కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వరుసగా ఐదో మ్యాచ్ గెలిచి, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. కేకేఆర్ విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 7 బంతులు మిగిలి ఉండగానే చేధించింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
KKR vs KXIP: ఆడుతూ పాడుతూ ఐదో గెలుపు... ప్లేఆఫ్ రేసులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు కోల్‌కత్తా నైట్‌రైటర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. 11 మ్యాచుల్లో 6 విజయాలు సాధించిన కేకేఆర్, నేటి మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్ బెర్త్‌కి మరింత చేరవవుతుంది. మరో పంజాబ్ ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే నేటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే.
వరుసగా ఐదో విజయం...
గేల్ అవుట్...
విజయానికి 3 పరుగులు కావాల్సిన దశలో క్రిస్ గేల్ అవుట్ అయ్యాడు.
గేల్ అవుట్...
విజయానికి 3 పరుగులు కావాల్సిన దశలో క్రిస్ గేల్ అవుట్ అయ్యాడు.
12 బంతుల్లో 3 పరుగులు...
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 2 ఓవర్లలో 3 పరుగులు కావాలి...
18 బంతుల్లో 14 పరుగులు...
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి చివరి 3 ఓవర్లలో 14 పరుగులు కావాలి...
గేల్ బాదుడు....
17వ ఓవర్ మొదటి రెండు బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్ బాదాడు క్రిస్ గేల్. విజయానికి 21 బంతుల్లో 17 పరుగులు కావాలి...
24 బంతుల్లో 27 పరుగులు...
16 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 123 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. విజయానికి చివరి 4 ఓవర్లలో 27 పరుగులు కావాలి...
30 బంతుల్లో 37 పరుగులు....
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి ఐదు ఓవర్లలో 37 పరుగులు కావాలి....
14 ఓవర్లలో 104....
14 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. విజయానికి 36 బంతుల్లో 46 పరుగులు కావాలి...
12 ఓవర్లలో 86....
12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. విజయానికి 48 బంతుల్లో 64 పరుగులు కావాలి....
గేల్ మరో సిక్సర్...
11వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ కొట్టాడు క్రిస్ గేల్. దీంతో 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
గేల్ సిక్సర్...
10వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు క్రిస్ గేల్. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
9 ఓవర్లలో 50...
9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
కెఎల్ రాహుల్ అవుట్...
కెఎల్ రాహుల్ అవుట్... 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
7 ఓవర్లలో 41...
7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 41 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
6 ఓవర్లలో 36...
150 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 6 ఓవర్లు ముగిసేసరికి 36 పరుగులు చేసింది.
టార్గెట్ 150...
20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది కేకేఆర్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టార్గెట్ 150 పరుగులు...
వరుణ్ చక్రవర్తి అవుట్...
వరుణ్ చక్రవర్తి అవుట్... 149 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయిన కేకేఆర్...
గిల్ అవుట్...
గిల్ అవుట్... ఎనిమిదో వికెట్ కోల్పోయిన కేకేఆర్...
18 ఓవర్లలో 135...
18 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది కేకేఆర్...