Asianet News TeluguAsianet News Telugu

కరోనాకు థ్యాంక్స్‌.. హీరోయిన్‌ కామెంట్‌పై నెటిజెన్లు ఫైర్‌

బాలీవుడ్ సీనియర్‌ నటి విద్యా బాలన్‌ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ విమర్శలకు కారణమైంది. దేశం అంతా విపత్కర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో  విద్యా మాత్రం థ్యాంక్యూ కరోనా అంటూ ఓ వీడియోను పోస్ట్ చేయటంపై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు.

Netizens troll Vidya Balan for thanking coronavirus
Author
Hyderabad, First Published Mar 25, 2020, 11:30 AM IST

కరోనా ప్రభావంతో ప్రపంచమంతా భయంతో వణికిపోతుంది. కేంద్ర దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో అంతా ఇంటికే పరిచయం అవుతున్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు ఆసక్తికర ట్వీట్లు చేస్తూ ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ సీనియర్‌ నటి విద్యా బాలన్ చేసిన ఈ ట్వీట్ ఆసక్తికర చర్చకు దారి తీసింది. ప్రపంచ అంతా భయోత్పాత పరిస్థితుల్లో ఉండగా విద్యా బాలన్ మాత్రం కరోనా కు థ్యాంక్స్‌ అంటూ ట్వీట్ చేసింది.

కోవిడ్ 19 కారణంగా అంతా లాక్‌ డౌన్‌ అయ్యింది. `వెహికల్స్‌ వల్ల వచ్చే పొల్యూషన్‌ తగ్గిపోయింది. గాలి స్వచ్ఛంగా మారుతోంది. చెట్లు ఎదుగుతున్నాయి. ఆకాశం ప్రశాంతంగా ఉంది. ఈ అవకాశాన్ని భూమి పునరుజ్జీవనం కోసం వినియోగించుకుంటుంది` అంటూ విద్యా బాలన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ లో పోస్ట్ చేసింది. రెండున్నర నిమిషాల నిడివి గల వీడియోలో ప్రజలు ప్రకృతి విషయం చేస్తున్న పొరపాట్లు, ప్రస్తుతం కరోనా ప్రభావంతో పాఠాలను ప్రస్థావించింది. అయితే ఈ వీడియో విషయంలో కొంత మంది పాజిటివ్‌ గానే స్పందిస్తున్న మరికొందరు మాత్రం ఫైర్‌ అవుతున్నారు.

ప్రపంచమంత మృత్యు ఘంటికలు మోగిస్తున్న కరోనాకు థ్యాంక్స్‌ అంటూ ట్వీట్ చేయటం కరెక్ట్ కాదంటూ కామెంట్ చేస్తున్నారు. `ఈ సమంలో ఇది సరైన ట్వీట్ కాదు` అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లావిష్ ఇంట్లో ఉండే నీకు కరోనా ప్రభావం అలాగే అనిపిస్తుంది. కానీ రోజు వారి కూలీ మీద బతికే ఎంతో మందికి జీవనోపాది పోయింది. ప్రకృతిని కాపాడాలని అందరికీ ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి పోస్ట్ సరైంది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vidya Balan (@balanvidya) on Mar 23, 2020 at 9:02pm PDT

Follow Us:
Download App:
  • android
  • ios