Asianet News TeluguAsianet News Telugu

ధోనీకి కాంట్రాక్టు జాబితాలో చోటేందుకు దక్కలేదో చెప్పిన బీసీసీఐ

ధోనిని ఎలా తీసేస్తారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ధోని తన భవిష్యత్తు నిర్ణయాన్ని ఈ జనవరిలో ప్రకటిస్తానని ఇప్పటికే చెప్పాడు. తాజాగా కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ... ధోని వన్డేలు ఇక ఆడే ఛాన్స్ లేదని, ఆడితే టి 20లు ఆడతాడని, ప్రపంచ కప్ లో ధోని ఆడే సంభావ్యతనియూ బయటపెట్టాడు. 

BCCI SOURCES REVEAL WHY DHONI WAS NOT INCLUDED IN ANNUAL PLAYER CONTRACTS LIST
Author
Mumbai, First Published Jan 16, 2020, 4:46 PM IST

ముంబై: ఇందాక కొద్దిసేపటి కింద బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్టుల జాబితాలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరు లేదు. దీనిపై ధోని అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ధోనిని ఇలా కాంట్రాక్టులో నుంచి తప్పియ్యడంపై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంఎస్ ధోని అనే ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. 

ధోనిని ఎలా తీసేస్తారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ధోని తన భవిష్యత్తు నిర్ణయాన్ని ఈ జనవరిలో ప్రకటిస్తానని ఇప్పటికే చెప్పాడు. తాజాగా కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ... ధోని వన్డేలు ఇక ఆడే ఛాన్స్ లేదని, ఆడితే టి 20లు ఆడతాడని, ప్రపంచ కప్ లో ధోని ఆడే సంభావ్యతనియూ బయటపెట్టాడు. 

Also read; ధోనీ ఖేల్ ఖతమ్: తేల్చేసిన బీసీసీఐ, తెలుగు క్రికెటర్ ఒకే ఒక్కడు

కాంట్రాక్టు లిస్టులో ధోని పేరు లేకపోవడం పై ఒక బీసీసీఐ ప్రముఖ్యుడు మాట్లాడుతూ... ఈ కాంట్రాక్టు జాబితాను బయట పెట్టె ముందు, ధోనికి ఈ విషయం గురించి తెలియపరిచామని, ధోనికి చెప్పిన తరువాతే ఈ జాబితాను ప్రకటించినట్టు తెలిపాడు. 

ధోని లాంటి సీనియర్ ప్లేయర్ ని ఇలా కాంట్రాక్టు జాబితాలోనుంచి పక్కన పెట్టేటప్పుడు ఖచ్చితంగా వారికి తెలియపరుస్తామని, ఆ తరువాతే ఈ విషయాన్నీ బహిర్గతపరుస్తామని ఆయన అన్నారు. 

ఈ ప్రస్తుత కాంట్రాక్టు అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2020 సంవత్సర కాలానిది మాత్రమే. ఈ కాంట్రాక్టు కాలాన్ని బట్టి చూస్తుంటే ఒక వేళా గనుక ధోని 2020 ఆసియ కప్లో గనుక పాల్గొంటే... అతడికి మళ్ళీ కాంట్రాక్టు జాబితాలో చోటు దక్కే ఆస్కారం ఉంది. 

బిసీసీఐ విడుదల చేసిన ఆరు కెటగిరీలు ఉన్నాయి. అవి గ్రేడ్ ఏ+,  గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ, గ్రేడ్ సీ. టాప్ గ్రేడ్ ఏ+ కెటగిరీల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరు 7 కోట్ల రూపాయలు పొందుతారు. ఆ తర్వాతి కెటగిరీల్లో ఉన్న ఆటగాళ్లు 5 కోట్ల రూపాల చొప్పున పొందుతారు. గ్రేడ్ బీ కెటగిరీలో ఉన్న ఆటగాళ్లు 3 కోట్ల రూపాయలు, సీ కెటగిరీలో ఉన్న ఆటగాళ్లు కోటి రూపాయలు పొందుతారు.   

Also read; బుమ్రా యార్కర్లు... వార్నర్ ప్రశంసలు

గత సంవత్సరం ధోని  ఏ జాబితా కాంట్రాక్టును దక్కించుకున్నాడు. ఏ+ జాబితా కాంట్రాక్టును గత సంవత్సరం కూడా పొందలేకపోయాడు. ఈ సంవత్సరం ఏమో ఏకంగా ఏ జాబితా నుండే తొలగించారని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios