Asianet News TeluguAsianet News Telugu

పార్శిగుట్టలో మర్కజ్ యాత్రికులంటూ ఆరుగురిపై ఫిర్యాదు: ఒకరి అరెస్ట్, ఐదుగురు జంప్


హైదరాబాద్: సికింద్రాబాద్ పార్శిగుట్టలో ఆరుగురు ఢిల్లీ నుండి వచ్చిన మర్కజ్ యాత్రికులు సంచరిస్తున్నారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసుల రాకతో ఐదుగురు పారిపోయారు. వీరిలో ఒకరిని పోలీసులు  అరెస్ట్ చేశారు. అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

 

Hyderabad Police arrested a man on suspecting returned from Markaz
Author
Hyderabad, First Published Apr 2, 2020, 12:27 PM IST


హైదరాబాద్: సికింద్రాబాద్ పార్శిగుట్టలో ఆరుగురు ఢిల్లీ నుండి వచ్చిన మర్కజ్ యాత్రికులు సంచరిస్తున్నారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసుల రాకతో ఐదుగురు పారిపోయారు. వీరిలో ఒకరిని పోలీసులు  అరెస్ట్ చేశారు. అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

పార్శిగుట్టలో ఢిల్లీ నిజాముద్దీన్ నుండి వచ్చిన మర్కజ్ యాత్రికులు తిరుగుతున్నారనే అనుమానంతో స్థానికులు గురువారం నాడు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరుగురికి కరోనా లక్షణాలు ఉన్నాయని స్థానికులు అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. అయితే పార్శిగుట్ట ప్రాంతానికి చేరుకొన్న పోలీసులను చూడగానే మర్కజ్ నుండి వచ్చినట్టుగా అనుమానిస్తున్న యాత్రికులు పారిపోయారు. వారిలో ఒకరిని పోలీసులు తమ అదుపులోకి తీసుకొన్నారు. మరో ఐదుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

అదుపులోకి తీసుకొన్న వ్యక్తిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడానికి ఢిల్లీ మర్కజ్ ప్రాంతానికి వెళ్లి వచ్చిన వారే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Also read:కరోనా ఎఫెక్ట్: తొలిసారిగా భక్తులు లేకుండానే భదాద్రి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం

ఢిల్లీ నుండి తమ స్వగ్రామాలకు వెళ్లిన వారి నుండే ఎక్కువగా ఈ కేసులు నమోదు అవుతున్నట్టుగా ఆయా రాష్ట్రాలు ప్రకటించిన విషయం తెలిసందే.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడానికి కూడ ఢిల్లీ నుండి వచ్చినవారే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios