లాక్ డౌన్ ఎఫెక్ట్: నోట్లరద్దు తర్వాత రియాల్టీ రంగంపై కరోనా పిడుగు...

నోట్ల రద్దు తర్వాత పడుతూ లేస్తూ ముందుకు సాగిన రియాల్టీ రంగం కరోనా వైరస్ మహమ్మారితో పూర్తిగా కుదేలైంది. నోట్ల రద్దు తర్వాత ఎన్బీఎఫ్సీ సంక్షోభం ఎదురైనా ఆర్బీఐ, కేంద్రం వ్యవస్థలోకి నిధులను చొప్పించేందుకు ప్రయత్నిస్తుండగా కరోనా కల్లోలం ముంచుకు వచ్చింది. ఫలితంగా గత పదేళ్లలో తొలిసారి ధరలు భారీగా పతనమయ్యాయి. 
 

will india's real estate prices finally face a reality check  now ?

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దెబ్బకు దేశంలో గృహనిర్మాణరంగం కుదేలైంది. నోట్లరద్దు తర్వాత పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్న రియాల్టీ రంగాన్ని కరోనా సంక్షోభం కోలుకోలేని దెబ్బతీసింది. మార్చితో ముసిగిన త్రైమాసికంలో గృహాల అమ్మకాలు 29శాతం పడిపోయాయి. ఇళ్లు కొనేవారు లేక ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడులు వెనక్కురాక కంపెనీలు దివాళా అంచుకు చేరుకున్నాయి. 

ఇప్పటికే రూ.3.65 లక్షల కోట్ల విలువైన ఇండ్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయని, కానీ కొనేవారే లేరని జేఎల్‌ఎల్‌ సంస్థ తెలిపింది. గతేడాది మొదటి త్రైమాసికంలో 38,628 నివాస గృహ విక్రయాలు జరుగగా, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అమ్మకాలు 27,451కి పడిపోయాయని తెలిపింది.   

కరోనా వైరస్ దెబ్బకు ఇండియాలో ప్రాపర్టీ ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. ఈ పదేళ్లలో ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌‌లో తొలిసారి భారీగా ప్రైస్ కరెక్షన్‌‌ (ధరలు తగ్గినట్టు) వచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కరోనా వల్ల దేశవ్యాప్తంగా బిజినెస్‌‌లు ఎక్కడివక్కడ స్తంభించిపోవడంతో, రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా పడిపోయిందని పేర్కొన్నాయి. 

‘ప్రాపర్టీ ధరలు అన్ని ప్రాంతాల్లో సుమారు 10 శాతం నుంచి 20 శాతం పడిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ల్యాండ్ ధరలు అత్యధికంగా 30 శాతం వరకు తగ్గుతున్నాయి’ అని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ లియాసెస్ ఫోరాస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పంకజ్ కపూర్ తెలిపారు. 

ఇది వరకు సంక్షోభం వచ్చినప్పుడు కూడా ఇంత కరెక్షన్‌‌ కనిపించలేదని లియాసెస్ ఫోరాస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పంకజ్ కపూర్ చెప్పారు. అప్పటి నుంచి ఎన్న్బీఎఫ్సీ సంక్షోభం ఉన్నా, చాలా మార్కెట్లలో ధరలు పెరుగుతూనే ఉన్నాయని లియాసెస్ ఫోరాస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పంకజ్ కపూర్ తెలిపారు. షాడో బ్యాంకుల్లో లిక్విడిటీ కొరత తీవ్రం కావడంతో, గతేడాది మాత్రం పరిస్థితి మారిందన్నారు. 

చాలా మంది డెవలపర్లు, ప్రాపర్టీ కొనుగోలుదారులు డిస్కౌంట్లను ఆఫర్ చేయాల్సి వచ్చిందని లియాసెస్ ఫోరాస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పంకజ్ కపూర్ పేర్కొన్నారు. కరోనా వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలుదారులు ఇప్పుడు ప్రాపర్టీ ధరలు మరింత తగ్గుతాయని భావిస్తున్నారు.

also read డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసు..నచ్చని వారిపై వ్యతిరేకత...ఫస్ట్ నుంచి అదే తీరు..

‘ఇది పూర్తిగా బయర్‌‌ మార్కెట్. ఒకవేళ ఎవరైనా నిజంగా డీల్ కుదుర్చుకోవాలనుకుంటే, ధరలను తగ్గించాల్సిందే’ అని ముంబైలోని రహేజా రియాల్టీ సంస్థ ప్రతినిధి రామ్ రహేజా తెలిపారు. దేశవ్యాప్తంగా నాలుగు నుంచి ఐదేళ్ల రియల్ ఎస్టేట్ ఇన్వెంటరీ ఉంది. ఇదే ఆల్‌‌ టైమ్ హై ఇన్వెంటరీ. ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు.
 
ఆన్‌‌లైన్ రియల్ ఎస్టేట్ పోర్టల్ ప్రాప్‌‌టైగర్ జనవరి రిపోర్ట్ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది మేజర్ రెసిడెన్షియల్ మార్కెట్లలో రూ.6 లక్షల కోట్ల అమ్ముడుపోని యూనిట్లు ఉన్నట్టు తెలిసింది. ఒకవేళ డెవలపర్లు తమ స్టాక్స్‌‌ ను లిక్విడేట్ చేసుకోలేకపోతే, డిఫాల్ట్ పెరుగుతాయని బ్యాంక్‌‌లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

బ్యాంకుల్లో మొండి బకాయిలకు మరో 140 బిలియన్ డాలర్లు యాడ్ అవుతాయని తెలుస్తోంది. గత కొన్ని క్వార్టర్ల నుంచి పడిపోతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్‌‌ను కోలుకునేలా చేయడానికి ప్రభుత్వం కూడా పలు చర్యలు తీసుకుంటోంది. డబ్బులు లేక చాలా ప్రాజెక్ట్‌‌ లు స్ట్రక్ అయ్యాయి. కొనుగోలుదారుల వద్ద నిధులు ఉండటం లేదు. 

దీంతో లిక్విడిటీకి ఆర్బీఐ, కేంద్రం చర్యలు తీసుకుంటున్న వేళ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.  ఈ వైరస్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌‌ను మరింత దెబ్బకొడుతోందని డెవలపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా దెబ్బకు దేశీయ గృహ కొనుగోళ్ల రంగం కుదేలైనట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ జోన్స్ లాంగ్ లాసాల్లే(జేఎల్​ఎల్​) వెల్లడించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత్​లో 7 ప్రధాన నగరాల్లో గృహ అమ్మకాలు 29 శాతం పడిపోయాయన్న జేఎల్​ఎల్.. 27,451 యూనిట్లకు చేరిందని తెలిపింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమ్ముడుపోని యూనిట్ల విలువ రూ. 3.65 లక్షల కోట్లకు పెరిగినట్లు జేఎల్​ఎల్ వెల్లడించింది. చాలా మంది తమ గృహ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారని వివరించింది. 

గత ఐదేళ్లలో నోట్ల రద్దు తరువాత ఈ స్థాయిలో కొనుగోళ్లు క్షీణించడం ఇదే తొలిసారి అని జేఎల్​ఎల్ పేర్కొంది. బెంగళూరులో కొనుగోళ్ల క్షీణత 52 శాతం ఉండగా.. హైదరాబాద్‌లో 41, కోల్‌కతాలో 35, ముంబైలో 19 శాతం మేర ఉందని స్పష్టం చేసింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios