కరోనా దెబ్బకు అందరూ ఇండ్లలోనే ఉంటున్నారు. లాక్ డౌన్ నడుస్తుండడంతో అందరూ ఇండ్లలో ఖాళీగా తమకు తోచిన పని చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇక భారత క్రికెటర్లంతా ఈ లాక్ డౌన్ కి సహకరించాలంటూ పిలుపునిస్తున్నారు. పనిలో పనిగా ఇండ్లలో ఉంది తాము ఏమి చేస్తున్నామో కూడా చెబుతున్నారు. 

తాజాగా భారత యువ అల్ రౌండర్ హార్దిక పాండ్య వర్కౌట్ పూర్తయిన తరువాత తన గర్ల్ ఫ్రెండ్, అన్న, వదినలతో కలిసిన ఒక ఫోటోను జత చేసి హద ఫన్ విత్ మై బేబీస్ అని రాసుకొచ్చాడు. 

ఈ ఫొటోలో హార్దిక్ తోపాటు అతడి గర్ల్ ఫ్రెం నటాషా తో పాటుగా అన్న కరుణాళ్ పాండ్య, వదిన పాంఖురి కూడా ఉన్నారు. ఇంట్లోనే ఉన్న వర్క్ అవుట్ ఏరియాలో ఇలా రోజు కసరత్తులు చేస్తూ అన్నదమ్ములు ఇలా తమ ఫిట్నెస్ ని కాపాడుకుంటున్నారు. 

ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ప్రజలందరికీ ఇంట్లోనే ఉండాలని పిలుపునిస్తూ వీడియో కూడా పోస్ట్ చేసాడు. అంతకు ముందు భార్య అనుష్క శర్మతో కలిసి ఇదే విధంగా ప్రజలంధర్మ కలిసి కరోనా పై ఇండ్లలోనే కూర్చొని పోరు సలుపుదామని పిలుపునిచ్చాడు. 

ఇక మిగిలిన క్రికెటర్లు కూడా ఖాళీ సమయంలో ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా భారత యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఖాళీ సమయంలో ఫిట్‌నెస్‌ మెరుగు పరచుకునేందుకు యత్నిస్తున్నాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం బీసీసీఐ ఓ వీడియోను తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. 

కోవిడ్ 19 కారణంగా ప్రధాని నరేంద్రమోడీ 21 రోజులు దేశంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో ఈ ఖాళీ సమయాన్ని పంత్ ఉపయోగించుకుంటున్నాడు. అందులో భాగంగా రిషభ్ పుష్‌అప్‌లు, ట్రెడ్‌మిల్‌పై పరుగులు తీయడం వంటి పనులు చేస్తున్నాడు.

Also Read:హెడ్డింగ్ కాదు.. వార్త మొత్తం చదువు.. అభిమానికి స్టోక్స్ పంచ్

ఈ వారం ప్రారంభంలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ భార్యతో గడిపిన వీడియోలను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ధావన్ బట్టలు  ఉతకడం, వాష్‌రూమ్‌ శుభ్రం చేస్తున్నాడు. అయితే ఆ సమయంలో అతని భార్య స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించింది.

ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో బాలీవుడ్ హిట్ సాంగ్ ‘‘జబ్ సే హుయ్ హై షాదీ’’ ప్లే అవుతోంది. కాగా భారత్- దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌ కరోనా కారణంగా వాయిదా పడింది. దీనితో పాటు ఐపీఎల్ 2020 కూడా ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే.