Asianet News TeluguAsianet News Telugu

గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగి మృతి: బంధువుల ఆగ్రహం, వైద్యుల దాడి

తెలంగాణలో కరోనా వైరస్ బారినపడి మరో వ్యక్తి మరణించాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు మరణించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రకటించారు. 

covid 19: another corona death in gandhi hospital
Author
Hyderabad, First Published Apr 1, 2020, 9:16 PM IST

తెలంగాణలో కరోనా వైరస్ బారినపడి మరో వ్యక్తి మరణించాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు మరణించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రకటించారు.

దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య ఏడుకి చేరింది. మరోవైపు గాంధీ ఆసుపత్రిలో రోగి మరణించిన విషయాన్ని తెలిపిన తర్వాత అదే ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు తీవ్ర ఆగ్రహానికి గురై అక్కడి డాక్టర్లపై దాడి చేసినట్లు సూపరింటెండెంట్ చెప్పారు.

Also Read:హోమ్ మంత్రికి కేసీఆర్ ఇంట్లోకి నో ఎంట్రీ, గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు

ఈ విషయాన్ని వెంటనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శ్రవణ్ తెలిపారు. అయితే తొలుత తమ ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు... నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ వచ్చిన తర్వాత పోలీసులపై చలనం వచ్చిందని శ్రవణ్ ఆరోపించారు.

వైద్యులపై దాడి సరికాదని ఈ ఘటనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లామని సూపరింటెండెంట్ చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరామని, వైద్యుల విషయంలో రోగులు సంయమనంతో వ్యవహరించాలని శ్రవణ్ విజ్ఞప్తి చేశారు.

Also Read:కరోనా దెబ్బ: హైద్రాబాద్‌లో వాహనదారులకు చుక్కలు, 25 వేల కేసులు

మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ తెలిపారు. మరణించిన రోగితో పాటు ప్రస్తుతం చికిత్స పొందుతున్న అతని సోదరుడు ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios