Asianet News TeluguAsianet News Telugu

పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు: అసదుద్దీన్ ఓవైసీపై బిజెపి ఎమ్మెల్సీ ఫైర్

హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై బిజెపి ఎమ్మెల్సీ రామచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ ఎంపీ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

BJP MLC Ramachandar Rao retalites Asaduddin Owaisi
Author
Hyderabad, First Published Apr 6, 2020, 4:21 PM IST

హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాదు పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీపై బిజెపి ఎమ్మెల్సీ రామచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు.హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అక్కడక్కడ పిచ్చిపిచ్చిగా  మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. 

ఢిల్లీ నిజాముద్దీన్ సమావేశంలో పాల్గొన్న వారిపై ప్రభుత్వం సీరియస్ గా ఉండటం లేదని ఆయన సోమవారం మీడియా సమావేశంలో విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి నేటితో 40 ఏళ్ళు పూర్తి చేసుకుందని ఆయన చెప్పారు. కరోన నేపథ్యంలో ప్రతి కార్యకర్త , ప్రతి నాయకులు వారి వారి ఇళ్ల వద్దనే పార్టీ జెండా ఆవిష్కరించాలని సూచించినట్లు ఆయన తెలిపారు. 

Also Read: ఫ్లోర్ లీడర్ల భేటీ: ప్రధాని మోడీపై విరుచుకుపడ్డ అసదుద్దీన్ ఓవైసీ

ఒకప్పుడు జన సంఘ్ గా ఉండి  ఆ తరువాత వాజపేయి , అద్వానీల ఆధ్వర్యంలో 1980 లో  బీజేపీ గా ఆవిర్భవించిందని ఆయన చెప్పారు. ఇందిరా గాంధి హత్య తరువాత కేవలం రెండే రెండు సీట్లు గెలిచిన బీజేపీ తరువాత 186 సీట్లకు ఎదిగిసంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిందని అన్నారు. 

తదనంతరం పదేళ్ల పాటు ప్రతిపక్ష హోదాలో ఉండి నరేంద్రమోదీ నాయకత్వం లో  రెండోసారి 300 కు పైగా స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసినంత  అవినీతి దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయలేదని అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాకనే దళితులు ,మైనార్టీలపై దాడులు పెరిగాయన్న కమ్యూనిస్టుల ఆరోపణల్లో వాస్తవం లేదని రామచందర్ రావు అన్నారు. 

Also Read: 9 నిమిషాల జిమ్మిక్కులకు కుదించొద్దు: మోడీపై ఓవైసీ ఫైర్

జన్ ధన్ కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. కరోనాను ఎదుర్కునేందుకు కేంద్రం లక్షా డెబ్భై రెండు వేల కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios