Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్ కి సాయం చేయాలంటూ వీడియో.. యూవీని ఏకిపారేస్తున్న నెటిజన్లు

కరోనా వైరస్ కట్టడి కోసం ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఫౌండేషన్‌కి చేతనైనంత సాయం చేయాలని పిలుపు ఇవ్వడమే యువరాజ్ సింగ్ తప్పిదమైంది. భారత్‌లో కరోనా కట్టడి కోసం సాయం చేయాల్సిందిపోయి..

Fans get angry after Yuvraj Singh urges people to help Shahid Afridi's foundation
Author
Hyderabad, First Published Apr 1, 2020, 12:02 PM IST

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. కరోనా వైరస్ ను అంతమొందించేందుకు అందరం కలిసి పోరాడదాం అంటూ వీడియో చేసి ట్విట్టర్ లో షేర్ చేశాడు. అంతే.. ఆ వీడియో చూసిన నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అదేంటి.. యూవీ చెప్పింది మంచి విషయమే కదా అనే అనుమానం కలిగిందా.. అక్కడే ఉంది అసలు మ్యాటర్.

ఇంతకీ మ్యాటరేంటంటే... కరోనా వైరస్ కట్టడి కోసం ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఫౌండేషన్‌కి చేతనైనంత సాయం చేయాలని పిలుపు ఇవ్వడమే యువరాజ్ సింగ్ తప్పిదమైంది. భారత్‌లో కరోనా కట్టడి కోసం సాయం చేయాల్సిందిపోయి.. శత్రు దేశమైన పాకిస్థాన్‌కి మద్దతుగా నిలుస్తావా..? అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

Also Read గుండు చేయించుకున్న డేవిడ్ వార్నర్.. కోహ్లీ కూడా చేయాలంటూ.....

పాకిస్తాన్ లో కరోనా కట్టడికి.. ఆ దేశ క్రికెటర్ ఆఫ్రిదీ ఓ ఫౌండేషన్ స్థాపించాడు. దీనిపై హర్హజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. ఆ తర్వాత ఆఫ్రీది చేస్తున్న పని పై యువరాజ్ సింగ్ కూడా స్పందించాడు.

సింగ్ కూడా అఫ్రిదికి మద్దతు తెలుపుతూ అతని ఫౌండేషన్‌కి విరాళాలు ఇవ్వాలని సూచించాడు. దీంతో.. భారత్ అభిమానులు యువీపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. అసలు బుద్ధి ఉందా అంటూ ట్విట్టర్ లో ఓ రేంజ్ లో  మండిపడుతున్నారు.

భారత్‌లో కరోనా వైరస్ కట్టడి కోసం క్రికెటర్లు రోహిత్ శర్మ రూ. 80 లక్షలు, సురేశ్ రైనా రూ. 52 లక్షలు, సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షలు, అజింక్య రహానె రూ. 10 లక్షలు విరాళంగా ప్రకటించగా.. భార్య అనుష్క శర్మతో కలిసి విరాట్ కోహ్లీ రూ. 3 కోట్లు విరాళం ప్రకటించినట్లు తెలుస్తోంది. 
వీరిలాగా.. డొనేషన్ ఇవ్వకపోగా.. శత్రు దేశానికి సహాయం చేయమంటావా అంటూ మండిపడుతున్నారు. మరి దీనిపై యూపీ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios