Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో ఈ ఒక్క రోజే కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో ఈ రోజు ఒక్క రోజే కొత్తగా 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరంతా ఢిల్లీలోని మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారే. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 97కు చేరుకున్నాయి.

Coronavirus: 15 corona positive cases recorded today
Author
Hyderabad, First Published Mar 31, 2020, 8:33 PM IST

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా ఈ రోజు ఒక్క రోజే 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97కి చేరుకుంది. ఇప్పటికే ఆరుగురు మరణించారు 

14 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో ప్రస్తుతం 77 మంది కరోనా పాజిటివ్ రోగులు ఆస్పత్రుల్లో చికిస్త పొందుతున్నట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు.కరోనా నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 

తెలంగాణ తాత్కాలిక సచివాలయం బీఆర్కె భవన్ లో కరోనా కలకలం చోటు చేసుకుంది. సచివాలయంలో పనిచేస్తున్న ఎఎస్ఓకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. అతను ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చాడు. ఆ విషయాన్ని అతను గోప్యంగా ఉంచాడు. పలువురు ఐఎఎస్ అధికారులతో కూడా అతను కలిసి తిరిగినట్లు తెలుస్తోంది. దీంతో మంగళవారం మధ్యాహ్నం బీఆర్కె భవన్ ను ఖాళీ చేయించి, శానిటైజ్ చేయడం ప్రారంభించారు. 

ఈ కేసుతో తెలంగాణలో ఇప్పటి వరకు 77 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఆరుగురిలో నలుగురు ఢిల్లీలోని ప్రార్థనా కార్యక్రమానికి వెళ్లి తిరిగి వచ్చినవారే. ఇదిలా వుంటే, ఇండోనేషియా నుంచి వచ్చిన వారిని కరోనా నెగెటివ్ రావడంతో హైదరాబాదులోని చెస్ట్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. 

తెలంగాణలో జమాత్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కోసం తెలంగాణ ప్రభుత్వం జల్లెడ పడుతున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని చెక్ పోస్టు వద్ద లోనికి రావడానికి ప్రయత్నించిన 32 మందిని అడ్డుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios