Asianet News TeluguAsianet News Telugu

కరోనా అనుమానంతో దిల్‌షుక్‌నగర్ పోలీసులకు ఫోన్, యువకుడు గాంధీకి తరలింపు

హైద్రాబాద్ దిల్‌సుఖ్ నగర్ లో రూమ్ లో అద్దెకు ఉంటున్న ఓ విద్యార్థి అనారోగ్యంగా ఉండడంతో శుక్రవారం నాడు పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయా లేవా అనే విషయమై వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు.

corona suspect:Dilsukhnagar police shifted youngster to Gandhi hospital
Author
Hyderabad, First Published Mar 27, 2020, 4:34 PM IST

హైదరాబాద్: హైద్రాబాద్ దిల్‌సుఖ్ నగర్ లో రూమ్ లో అద్దెకు ఉంటున్న ఓ విద్యార్థి అనారోగ్యంగా ఉండడంతో శుక్రవారం నాడు పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయా లేవా అనే విషయమై వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు.

దిల్‌సుఖ్‌నగర్ లో రూమ్ అద్దెకు తీసుకొని విద్యార్థి నివాసం ఉంటున్నాడు. దాదాపుగా 20 రోజులగా ఆ విద్యార్థి జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నాడు. ఏ ఆసుపత్రికి వెళ్లినా కూడ పట్టించుకోలేదని యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also read:శుభవార్త: 'తెలంగాణలో ఈ-కామర్స్ సంస్థలకు అనుమతి'

కరోనా అనుమానిత లక్షణాలు ఉండడంతో ఆ స్టూడెంట్ ను పోలీసులు గాంధీ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నాటికి 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల  చర్యలు తీసుకొంటుంది.

ఈ తరుణంలో దిల్‌షుక్ నగర్ ప్రాంతానికి చెందిన యువకుడు శుక్రవారం నాడు  పోలీసులకు ఫోన్ చేయడం స్థానికంగా కలకలానికి కారణమైంది. ఆ యువకుడిని వెంటనే పోలీసులు అత్యవసర పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

విద్యార్థి 25 రోజులుగా ఏ ఆసుపత్రులకు వెళ్లాడు, అక్కడ ఏ రకమైన చికిత్స తీసుకొన్నాడు. విద్యార్థి చెబుతున్న విషయాలు వాస్తవమా కాదా అనే విషయమై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విద్యార్థికి గాంధీ ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్స నిర్వహించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios