భారత్‌లో కరోనా వ్యాపించకుండా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో పాటు విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాల లక్ష్యాన్ని, జనం ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోని కొందరు క్వారంటైన్ కేంద్రాల నుంచి తప్పించుకుంటున్నారు.

తాజాగా ఓ వ్యక్తి ప్రియురాలిని చూడకుండా ఉండలేక క్వారంటైన్ కేంద్రం నుంచి తప్పించుకుని వెళ్లడం ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని మధురైకి చెందిన 24 ఏళ్ల యువకుడు ఇటీవల దుబాయ్ నుంచి భారతదేశానికి వచ్చాడు.

#Also Read:తాను చనిపోతూ.. 23 మందికి కరోనా అంటించాడు, 15 గ్రామాలకు సీల్

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలని ఆదేశించింది. ఈ యువకుడిని కూడా క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.

అయితే ప్రియురాలిని చూడకుండా వుండలేకపోతున్న ఆ యువకుడు శివగంగ జిల్లాలో వున్న ప్రేయసి కోసం క్వారంటైన్ కేంద్రం నుంచి  తప్పించుకున్నాడు. దీంతో పోలీసులు, వైద్య సిబ్బంది, అధికారులు అతని కోసం ఉరుకులు పరుగులు పెట్టారు.

#Also Read:కరోనా: హోం క్వారంటైన్ నుండి హోం టౌన్‌కు జంప్, ఐఎఎస్‌పై కేసు

ఎంతో శ్రమించి ఎట్టకేలకు ఆ యువకుడిని పట్టుకుని అతనితో పాటు యువతిని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. తమ ప్రేమకు ప్రియురాలి తల్లిదండ్రులు అంగీకరించకపోవడం వల్లే తాను తప్పించుకుని వెళ్లి ఆమెను కలవాల్సి వచ్చిందని అతను విచారణలో పోలీసులకు వెల్లడించాడు.