టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి వెస్టిండిస్ బీచ్ లో సందడిచేశాడు. అయితే ఈ సందర్భంగా అనుష్క బికినీతో దర్శనమిచ్చింది. తన భర్తతో కలిసి ఆంటిగ్వా ఐలాండ్ బీచ్ లో దిగిన ఫోటోను అనుష్క సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోను అభిమానులు తెగ షేర్ చేస్తుండటంతో అదికాస్తా వైరల్ గా మారింది. 

వెస్టిండిస్ పర్యటనలో టీమిండియా క్రికెటర్లు భార్యలతో కలిసి వుండేందుకు బిసిసిఐ అనుమతిచ్చింది. దీంతో మొదట అమెరికాలో ఆ తర్వాత కరీబియన్ దీవుల్లో విరాట్-అనుష్కల  జంట ఏ మాత్రం ఖాళీసమయం దొరికినా సరదాగా  గడుపుతున్నారు. ఈ సందర్భంగా వన్డే సీరిస్ ముగింపు...టెస్ట్ సీరిస్ ఆరంభానికి మద్యలో చాలా రోజుల విరామం దొరికింది. దీంతో విరుష్క జంట సరదాగా కరీబియన్ అందాలను ఆస్వాదించేందకు సిద్దమయ్యారు. అందుకోసం అందమైన బీచుల్లో గడుపుతున్నారు. 

ఈ సందర్భంగా దిగిన ఓ ఫోటోను అనుష్క తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆ ఫోటోలో విరాట్ వెనుకవైపున్న అనుష్క పూర్తిగా  కనిపించలేదు. కానీ అంతకుముందు ఆమె ఒంటరిగా బికినీలో దిగిన ఫోటోను కూడా  పోస్ట్ చేసింది. దీంతో భర్త కోహ్లీతో ఆమె బికినీలోనే బీచ్ కు వచ్చినట్లు అర్థమవుతోంది.  

అంతకుముందు కోహ్లీ తన సహచర ఆటగాళ్లతో కలిసి జాలీ బీచ్‌లో సరదాగా గడిపాడు. ఈ సందర్భంగా వారంతా బీచ్‌లో తెగ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోని కెప్టెన్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, రహానే, బుమ్రా, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌లతో పాటు సహాయక బృందాన్ని కూడా మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. 

సంబంధిత వార్త

బికినిలో అనుష్క.. కోహ్లీ రియాక్షన్ ఎలా ఉందంటే?