ప్యాట్ కమిన్స్, దీప్తి శర్మలకు 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డులు
ICC Player of the Month for December 2023: భారత మహిళా క్రికెట్ స్టార్ ప్లేయర్ దీప్తిశర్మ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఆవార్డును గెలుచుకున్నారు. అలాగే, పురుషుల క్రికెట్ లో డిసెంబర్ నెలకు గానూ ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నాడు.
Pat Cummins and Deepti Sharma crowned ICC Awards: భారత మహిళా క్రికెట్ స్టార్ ప్లేయర్ దీప్తిశర్మ, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లు ఐసీసీ అవార్డులు అందుకున్నారు. పాకిస్థాన్ తో జరిగిన టెస్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తూ.. అద్భుత బౌలింగ్ తో అదరగొట్టిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 'ఐసీసీ మెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు'ను గెలుచుకున్నాడు. అలాగే, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో జరిగిన సిరీస్ లో అద్భుత ప్రదర్శన చేసిన భారత క్రీడాకారిణి దీప్తి శర్మకు తొలి 'ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు' లభించిందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఒక ప్రకటనలో మంగళవారం వెల్లడించింది.
2023 డిసెంబర్ కు పురుషుల, మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు విజేతలను గత వారం షార్ట్ లిస్టు చేయగా, మంగళవారం నాడు అవార్డులు అందుకున్నవారి పేర్లను ఐసీసీ వెల్లడించింది. పాకిస్థాన్తో జరిగిన టెస్టు సిరీస్ లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన ప్యాట్ కమిన్స్ '2023 డిసెంబర్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు' అందుకున్నాడు. అలాగే, మూడు ఫార్మాట్లలో బ్యాటింగ్, బౌలింగ్ తో అదరగొట్టిన దీప్తి శర్మ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలపై భారత్ రాణించడంలో కీలక పాత్ర పోషించింది. దీంతో దీప్తి శర్మ తన కెరీర్ లో తొలి 'ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు'ను గెలుచుకుంది.
జట్టులో చోటు దక్కకపోవడంపై మౌనం వీడిన శిఖర్ ధావన్.. గబ్బర్ కామెంట్స్ వైరల్ !
డిసెంబర్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా సిరీస్ ను గెలుచుకోవడంలో ప్యాట్ కమిన్స్ కీలకంగా ఉన్నాడు. 2023 లో ఆస్ట్రేలియా సాధించిన అనేక గెలుపులలో అతని నాయకత్వం, బౌలింగ్ ప్రదర్శనతో అదరగొట్టాడు.2023లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్, తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ను ఆసీస్ కు అందించాడు. మెల్బోర్న్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన రెండో టెస్టులో కమిన్స్ మరో అద్భుత విజయాన్ని అందించింది. ఈ మ్యాచ్ లో ఏకంగా పది వికెట్లు పడగొట్టి పాక్ ను దెబ్బతీశాడు. 'అన్ని ఫార్మాట్లలో ఆసీస్ కు ఇది గొప్ప సంవత్సరం. సవాలుతో కూడిన పాకిస్తాన్ జట్టుపై బలమైన ప్రదర్శనతో 2023ని ముగించింది. వెస్టిండీస్, న్యూజిలాండ్ సిరీస్ ల కోసం ఎదురు చూస్తున్నాము' అని ప్యాట్ కమిన్స్ తెలిపాడు.
మూడు ఫార్మట్ లలో రాణించిన దీప్తికి..
డిసెంబర్ నెలకు గాను ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా దీప్తి శర్మకు అవార్డు లభించింది. దీనికి ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నానని దీప్తి తెలిపింది. ప్రస్తుతానికి తన ఆట గురించి ఆందోళన చెందడం లేదనీ, గత నెలలో బలమైన ప్రత్యర్థులపై భారత్ కోసం తాను ఆడిన ఆటకు సంతోషంగా ఉందని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి క్షణాలు మరిన్ని వచ్చేలా కష్టపడుతూనే ఉంటానని పేర్కొంది. 'ఈ అవార్డుకు ఎంపికైనందుకు కృతజ్ఞురాలిని. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా నాకు ఓటు వేయడం మరింత ప్రత్యేకం. నేను ఈ అవార్డును గెలుచుకోవడానికి సహకరించినందుకు వారికి, నా సహచరులకు కృతజ్ఞతలు' అని దీప్తిశర్మ పేర్కొన్నారు.
ప్రపంచంలోనే తొలి క్రికెటర్ గా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు