న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంది. టి 20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయగా... వన్డే సిరీస్ లో వైట్ వాష్ ఓటమిని చవిచూసింది. రేపటి నుండి టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమవుతోంది భారత్. 

అయితే... సాధారణ టెస్టు మ్యాచుల్లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ను ఎంచుకుంటుంది. కానీ వెల్లింగ్టన్ లో మాత్రం పరిస్థితులు అందుకు పూర్తి భిన్నం. అక్కడి గ్రౌండ్ ఒకింత డిఫరెంట్ గా ఉంటుంది.

సముద్రం మీదుగా వీచే గాలులు అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తుంటే... పిచ్ స్వభావం రోజు రోజుకి మారి పోతుంటుంది. ఈ నేపథ్యంలో ఈ గ్రౌండ్ లో అసలు పరిస్థితులు ఏమిటి? ఎందుకు అలా మారుతుంటాయి... ఆ సవాల్ ఏమిటో ఒక సారి చూద్దాం. 

Also read; బుమ్రాకు ఇక ఈజీ కాదు: కివీస్ బ్యాట్స్ మెన్ నేర్పిన పాఠం ఇదే...

న్యూజిలాండ్‌ బ్యాట్స్ మెన్ ను న్యూజిలాండ్ లో నిలువరించటం, బౌలర్లను ఎదుర్కొవటం అంత సులువు కాదు. వీటికి తోడు వెల్లింగ్టన్‌ మైదానం పరిస్థితులు భారత్‌కు పరీక్ష పెడుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా టాస్‌ నెగ్గిన జట్టు టెస్టుల్లో నాల్గో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు ఏమాత్రం ఇష్టపడదు. 

కానీ న్యూజిలాండ్‌లో, ప్రత్యేకించి వెల్లింగ్టన్‌లో రెండో ఇన్నింగ్స్‌ నుంచి పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. ఇక్కడ రాను రాను పిచ్చులు ఫ్లాట్ గా మారిపోతాయి. ఇక్కడ చివరి టెస్టులోనూ న్యూజిలాండ్‌ను భారత్‌ 192 పరుగులకే కుప్పకూల్చింది. కానీ మూడో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 680 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 

వెల్లింగ్టన్‌లో గాలి ప్రభావం అధికం. ఇక్కడ ఓ ఎండ్‌లో బ్యాట్స్‌మెన్‌కు అపసవ్య దిశలో గాలులు వీస్తాయి, మరో ఎండ్‌లో సవ్య దిశలో గాలులు వీస్తాయి. ఆ గాలులు చాలా బలంగా ఉండడం వల్ల అవి బాల్ వేగం పై బ్యాట్స్ మెన్ షాట్స్ పై ప్రభావాన్ని చూపెడతాయి. 

Also read; కోహ్లీని ఔట్ చేసి సత్తాను పరీక్షించుకుంటా: ట్రెంట్ బౌల్ట్

ఏ ఎండ్‌ నుంచి పేసర్లను, స్పిన్నర్లపై దాడి చేయాలనేది బ్యాట్స్‌మెన్‌ నిర్ణయించుకోవాలి. ఏ బౌలర్‌ను ఏ ఎండ్‌ నుంచి ప్రయోగించాలి అనేది ఫీల్డింగ్‌ జట్టు తేల్చుకోవాలి. మ్యాచ్‌ పరిస్థితుల్లో అంచనా వేసి సరైన వ్యూహంతో దాడి చేయాలి. 

న్యూజిలాండ్‌ ఇక్కడ స్వదేశీ అడ్వాంటేజ్ తో మ్యాచ్ ను ఆడుతోంది. పిచ్ పరిస్థితులను బట్టి చూస్తుంటే.... దాన్ని అర్థం చేసుకున్న న్యూజిలాండ్ కు ఒకింత లాభం ఉందని చెప్పొచ్చు.