Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటకలో మూడో కరోనా మరణం: 62కి చేరిన కేసుల సంఖ్య, సర్కార్ అప్రమత్తం

దేశంలో ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. శుక్రవారం దేశంలో మరో కరోనా మరణం సంభవించింది. తుముకూరుకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు వైరస్‌తో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. 

Third corona death in karnataka
Author
Tumakuru, First Published Mar 27, 2020, 5:33 PM IST

దేశంలో ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. శుక్రవారం దేశంలో మరో కరోనా మరణం సంభవించింది. తుముకూరుకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు వైరస్‌తో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

ఆ వృద్ధుడు ఈ నెల 5న ఢిల్లీకి వెళ్లి 11న రాష్ట్రానికి తిరిగొచ్చాడు. బాధితుడితో పాటు రైలులో ప్రయాణించిన వారి వివరాలను సేకరించే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. మరోవైపు కర్ణాటకలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

Also Read:తాను చనిపోతూ.. 23 మందికి కరోనా అంటించాడు, 15 గ్రామాలకు సీల్

తాజాగా మరో ఏడు కొత్త కేసులు నమోదవ్వడంతో ఆ రాష్ట్రం కరోనా బాధితుల సంఖ్య 62కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో పది నెలల చిన్నారి కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ఈ పిల్లాడి తల్లిదండ్రులది దక్షిణ కన్నడ జిల్లాగా తెలుస్తోంది. వారెవరూ విదేశాలకు వెళ్లి రాలేదు. కానీ ఇటీవలే వీరి కుటుంబం కేరళ వెళ్లి వచ్చిందని సమాచారం. రంగంలోకి దిగిన అధికారులు వీరితో కాంటాక్ట్‌లో వారి వివరాలు సేకరించే పనిలో పడింది.

Also Read:ఇల్లు దాటితే ముఖంపై స్టాంప్ పడుద్ది: లాక్‌డౌన్‌ అమలుకు కశ్మీర్ పోలీసుల ప్రయోగం

అలాగే కొలంబో వెళ్లి మార్చి 15న బెంగళూరు తిరిగొచ్చిన 20 ఏళ్ల వ్యక్తికి, లండన్ నుంచి మార్చి 18న తిరిగొచ్చిన 25 ఏళ్ల యువతికి కరోనా సోకినట్లు తేలింది. ఓ కరోనా పేషేంట్ ఇంట్లో పనిచేసే ఇద్దరు మహిళలకు కూడా వైరస్ సోకింది. మొత్తం మీద కర్ణాటకలో వైరస్ బారినపడిన వారి సంఖ్య మూడుకు చేరింది. 

Follow Us:
Download App:
  • android
  • ios