Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బ్రేకింగ్... మళ్లీ సన్ రైజర్స్ పగ్గాలు డేవిడ్ వార్నర్ కే..!

గతంలో సన్ రైజర్స్ టీం వార్నర్ కెప్టెన్ గా ఉండేవాడు. 2016లో వార్నర్ సారథ్యంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ట్రోఫీ గెలుచుకుంది. అయితే... రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా బాల్ ట్యాంపరింగ్ వివాదంలో వార్నర్ ఇరుక్కున్నాడు

IPL 2020: David Warner replaces Kane Williamson as Sunrisers Hyderabad captain
Author
Hyderabad, First Published Feb 27, 2020, 11:47 AM IST

క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 13వ సీజన్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. సరిగ్గా నెల రోజుల్లో ఐపీఎల్ మ్యాచులు ప్రారంభం కానున్న నేపథ్యంలో... సన్ రైజర్స్ హైదరాబాద్  సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు కెప్టెన్ గా ఆసిస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ని ఎంచుకున్నారు. ఈ విషయాన్ని సన్ రైజర్స్ తాజాగా ప్రకటించింది.

గతంలో సన్ రైజర్స్ టీం వార్నర్ కెప్టెన్ గా ఉండేవాడు. 2016లో వార్నర్ సారథ్యంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ట్రోఫీ గెలుచుకుంది. అయితే... రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా బాల్ ట్యాంపరింగ్ వివాదంలో వార్నర్ ఇరుక్కున్నాడు. ఆస్ట్రేలియా జట్టుకు వార్నర్ వైస్ కెప్టెన్ అన్న సంగతి తెలిసిందే. టాంపరింగ్ కు పాల్పడిన బాన్ క్రాఫ్ట్ అమాయకుడని.. కెప్టెన్ స్మిత్.. వైస్ కెప్టెన్ వార్నర్ కలిసే ఈ వ్యూహం రచించారని తేలింది.

Also Read అభిమానులకు పండగే... మార్చి 2న మైదానంలోకి ధోనీ...

దీంతో వార్నర్ ని ఈ వివాదంలో దోషిగా తేల్చారు. స్మిత్, బాన్ క్రాఫ్ట్ లతోపాటు వార్నర్ ని ఆసిస్ జట్టు నుంచి తొలగించారు. వారిపై సంవత్సరంపాటు నిషేధం ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిన 24గంటలకే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి కూడా వార్నర్ ని తొలగించారు. ఆ స్థానంలో విలియమ్సన్ కెప్టెగా నియమించారు. తాజాగా... మళ్లీ వార్నర్ కి జట్టు పట్టాలు అప్పిగస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాగా... ఈ వార్త హైదరాబాద్  జట్టు అభిమానులకు నిజంగా పండగలాంటి వార్తే. 

Follow Us:
Download App:
  • android
  • ios