Asianet News TeluguAsianet News Telugu

మోడీ పిలుపు: స్పందించి, స్పందించమని కోరిన క్రీడాకారులు!

క్రీడా మంత్రి కిరణ్‌ రిజుజు సహా 40 మంది క్రీడాకారులతో ప్రధాని రెండు రోజుల కింద వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రజల్లో అవగాహన అకల్పించాలని ప్రధాని వారందరిని కోరడంతో నేడు వారంతా సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులకు, ప్రజలకు దీపాలు వెలిగించమని పిలుపునిచ్చారు.

PM Modi's Call for Solidarity: Cricketers and other sport stars  Respond and ask People to respond
Author
New Delhi, First Published Apr 5, 2020, 1:09 PM IST

కరోనా వైరస్‌ పై చేస్తున్న సమరంలో ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు క్రీడాకారులు తమ వంతు పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరెేంద్ర మోడీ మొన్న క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ కోరారు. 

క్రీడా మంత్రి కిరణ్‌ రిజుజు సహా 40 మంది క్రీడాకారులతో ప్రధాని రెండు రోజుల కింద వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రజల్లో అవగాహన అకల్పించాలని ప్రధాని వారందరిని కోరడంతో నేడు వారంతా సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులకు, ప్రజలకు దీపాలు వెలిగించమని పిలుపునిచ్చారు. రోహిత్ శర్మ నుంచి కేఎల్ రాహుల్ వరకు అందరూ ట్విట్టర్ వేదికగా దీపాలు వెలిగించమని, ప్రధాని పిలుపుకు స్పందించాలని కోరారు. 

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సహా రోహిత్‌ శర్మ, యువరాజ్‌ సింగ్‌, జహీర్‌ఖాన్‌, పి.వి సింధు, మేరీకోమ్‌, మీరాబాయిచాను, బి. సాయిప్రణీత్‌, హిమ దాస్‌, వినేశ్‌ ఫోగట్‌, అమిత పంఘాల్‌, అజరు ఠాకూర్‌, నీరజ్‌ చోప్రాలు, విశ్వనాథన్‌ ఆనంద, మను భాకర్‌లు ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో అభిప్రాయాలు పంచుకున్నారు. 

సవాళ్లను ఎదుర్కొనే తత్వం, ఆత్మ నిగ్రహం సానుకూల దృక్పథం, ఆత్మ విశ్వాసం క్రీడల్లో విజయానికి బాట వేస్తాయని, కోవిడ్‌-19ను కట్టడి చేసేందుకు సైతం ఈ సూత్రాలే పాటించాలని ప్రజలకు పిలుపునివ్వాలని కోరారు. 

సోషల్‌ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించటం, ప్రభుత్వ సూచనలు పాటించమని కోరటం, ప్రధాని సహాయనిధికి విరాశాలు ఇవ్వమని అడగటం చేయాలని మోడీ క్రీడాకారులను కోరారు. క్రికెట్‌ లెజెండ్‌ ఎం.ఎస్‌ ధోని, నయా స్టార్‌ కెఎల్‌ రాహుల్‌లు సైతం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ, వారు ఫోన్‌ కాల్స్‌కు స్పందించలేదని సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios