Asianet News TeluguAsianet News Telugu

వన్డే ఇంటర్నేషనల్... కుల్దీప్ యాదవ్ సంచలన రికార్డ్

ముంబయి వేదికగా జరిగిన తొలి వన్డేలో కుల్దీప్ ఆడినప్పటికీ... ఆ మ్యాచులో బౌలర్లంతా విఫలమయ్యారు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. దీంతో రెండో వన్డేలో కుల్దీప్ యాదవ్ సత్తా చాటాడు. ఆసిస్ క్రికెటర్లు అలెక్స్ క్యారీ, స్టీవ్ స్మిత్ లను ఔట్ చేశాడు.

Kuldeep Yadav Becomes Fastest Indian Spinner To 100 ODI Wickets
Author
Hyderabad, First Published Jan 18, 2020, 11:50 AM IST

టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సంచలన రికార్డును సాధించాడు. ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాతో వన్డే ఇంటర్నేషనల్ కోసం తలపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు మ్యాచులు జరగగా... మొదటిది ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. మరోటి...భారత్ కైవసమైంది. ఈ అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లోనూ కుల్దీప్ యాదవ్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన సత్తాచాటాడు. కీలకమైన రెండు వికెట్లు తీసి.. కంగారూలకు చెమటలు పట్టించాడు. ఈ క్రమంలో తాను భారత్ తరపున ఓ అద్భుతమైన రికార్డును సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన భారత స్పిన్నర్ గా నిలిచాడు.

Also Read కేఎల్ రాహులని ఇంటర్వ్యూ చేసిన ధావన్... చాహల్ పై జోక్స్...

ముంబయి వేదికగా జరిగిన తొలి వన్డేలో కుల్దీప్ ఆడినప్పటికీ... ఆ మ్యాచులో బౌలర్లంతా విఫలమయ్యారు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. దీంతో రెండో వన్డేలో కుల్దీప్ యాదవ్ సత్తా చాటాడు. ఆసిస్ క్రికెటర్లు అలెక్స్ క్యారీ, స్టీవ్ స్మిత్ లను ఔట్ చేశాడు. దీంతో దీంతో 44 మ్యాచ్‌ల్లోనూ వంద వికెట్ల మైలురాయిని అధిగమించాడు. ఈక్రమంలో ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించిన భారత స్పిన్నర్‌గా నిలిచాడు.

వన్డేల్లో భారత్ తరపున వంద వికెట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన 22వ భారత బౌలర్‌గా కుల్దీప్ నిలిచాడు. ఓవరాల్‌గా తను ఎనిమిదో భారత స్పిన్నర్. మరోవైపు రాజ్‌కోట్‌లో శుక్రవారం జరిగిన రెండోవన్డేలో భారత్ 36 పరుగులతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 340/6 చేసింది. శిఖర్ ధావన్ (96) టాప్ స్కోరర్ గా నిలిచాడు.

Follow Us:
Download App:
  • android
  • ios