Asianet News TeluguAsianet News Telugu

ఐదు వేల పరుగులు... వార్నర్ సంచలన రికార్డ్

ఓవరాల్‌ జాబితాలో కోహ్లి తర్వాత స్థానంలో వార్నర్‌ నిలిచాడు. కోహ్లి 114 ఇన్నింగ్స్‌లోనే ఐదు వేల వన్డే పరుగుల మార్కును చేరాడు. కాగా, దక్షిణాఫ్రికా క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా 101 ఇన్నింగ్స్‌ల్లో ఐదు వేల వన్డే పరుగులు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
 

David Warner completes 5000 runs in One-Day Internationals
Author
Hyderabad, First Published Jan 15, 2020, 9:58 AM IST

ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్ లో... టీమిండియా ఘోర ఓటమిని చవి చూసింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు వీరు బాదుడు బాదారు. ఈ సంగతి పక్కన పెడితే...ఈ మ్యాచ్ లో ఆసిస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆసీస్ తరపున వన్డేల్లో వేగవంతంగా ఐదువేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.

డేవిడ్ వార్నర్ తన 115వ వన్డే ఇన్నింగ్స్ లో ఐదు వేల పరుగుల మార్కను దాటేశాడు. ఇది ఆసీస్ తరపున అతి తక్కువ ఇన్నింగ్స్ లో సాధించిన ఘనతగా నమోదైంది. ఇక ఈ ఓవరాల్‌ జాబితాలో కోహ్లి తర్వాత స్థానంలో వార్నర్‌ నిలిచాడు. కోహ్లి 114 ఇన్నింగ్స్‌లోనే ఐదు వేల వన్డే పరుగుల మార్కును చేరాడు. కాగా, దక్షిణాఫ్రికా క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా 101 ఇన్నింగ్స్‌ల్లో ఐదు వేల వన్డే పరుగులు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Also Read ఆస్ట్రేలియాతో సిరీస్.. శిఖర్ ధావన్ అరుదైన రికార్డ్...

 కోహ్లి-వివ్‌ రిచర్డ్స్‌లు సంయుక్తంగా రెండో స్థానంలో ఉండగా, వార్నర్‌ మూడో స్థానాన్నిఆక్రమించాడు. ఇంగ్లండ్‌ క్రికెటర్‌ జో రూట్‌ 116 ఇన్నింగ్స్‌ల్లో ఐదు వేల వన్డే పరుగులు సాధించి నాల్గో స్థానంలో ఉన్నాడు. భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో వార్నర్‌ ఈ ఫీట్‌ సాధించాడు.  వార్నర్‌  11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా ఐదు వేల వన్డే పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios