ఇంగ్లాండ్ ఉమెన్ టీం వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ ఉమెన్ సారా టేలర్ సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో తన నగ్న పోటోలను స్వయంగా తానే పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే మహిళా సాధికారత కోసం ఆమె ఇంత తెగువ ప్రదర్శించినట్లు తెలియడంతో అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె పోస్ట్ చేసిన ఆ ఫోటోలో నగ్నత్వం కంటే ఆ ఆలోచనలోని నిండుతనమే ఎక్కువమందికి కనిపిస్తోందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

నగ్నంగా వికెట్ కీపింగ్ చేస్తూ దిగిన  పోటోను టేలర్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే ఇలా తన నగ్న పోటోలను సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎందుకు   పోస్ట్ చేయాల్సివచ్చిందో ఆమె వివరణ ఇచ్చారు.  

'' నేను కంపర్ట్ జోన్ నుండి కొద్దిగా బయటకు వచ్చాను. నా గురించి తెలిసిన వారికి ఈ విషయం అర్థమైవుంటుంది.  అయితే వుమెన్స్ హెల్త్ హక్ వారు నన్ను మహిళా సాధికారత కోసం ఏదైనా చేయాలని ఆహ్వానించినపుడు చాలా  గర్వంగా అనిపించింది.  శారీరకంగా  గతంలో నేను కూడా ఎన్నో సమస్యలతో బాధపడ్డాను. అయితే అందులో కొన్నింటి నుండి నేను బయటపడగలిగాను. కాబట్టి ప్రతి మహిళా తన శారీరక సమస్యలపై అవగాహన కలిగివుండాలి. కానీ చాలా మంది సిగ్గు, బిడియం తదితర కారణాలతో ఆ పని చేయలేరు. అలాంటి వారిలో మార్పు కోసమే తాను ఈ ఫోటోను మీతో పంచుకున్నాను. 

ఎవరో ఏదో అనుకుంటారన్న భయంతో మనలోని సమస్యను దాచిపెట్టి బాధపడటం మానండి. ప్రతి ఒక్క మహిళా తన శారీరక సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడగలగాలి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యపడుతుంది. చివరగా ప్రతి అమ్మాయికి ఎదుటివారే తనకంటే అందంగా  వున్నారని అనిపిస్తుంది. కానీ తనతో పాటు  ప్రతీ మహిళా అందమైనవారేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. '' అంటూ టేలర్ ఓ సుదీర్ఘ సందేశాన్ని తన నగ్న పోటోకు జతచేస్తూ పోస్ట్ చేశారు.