Asianet News TeluguAsianet News Telugu

అదేం పని: విరాట్ కోహ్లీ నాల్లో స్లాట్ పై పెదవి విరిచిన భజ్జీ

ఆస్ట్రేలియాపై జరిగిన తొలి వన్డే మ్యాచులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగడంపై హర్భజన్ సింగ్ పెదవి విరిచాడు కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ మార్పు విషయంలో. టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయాన్ని హర్భజన్ తప్పు పట్టాడు.

Harbhajan Singh finds fault with Virat Kohli batting order
Author
Mumbai, First Published Jan 16, 2020, 9:00 PM IST

ముంబై: ఆస్ట్రేలియాపై జరిగిన తొలి వన్డే మ్యాచులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగడంపై స్పిన్నర్ హర్భజన్ సింగ్ పెదవి విరిచాడు. కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ మార్పును పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా తప్పు పట్టారు. 

విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో బ్యాటింగ్ దింపాలనే టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయాన్ని హర్భజన్ సింగ్ తప్పు పట్టాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి విరాట్ కోహ్లీ ఇండియాకు ఎన్నో అపూర్వ విజయాలు అందించాడని ఆయన అన్నాడు.

Also Read: నెంబర్ 4 స్థానంలో కోహ్లీ... హెడేన్ అసంతృప్తి

ముంబైలో ఆస్ట్రేలియాపై జరిగిన తొలి వన్డేలో కోహ్లీ తన బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చుకోవాల్సింది కాదని ఆయన అన్నాడు. కీలకమైన మ్యాచుల్లో కోహ్లీ వంటి స్టార్ బ్యాట్స్ మన్ ఒకరి కోసం తన స్థానాన్ని త్యాగం చేయడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నాడు. 

కేఎల్ రాహుల్ కోసం విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో తాను రెగ్యులర్ గా ఆడే మూడో స్థానంలో కాకుండా నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. దాంతో రెగ్యులర్ గా నాలుగో స్థానంలో వచ్చే శ్రేయాస్ అయ్యర్ ఐదో స్థానంలో వచ్చి ఘోరంగా విఫలమయ్యాడు. 

బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పుల వల్ల క్రికెటర్లలో మనో స్థయిర్యం దెబ్బ తింటుందని, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుతో ఆడే సమయంలో ఇటువంటి ప్రయోగాలు మంచివి కావని అంటున్నారు. గత సిరీస్ కు విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లో భారత జట్టులోకి వచ్చాడు. 

Also Read: ఆస్ట్రేలియా చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమి.... అనవసరపు చెత్త రికార్డును మూటగట్టుకున్న కోహ్లీ.

ఎప్పటిలాగే శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఇన్నింగ్సును ప్రారంభించగా, కేఎల్ రాహుల్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్న సమయంలో శిఖర్ ధావన్ తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్సు ప్రారంభించాడు. శిఖర్ ధావన్ గాయం కారణంగా దూరమైన సిరీస్ లో రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్సును ప్రారంభించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఇద్దరు అందుబాటులోకి వచ్చారు. 

ఓపెనర్ గా కేఎల్ రాహుల్ బాగా రాణించాడు. దాంతో కేఎల్ రాహుల్ ను తుది జట్టులోకి తీసుకోవాల్సిన అనివార్యతలో టీమ్ మేనేజ్ మెంట్ పడింది. అదే సమయంలో శిఖర్ ధావన్ ను పక్కకు పెట్టడాన్ని కూడా కష్టంగానే భావిస్తోంది. ఈ స్థితిలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్జర్ మారింది.అయితే, ఆస్ట్రేలియాపై ఇండియా ఘోరంగా ఓడిపోయింది. దాంతో బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios