కరోనా వైరస్.... ఈ పేరు చెబితే ఇప్పుడు ప్రపంచం వణికిపోతుంది. ప్రపంచ దేశాలన్నీ దాదాపుగా ఆ వైరస్ బారిన పడ్డాయి. ఆ వైరస్ సోకని దేశం దాదాపుగా లేదంటే అతిశయోక్తి కాదు. ఈ మహమ్మారి ఇప్పుడు భారత దేశంపై కూడా పంజా విసురుతోంది. 

భారత దేశంపై ఈ వైరస్ దండెత్తుతున్న వేళ భారతదేశమంతా ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు కంకణం కట్టుకుంది. దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ లాక్ డౌన్ కొనసాగడంతోపాటుగా రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. 

ఇకపోతే ప్రజలు ఖాళీగా ఇండ్లలో ఉన్న దగ్గరి నుండి ఇంటర్నెట్ లో కరోనా సంబంధిత ఇన్ఫర్మేషన్ ని తెగ సెర్చ్ చేస్తున్నారు. అందరూ కూడా కరోనా ఎలా వస్తుంది, లక్షణాలు ఏమిటి అని తెగ శోధించి వేస్తున్నారు. 

తాజాగా గూగుల్ లో ఒక ప్రశ్న బాగా ట్రెండ్ అవుతుంది. చాలా సిలీగా అనిపించినప్పటికీ ఈ ప్రశ్నను చూడగానే మాత్రం వామ్మో అనిపిస్తుంది. అదే నండీ దోమ కాటు ద్వారా కరోనా వ్యాపిస్తుందా? ఈగలు ఇతరయాత్రల ద్వారా వ్యాపిస్తుందా?

అందరం లాక్ డౌన్ అని ఇండ్లలో ఉంటున్నాం. కానీ దోమలకయితే లాక్ డౌన్ లేదు కదా. అవి ఎక్కడికి బడితే అక్కడికి తిరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో మరి దోమ కూడితేనూ...?

ఈ ప్రశ్నకు వైద్యులు సమాధానం ఇస్తూ... దోమకాటు ద్వారా కరోనా రాదూ అని తేల్చేశారు. దోమ, చీమ, ఈగలు ఇతర కీటకాల ద్వారా, అవి కరోనా సోకిన వ్యక్తిని 

కుట్టి వచ్చి మరల ఆరోగ్యవంతుడిని కుట్టినప్పటికీ... కరోనా మాత్రం రాదూ అని డాక్టర్లు తేల్చి చెబుతున్నారు. 

ఇకపోతే ఈ వైరస్ కి మందు కనిపెట్టేందుకు ప్రపంచదేశాల శాస్త్రవేత్తలు పూనుకుంటున్నారు. అయితే.. చైనా ఓ వినూత్న పద్ధతి ద్వారా మందు కనిపెట్టాలని చూస్తుండటం గమనార్హం. కరోనా సోకి.. తర్వాత కోలుకున్న వారి రక్తం లోని ఫ్లాస్మా తీసి.. దాని ద్వారా చికిత్స అందించాలని అనుకుంటున్నారు. ఈ మేరకు ప్రయత్నాలు కూడా చేస్తుండటం గమనార్హం.

Also Read అమెరికాలో కరోనా విజృంభణ... చైనా అధ్యక్షుడితో మాట్లాడనున్న ట్రంప్...

కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్న వారు దానం చేసిన రక్తంలోని ప్లాస్మా(జీవద్రవ్యం) ద్వారా చికిత్స చేయడం అన్నమాట. ఈ విధానంపై భారీ స్థాయిలో అధ్యయనం చేయడానికి అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) అనుమతుల కోసం అక్కడి ఆస్పత్రులు ఎదురుచూస్తున్నాయి. 

‘ఇది చేసే వరకు మాకేమీ తెలియదు. కానీ, చారిత్రక ఆధారాలు మాత్రం ప్రోత్సాహకరంగా ఉన్నాయి’ అని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన డాక్టర్‌ అర్టురో కేసడ్‌వాల్‌ తెలిపారు. వ్యాధి నయమైన వారి రక్తాన్ని ఉపయోగించే పద్ధతికి శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన డాక్టర్‌ జెఫ్రీ హెండర్సన్‌ పేర్కొన్నారు.

 ప్రత్యేక రోగ క్రిముల బారిన పడిన వ్యక్తి శరీరం.. వాటిపై పోరాడేందుకు ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన యాంటీబాడీలుగా పిలిచే ప్రొటీన్లను తయారు చేయడం ప్రారంభిస్తుంది. ఆ వ్యక్తి కోలుకున్న తర్వాత ఆ యాంటీబాడీలు అతని రక్తంలో ప్రవహిస్తూనే ఉంటాయి.

ముఖ్యంగా ప్లాస్మాలో కొన్ని నెలలు, సంవత్సరాల పాటు వరకు అలాగే ఉంటాయి. యాంటీబాడీలతో కూడిన ఈ ప్లాస్మాను కొత్తగా కరోనా బారిన పడిన రోగుల శరీరంలోకి ఎక్కిస్తే వైర్‌సను ఎదుర్కొనేందుకు అవసరమైన శక్తిని ఇస్తాయని వైద్యులు భావిస్తున్నారు. ఇది పనిచేస్తే.. రోగులు బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా లేక శ్వాస యంత్రాల అవసరాన్ని తగ్గించగలుగుతాయా అన్న అంశాలను పరిశోధకులు నిర్ధారిస్తారు. అయితే ప్లాస్మాను ఎక్కించే విధానంలో అత్యంత అరుదుగా ఊపిరితిత్తులకు నష్టం కలిగే అవకాశం కూడా ఉండడం గమనార్హం.