Asianet News TeluguAsianet News Telugu

Trivandrum T20I: కోహ్లీ సేనకు షాక్, చితక్కొట్టిన విండీస్, సిరీస్ సమం

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-వెస్టిండీస్‌ల మధ్య త్రివేండ్రంలో జిరిగిన రెండో ట్వంటీ20 మ్యాచులో వెస్టిండీస్ ఇండియాకు షాక్ ఇచ్చింది. ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించి సిరీస్ ను సమం చేసింది.

India vs West Indies, 2nd T20I - Live Cricket Updates
Author
Trivandrum, First Published Dec 8, 2019, 7:08 PM IST

మూడు మ్యాచులో సిరీస్ లో భాగంగా ఆదివారం ట్రివేండ్రంలో జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచులో వెస్టిండీస్ భారత్ కు షాక్ ఇచ్చింది. ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్ ను సమం చేసింది. దీంతో మూడో టీ20 మ్యాచుపై ఉత్కంఠ నెలకొంది. 9 బంతులు మిగిలి ఉండగానే వెస్టిండీస్ భారత్ తన ముందు ఉంచిన 171 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి ఛేదించింది. 

సిమన్స్ 45 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్ ల సాయంతో 67 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత పూరన్ దూకుడుగా ఆడి 18 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్స్ ల సాయంతో 38 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసుకున్నారు, విజయంతో వెస్టిండీస్ 1-1 స్కోరుతో సిరీస్ ను సమం చేసింది. దాంతో మూడో మ్యాచుపై ఉత్కంఠ చోటు చేసుకుంది.

భారత్ పై జరిగిన రెండో టీ20 మ్యాచులో వెస్టిండీస్ 112 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.రవీంద్ర జడేజా బౌలింగులో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి హెట్ మెయిర్ 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు.

అంతకు ముందు ఎట్టకేలకు టీమిండియా బౌలర్లు విండీస్ ఓపెనర్లను విడదీయగలిగారు. భారీ షాట్లతో విరుచుకుపడిన ఓపెనర్ లెవీస్‌ను వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మాయాజాలంతో బొల్తా కొట్టించాడు. 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారీ షాట్ ఆడేందుకు క్రీజు వదిలి ముందుకొచ్చిన లెవీస్‌ను కీపర్ రిషబ్ పంత్ స్టంపౌట్ చేశాడు.

త్రివేండ్రం టీ20లో టీమిండియా.. వెస్టిండీస్ ముందు 171 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఆరంభం నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన కరేబియన్లు భారత బ్యాట్స్‌మెన్లు పరుగులు చేయకుండా అడ్డుకున్నారు.

రోహిత్, కోహ్లీ సైతం విఫలమవ్వడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. శివమ్ దూబే 54, రిషబ్ పంత్ 33 పరుగులతో రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో విలియమ్స్, వాల్ష్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 

స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో వాషింగ్టన్ సుందర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. సుందర్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను కాట్రెల్ అందుకున్నాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఔటయ్యాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విలియమ్స్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడిన జడేజా క్లీన్ బౌల్డయ్యాడు. భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. వాల్ష్ స్పిన్ మాయాజాలానికి శ్రేయస్ అయ్యర్ 10 పరుగుల వద్ద బ్రెండన్ కింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విలియమ్స్ బౌలింగ్‌లో సిమ్మన్స్‌కు క్యాచ్ ఇచ్చి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. విరాట్ ఔటైన వెంటనే స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్ధ వాతావరణం చోటు చేసుకుంది.

కొత్త కుర్రాడు శివమ్ దూబే తొలి మ్యాచ్‌లోనే అర్థసెంచరీ నమోదు చేశాడు. వచ్చి రావడంతోనే భారీ షాట్లతో విరుచుకుపడిన దూబే 27 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఆ వెంటనే ఒక ఫోర్ కొట్టిన దూబే 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వాల్ష్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి హెట్మేయర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ రెండో టీ20లోనూ నిరాశ పరిచాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.తొలి టీ20లో అద్భుతంగా ఆడి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ లోకేశ్ రాహుల్ పెవిలియన్ చేరుకున్నాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఖారీ పిర్రె బౌలింగ్‌లో హెట్మేయర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-వెస్టిండీస్‌ల మధ్య త్రివేండ్రంలో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉండగా.. సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని విండీస్ భావించింది. కాగా సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. 

భారత జట్టు:  రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్, శ్రేయస్‌ అయ్యర్‌, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్‌, దీపక్‌ చాహర్‌, యుజువేంద్ర చాహల్

వెస్టిండీస్ జట్టు:  సిమన్స్‌, లూయిస్‌, కింగ్‌, హెట్‌మెయిర్‌, పొలార్డ్‌ (కెప్టెన్‌), హోల్డర్‌, పూరన్‌, పియర్‌, హేడెన్‌ వాల్ష్‌, విలియమ్స్‌, కాట్రెల్‌      

Follow Us:
Download App:
  • android
  • ios