చెన్నై:కరోనా లాక్ డౌన్ తో మందుబాబులు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. తమిళనాడులో మద్యం దొరకక పెయింట్, వార్నిష్ ను కలుపుకొని తాగిన మందుబాబులు ప్రాణాలు కోల్పోయారు.

తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టులో శివశంకర్, ప్రదీప్, శివరామన్ లు మద్యం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. మద్యం లభించలేదు. పెయింట్, వార్నిష్ లు కలుపుకొని ఆదివారం నాడు తాగారు. దీంతో ఈ ముగ్గురు అనారోగ్యానికి గురయ్యారు.  దీంతో ఈ ముగ్గురు అనారోగ్యానికి గురయ్యారు.

అనారోగ్యానికి గురైన ఈ ముగ్గురు వాంతులు చేసుకొన్నారు. దీంతో వారిని గుర్తించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో వైద్యులు వారిని పరీక్షించారు. అయితే అప్పటికే ఈ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ప్రకటించారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 25వ తేదీ నుండి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో అత్యవసర సేవలకు మినహయింపు ఇచ్చారు. నిత్యావసర సరుకులు, ఆసుపత్రులు, మెడికల్ దుకాణాల వంటివి తెరిచే ఉంచుతున్నారు. 

also read;ఇండియాలో 4067కి చేరిన కరోనా కేసులు,109 మంది మృతి: కేంద్రం

 లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలను మూసివేశారు. మద్యం దుకాణాలు మూసివేయడంతో మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దేశ వ్యాప్తంగా మద్యం ప్రియులు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. మద్యం కోసం మహారాష్ట్రలో రిక్షా కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

కేరళలో డాక్టర్ ప్రిస్కిప్షన్ చూపితే మద్యం విక్రయిస్తామని కేరళ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కేరళ హైకోర్టు మద్యం విక్రయాలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.