రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సోమవారం అహ్మదాబాద్ లో పర్యటించారు. అంతేకాకుండా అక్కడ కొత్తగా నిర్మించిన మొతెరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భారతదేశం గురించి.. మన దేశ పండగల గురించి , సినిమాలు, క్రికెటర్ల గురించి ట్రంప్ ప్రస్తావించారు. అయితే.. ఆ పేర్లను పలకడంలో ట్రంప్ తడపడటం గమనార్హం.

Also Read ట్రంప్ ఉచ్ఛారణలో తప్పులు: ఆడుకుంటున్న నెటిజన్లు...

ఈ క్రమంలో చాయ్‌ వాలాను చీవాలా అని, వేదాలను వేస్టాస్‌ అని, స్వామి వివేకానంద పేరును వివేకముందగా అని పేర్కొన్నారు. అదేవిధంగా భారత క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లిల గురించి ప్రస్తావించారు. అయితే వారి పేర్లను ఉచ్చరించడంలో ట్రంప్‌ విఫలమయ్యారు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా ట్రంప్‌ ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

 

సచిన్, విరాట్ కోహ్లీ పేర్లను ట్రంప్ సరిగా పలకకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదే విషయంపై ఇంగ్లండ్‌ మాజీ సారథి కెవిన్‌ పీటర్సన్‌ కూడా ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 

లెజెండ్స్‌ పేర్లను పలికేముందు ట్రంప్‌ తగిన రీసెర్స్‌ చేయాలని ట్రంప్‌కు పీటర్సన్‌ సూచించాడు. ఐసీసీ కూడా ట్రంప్‌ను ట్రోల్‌ చేసింది. ‘sach, such, satch, sutch, sooch లాంటి పేర్లు ఎవరికైనా తెలుసా?’అని అభిమానులను ఐసీసీ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతోంది.