Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్ స్పిన్నర్ యాసిర్ షాపై రేప్ కేసు నమోదు... 14 ఏళ్ల బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో..

 పాక్ సీనియర్ స్పిన్నర్ యాసిర్ షాపై రేప్ కేసు...యాసిర్ షాపై ఆరోపణలు వచ్చినమాట నిజమేనని ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు...

14 Years girl filed rape case against Pakistan Spinner Yasir Shah, PCB Confirms
Author
India, First Published Dec 21, 2021, 10:11 AM IST

పాకిస్తాన్ క్రికెట్ జట్టులో మరో క్రికెటర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇప్పటికే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అత్యాచార ఆరోపణలు, లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా పాక్ సీనియర్ స్పిన్నర్ యాసిర్ షాపై రేప్ కేసు నమోదైంది. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికపై యాసిర్ షా, అతని స్నేహితులు ఫర్షాన్... లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కేసు నమోదైంది...

Read: గబ్బా టెస్టు, ఐపీఎల్ కెప్టెన్సీ, ఇప్పుడు ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా... రిషబ్ పంత్‌కి ఈ ఏడాదితో...

యాసిర్ షా స్నేహితుడు ఫర్షాన్ తనని కిడ్నాప్ చేశాడని, ఆ తర్వాత తనకు తుపాకీ గురి పెట్టి పలు మార్లు అత్యాచారం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది బాలిక. అంతేకాకుండా అత్యాచారానికి సంబంధించిన దృశ్యాలను ఫోన్‌లో వీడియో తీసి, వాటిని చూపించి బెదిరించి... పలు మార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలిపింది...

ఫర్షాన్‌కి యాసిర్ షా సాయం చేశాడని, తనకు ఫోన్ చేసి అతనిపై కేసు పెట్టినా, ఈ విషయాన్ని ఎవ్వరికైనా చెప్పినా ఆ వీడియోలను నెట్‌లో పెడతానని బెదిరింపులకు పాల్పడినట్టు తన ఫిర్యాదులో తెలియచేసింది ఆ బాలిక...

యాసిర్ షాను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యానని, ఫర్షాన్‌ నుంచి కాపాడాల్సిందిగా వేడుకున్నానని తన ఫిర్యాదులో పేర్కొంది ఆ బాలిక. అయితే తనకు సాయం చేయకపోగా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని కాంప్రమైజ్ చేయడానికి యాసిర్ షా ప్రయత్నించాడని ఆరోపించింది...

స్నేహితుడు ఫర్షాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు ఓ ఫ్లైట్‌తో పాటు మూడేళ్లకు సరిపడి నెలవారీ ఖర్చులను కూడా ఇస్తానని ఆశ చూపించాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది ఆ బాలిక...

యాసిర్‌ షాపై ఎఫ్‌ఐఆర్ నమోదైన విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ధృవీకరించింది. ‘సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ప్లేయర్లపై పోలీసు కేసు నమోదైనట్టు మా దృష్టికి వచ్చింది. ఈ విషయానికి సంబంధించిన వివరాలను పీసీబీ తెలుసుకుంటోంది. అసలు నిజాలు బయటికి వచ్చేవరకూ ఈ విషయంపై ఎలాంటి కామెంట్ చేయదలుచుకోలేదు...’ అంటూ కామెంట్ చేసింది పాక్ క్రికెట్ బోర్డు...

చేతి వేలి గాయంతో బాధపడుతున్న యాసిర్ షా, బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాల్గొనలేదు. తనపై వచ్చిన ఆరోపణలపై యాసిర్ షా ఇంకా స్పందించలేదు. 35 ఏళ్ల యాసిర్ షా, 2011లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. నిషేధిక ఉత్ప్రేరకాలు వాడినట్టు నిర్ధారణ కావడంతో కొన్నాళ్లు క్రికెట్‌కి దూరమైన యాసిర్ షా, టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

2016లో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 బౌలర్‌గా నిలిచిన యాసిర్ షా, 46 టెస్టుల్లో ఓ సెంచరీతో 847 పరుగులు చేశాడు. 16 సార్లు ఐదేసి వికెట్ల ప్రదర్శన చేసిన యాసిర్ షా, మొత్తంగా 235 టెస్టు వికెట్లు తీశాడు. 25 వన్డేల్లో 24 వికెట్లు తీసిన యాసిర్ షా, పాక్ తరుపున అత్యధిక వేగంగా 100, 150 టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు. 

Read also: మళ్లీ విరాట్ కోహ్లీకే వన్డే కెప్టెన్సీ పగ్గాలు... రోహిత్ శర్మ గాయంపై అనుమానాలతో...

Follow Us:
Download App:
  • android
  • ios