Asianet News TeluguAsianet News Telugu

India vs West Indies: తొలి వన్డేలో టీమిండియాకు షాక్..8 వికెట్ల తేడాతో విండీస్ విజయం

రాహుల్, కోహ్లీ వికెట్లను వరుసగా ఒకే ఓవర్లో కోల్పోవడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది. 

India looses kohli, rahul's wickets early
Author
Chennai, First Published Dec 15, 2019, 2:14 PM IST

టీమిండియాకు వెస్టిండీస్ షాకిచ్చింది. తొలి వన్డేలో భారత్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన విండీస్ 47.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 291 పరుగుల చేసి లక్ష్యాన్ని ఛేదించింది. హెట్మేయర్ 139, షై హోప్ 102 పరుగులతో రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

విధ్వంసక ఆటగాడు హెట్మేయర్‌ను ఎట్టకేలకు భారత బౌలర్లు ఔట్ చేశారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న అతనిని అడ్డుకునేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా ప్రయత్నించాడు.

ఈ క్రమంలో 139 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి హెట్మేయర్ ఔటయ్యాడు. దీంతో 219 పరుగుల రికార్డు భాగస్వామ్యానికి తెరపడింది. 

విండీస్ ఓపెనర్ షైహోప్ నిలకడగా ఆడుతూ అర్థసెంచరీ సాధించాడు. రవీంద్ర జడేజా వేసిన 30వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసిన అతను హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 

హెట్మేయర్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి నుంచి దూకుడుగా ఆడిన అతను అర్థసెంచరీ తర్వాత సైతం ఎదురుదాడి కొనసాగించాడు. ఈ క్రమంలో 85 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 

విండీస్ విధ్వంసక ఆటగాడు హెట్మేయర్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వచ్చి రావడంతోనే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అతను ఫోర్లు, సిక్సర్లతో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ క్రమంలో 50 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం షై హోప్ 37, హెట్మేయర్ 73 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. చాహర్ బౌలింగ్‌లో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సునీల్ అంబ్రీస్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 

భారత్-వెస్టిండీస్‌ల మధ్య చెన్నైలో జరుగుతున్న మొదటి వన్డేలో విండీస్ ముందు టీమిండియా 289 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. శ్రేయస్ అయ్యర్ 70, రిషభ్ పంత్ 71, కేదార్ జాదవ్ 40 పరుగులతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో కాట్రెల్, పౌల్, జోసెఫ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 

టీమిండియా స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. చివర్లో ధాటిగా ఆడిన కేదార్ జాదవ్ 40, రవీంద్ర జడేజా 21 వెంట వెంటనే ఔటయ్యారు. 

టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 71 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పోలార్డ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రిషభ్ పంత్... హెట్మేయర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుని, ఇన్నింగ్స్‌ను నిర్మించిన శ్రేయస్ అయ్యర్-రిషభ్ పంత్ 114 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 70 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జోసెఫ్ బౌలింగ్‌లో పోలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ పెవిలియన్ చేరాడు. 

మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్‌లు ఆదుకున్నారు. అయ్యర్ నెమ్మదిగా ఆడుతుండగా.. పంత్ ధాటిగా ఆడి స్కోరు బోర్డును కదిలించారు. ఈ క్రమంలో జేసన్ హోల్డర్ వేసిన 32వ ఓవర్ నాలుగో బంతికి సింగిల్ తీసిన అయ్యర్ అర్థసెంచరీ పూర్తి చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి.

ఇక రిషబ్ పంత్ తన సహజశైలికి భిన్నంగా నిదానంగా ఆడుతూ... ఆడపాదడపా షాట్లు బాదాడు. ఈ నేపథ్యంలో 50 బంతుల్లో పంత్ హఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 

టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. తన సహజ స్వభావానికి భిన్నంగా నిలకడగా బ్యాటింగ్ చేసిన హిట్ మ్యాన్ 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జోసెఫ్ బౌలింగ్‌లో పోలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

టి 20 సిరీస్ లో ఇరగదీసిన రాహుల్...విండీస్ తో జరుగుతున్న తొలి మ్యాచ్ లో నిరాశపరిచాడు. కేవలం 6 పరుగులకే పెవీలియన్ చేరాడు. ఇక రాహుల్ స్థానంలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ రావడంతోనే ఒక ఫోర్ కొట్టి జోరు మీదున్నట్టు కనిపించాడు. కానీ వెంటనే అతను కూడా బౌల్డ్ గా వెనుదిరిగాడు. 

రాహుల్, కోహ్లీ వికెట్లను వరుసగా ఒకే ఓవర్లో కోల్పోవడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది. కోహ్లీ అవుట్ అవ్వగానే అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ కు వచ్చాడు. 

మరో ఎండ్ లో మరో ఓపెనర్ రోహిత్ శర్మ తనదైన స్టయిల్లో ఎలాగైతే మొదట్లో నెమ్మదిగా ఆది తరువాత గేయార్లు మారుస్తాడా అదే తరహాలో నింపాదిగా ఆడుతూ..స్టాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అవతలివైపు వికెట్లు పడుతున్నప్పటికీ, రోహిత్ మాత్రం ఫోకస్ కోల్పోకుండాఆ ఆడుతున్నాడు. 

సెల్యూట్ కాట్రేల్ గా అందరికి సుపరిచితుడైన షెల్డన్ కాట్రేల్ వేసిన 7వ ఓవర్లో రెండవ బంతికి రాహుల్ అవుట్ అవ్వగా అదే ఓవర్లో 5వ బంతికి ఫోర్ బాదాడు కోహ్లీ. కాకపోతే తరువాతి బంతికే కోహ్లీ కూడా క్లీన్ బౌల్డ్ గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతానికి టీం స్కోర్ 38/2 గా కొనసాగుతుంది. రోహిత్ శర్మ 21(37 బంతుల్లో), శ్రేయాస్ అయ్యర్ 5(10 బంతుల్లో క్రీజులో ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios