లక్ష్మీపతి బాలాజీ.. టీమిండియా పేస్ బౌలర్, శ్లాగ్ ఓవర్‌లో ప్రత్యర్ధి బౌలర్లను ఉతికే ఆరేసే అతని విధ్వంసక ఆటను క్రికెట్ అభిమానులు మరచిపోయి ఉండరు. 2004-2005 సీజన్‌లో పాకిస్తాన్‌పై రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలాజీ తర్వాత వెన్నునొప్పి కారణంగా అర్థాంతరంగా కెరీర్‌ను ముగించాడు.

ప్రస్తుతం భారతదేశం కోవిడ్ 19తో విలవిలలాడుతున్న నేపథ్యంలో లక్ష్మీపతి బాలాజీ స్పందించాడు. గుర్తు తెలియని వ్యాధులతో మన పూర్వీకులు పోరాడేవారని, అలాగే మన తల్లిదండ్రులు కూడా క్లిష్ట పరిస్ధితులను ఎదుర్కొని మనుగడ సాగించారని అతను గుర్తుచేశారు.

Also Read:టి20 ప్రపంచ కప్: భారత్ ఓకే అంటే వాయిదా, లేకపోతే రద్దు! ఎలాగంటే....

2004లో సునామీ, చెన్నై వరదలు లాంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొని నిలబడ్డామని చెప్పాడు. విపత్కర పరిస్ధితుల్లో వాస్తవాన్ని అంగీకరించాలని, అలాగే సమయాన్ని కూడా గౌరవించాలని బాలాజీ కోరాడు.

తన క్రీడా జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో ఒడిదుడుకులు తనకు ఎన్నో  పాఠాలు నేర్పాయని చెప్పాడు. తేలికపాటి జ్వరమొస్తేనే మనం వైద్యులు చెప్పినట్లు వింటాం. అలాంటిది ఇప్పుడు ప్రపంచం మొత్తం వైరస్ వ్యాపించిందని ప్రస్తుతం అధికారులు, ప్రభుత్వం చెప్పినట్లు వినాలని బాలాజీ సూచించాడు.

ప్రభుత్వం సరైన నిర్ణయాలతోనే ముందుకెళ్తొందని, కాబట్టి వాళ్లేం చెబితే అది వినాలని కోరాడు. ఇక క్రికెట్ నుంచి వైదొలగడంపై స్పందిస్తూ.. తన వెన్నునొప్పి సర్జరీ సమయంలో రెండేళ్లపాటు క్రికెట్ ఆడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుడు ఏం పని చేయకుండా ఇంట్లోనే కూర్చునేవాడినని బాలాజీ గుర్తుచేసుకున్నాడు.

Also Read:కరోనాపై వీడియో రిలీజ్ చేసిన కోహ్లీ, ముందు డొనేషన్ ఇవ్వాలని ఫాన్స్ ఫైర్!

ప్రతీ ఆటగాడికి కొన్ని కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. అవే వారిని దృఢంగా మార్చుతాయని తెలిపాడు. కరోనా సంక్షోభం కారణంగా దేశంలో లాక్‌డౌన్‌ విధించింది. ప్రస్తుతం విశ్రాంతి సమయాన్ని కుటుంబంతో ఆస్వాదిస్తున్నట్లు బాలాజీ చెప్పాడు.

ఇంట్లో ఉంటూనే ఎన్నో విషయాలపై మాట్లాడుకుంటున్నామని వివరించాడు. బాలాజీ 2017లో రిటైర్మెంట్ ప్రకటించాక కోచ్‌గా మారాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.