహిత్ శర్మ... 

6:51 PM IST:

గత సీజన్‌లో మొదటి 9 మ్యాచుల్లో 7 మ్యాచుల్లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచుల్లోనూ ఓడి, 2021 ఐపీఎల్‌ను నాలుగో స్థానంతో ముగించింది... వరుస పరాజయాలకు చెక్ పెట్టాలని చూస్తోంది ఆర్‌సీబీ...

6:50 PM IST:

రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చెపట్టిన తర్వాత వరుసగా 8 సీజన్లలోనూ మొదటి మ్యాచ్‌లో ఓడింది ముంబై ఇండియన్స్. మొదటి మ్యాచ్‌లో ఓడడం, ఆ తర్వాత అదిరిపోయే ప్రదర్శనతో టైటిల్ గెలవడం ఆనవాయితీగా వస్తోంది...

6:49 PM IST:

ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ... ఐపీఎల్ 2021లో కూడా ఓపెనర్‌గా కొనసాగుతాడని ప్రకటించాడు. దీంతో ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా కొనసాగే అవకాశం ఉంది.

6:48 PM IST:

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మధ్య జరిగిన 14 మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ ఏడు సార్లు, ఆర్‌సీబీ ఏడుసార్లు టాస్ గెలవడం విశేషం...

6:46 PM IST: