Asianet News TeluguAsianet News Telugu

వాట్సాప్ స్టేటస్ పై ఫిర్యాదు... 8 మందిపై కేసు!

సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టిన ఎనిమిది మంది యువకులపై కేసు నమోదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే, మాల్యాల ఎస్సై ఉపేంద్రా చారి కథనం ప్రకారం, ఒక వర్గానికి చెందినవారిని కించపరిచే విధంగా రామన్నపేట గ్రామానికి చెందిన 8 మంది వాట్సాప్ లో స్టేటస్ లు పెట్టడం జరిగింది. 

8 people arrested in Telangana for propelling enmity and posting derogatory messages targeting a particular section
Author
Malyala, First Published Apr 7, 2020, 7:31 AM IST

ఈ కరోనా వైరస్ విపత్కర పరిస్థితి సమయంలో అభ్యంతకర మెసేజ్ లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన, స్టేటస్ లుగా పెట్టిన, అవి సమాజానికి ఏ మాత్రం నష్టం కలిగించేవిలా ఉన్నా కూడా వెంటనే సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసేందుకు  ప్రభుత్వం జీవో తీసుకు వచ్చిన విషయం తెలిసిందే!

తాజాగా ఇలానే సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టిన ఎనిమిది మంది యువకులపై కేసు నమోదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే, మాల్యాల ఎస్సై ఉపేంద్రా చారి కథనం ప్రకారం, ఒక వర్గానికి చెందినవారిని కించపరిచే విధంగా రామన్నపేట గ్రామానికి చెందిన 8 మంది వాట్సాప్ లో స్టేటస్ లు పెట్టడం జరిగింది. 

ప్రభుత్వం విడుదల చేసిన జీవో 45 ప్రకారంగా, విఆర్వో రమేష్ రెడ్డి ఫిర్యాదు మేరుకు సెల్;ల ఫోన్లు సీజ్ చేసి అల్లావుద్దీన్, అవేజ్, మహేందర్, గణేష్, సురేష్, చందు, రఘు, రఫిక్ లపైనా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 

ఇకపోతే తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కేసీఆర్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కేసులకు తోడు మహా అయితే మరో 100 లేదా 115 కేసులు రిపోర్ట్ అయ్యే ఆస్కారముందని(ప్రస్తుతం వస్తున్న ట్రెండ్ ప్రకారం, పూర్తి స్థాయి రిపోర్టులు ఇంకా అందలేదు) అక్కడితో ఆగితే తెలంగాణ సమాజానికి మేలని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఇక కేసీఆర్ మాట్లాడుతూ... కరోనా వైరస్ వ్యాధి కట్టడిలో తాము గణనీయమైన విజయం సాధించినట్లేనని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. ప్రస్తుతం 308 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు. తెలంగాణలో మొత్తం 364 మందికి కరోనా పాజిటివ్ రాగా, 45 మంది డిశ్చార్జి అయ్యారని ఆయన చెప్పారు. కొత్తగా మరో 60, 70 పాజిటివ్ కేసులు బయటపడవచ్చునని ఆయన అన్నారు. 

ప్రస్తుతం 600 మందికి పరీక్షలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. మరో రెండు రోజుల్లో వారికి సంబంధించిన పరీక్షల నివేదికలు వస్తాయని ఆయన చెప్పారు. లాక్ డౌన్ వల్లనే కరోనా వ్యాధిని కట్టడి చేయగలిగామని ఆయన చెప్పారు. తొలి దశలో కరోనా వైరస్ సోకిన వారంతా క్షేమంగా బయటపడ్డారని ఆయన చెప్పారు. మర్కజ్ ఘటన దేశాన్ని అతలాకుతలం చేసిందని, మన రాష్ట్రానికి కూడా ఆ బెడద తప్పలేదని ఆయన చెప్పారు. 

నిజాముద్దీన్ సంఘటన అతలాకుతలం చేసింది. అన్ని రకాలవి కలిపి 364 మందికి మొత్తం సోకిందని ఆయన చెప్పారు. వారిలో పది మంది కరీంనగర్ టీమ్ అని, వారు క్షేమంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఆ పది మంది డిశ్చార్జీ అయ్యారని ఆనయ చెప్పారు.. మొదటి దశలో మొత్తం 25,937 మందిని క్వారంటైన్ చేశామని ఆయన చెప్పారు.  
మొదటి దశలో విదేశాల నుంచి వచ్చినవాళ్లు, వారి ద్వారా వారి కుటుంబ సభ్యులకు వ్యాధి సోకినవారి సంఖ్య 50 ఉందని, వారిలో 30 మంది విదేశాల నుంచి వచ్చినవాళ్లు కాగా, మిగతావాళ్లు వారి కుటుంబ సభ్యులని ఆయన చెప్పారు. వారంతా క్షేమంగా బయటపడ్డారని, వారిలో ఒక్కరు కూడా చనిపోలేదని ఆయన చెప్పారు. త్వరగా గుర్తించాం కాబట్టి కాపాడగలిగామని ఆయన చెప్పారు.   

ఆ 50 మందిలో 35 మందిని డిశ్చార్జీ చేశామని, మరో 15 మందిని ఎల్లుండిలోగా డిశ్చార్జీ చేస్తామని ఆయన చెప్పారు. ఏప్రిల్ 9వ తేదీలోగా అందరూ డిశ్చార్జీ అవుతారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 11 మంది మరణించారని ఆయన చెప్పారు. వీరంతా రెండో దశకు చెందినవారని, వారు కూడా ఢిల్లీ మర్కజ్ నుంచి తిరిగి వచ్చినవాళ్లేనని ఆయన అన్నారు. 

మర్కజ్ నుంచి వచ్చిన 1089 మందిని గుర్తించామని,  మరో 30, 35 మంది ఢిల్లీలోనే ఉండిపోయినట్లు తెలుస్తోందని, వారిలో 175 మందిని క్వారంటైన్ చేశామని ఆయన చెప్పారు. వారితో సంబంధాల్లోకి వచ్చినవారిని కూడా గుర్తిస్తామని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios