లండన్: కరోనా సోకిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఆదివారం నాడు ఆసుపత్రిలో చేరారు.  గత వారం రోజుల క్రితం బ్రిటన్ ప్రధానమంత్రి  కరోనా పాజిటివ్ లక్షణాలతో క్వారంటైన్ లో ఉన్న విషయం తెలిసిందే. 

 బ్రిటన్ ప్రధాని క్వారంటైన్ లో చికిత్స తీసుకొంటున్నప్పటికీ ఇంకా వైరస్ లక్షణాలు తగ్గలేదు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు అధికారులు.  బ్రిటన్ ప్రధాని హోం క్వారంటైన్ నుండి  శుక్రవారం నుండే బయటకు రావాల్సి ఉంది కానీ, ఆయనకు జ్వరం తగ్గలేదు. కరోనా లక్షణాలు ఇంకా అలాగే ఉన్నాయి.

కరోనా లక్షణాలు తగ్గని కారణంగా ముందు జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించినట్టుగా  అధికారులు ప్రకటించారు. కొన్ని కరోనా లక్షణాలు ఉండడంతో ఆసుపత్రిలో చేరానని తాను మాత్రం ఆరోగ్యంగానే ఉన్నానని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. 

Also read:కలకలం:బ్రిటన్ ప్రధానికి కరోనా పాజిటివ్ లక్షణాలు

కరోనా లక్షణాలు తగ్గేవరకు క్వారంటైన్ లో ఉంటూ తాను పనిచేస్తానని ఆయన ప్రకటించారు. బ్రిటన్  లో 47,806 మందికి కరోనా సోకింది. వీరిలో 4934 మంది మరణించారు.  బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్లెస్ కూడ కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్నాడు. ఆయన భార్యకు మాత్రం కరోనా లక్షణాలు లేవు. బ్రిటన్ రాణి ఎలిజబెత్  10 రోజుల క్రితమే హోం క్వారంటైన్ కు వెళ్లిన విషయం తెలిసిందే.