Asianet News TeluguAsianet News Telugu

తబ్లిగీ జమాత్ తో లింక్స్: కేంద్రం, అజిత్ దోవల్ లపై మహారాష్ట్ర హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఒక లేఖను విడుదల చేసారు. ఇందులో ఆయన ఢిల్లీలో తబ్లీగి జమాత్ కార్యక్రమం ఎలా నిర్వహించిందని, ఢిల్లీ పోలీసులు ఎలా పర్మిషన్ ఇచ్చారని ఇంకా అనేక ప్రశ్నలు ఆయన ఈ లేఖలో లేవనెత్తారు. 

Maharashtra Home minister makes sensational comments on Centre,  NSA Ajit Doval regarding tabligi jamat links
Author
Mumbai, First Published Apr 8, 2020, 4:42 PM IST

ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్ ఘటన తరువాత దేశమంతా కరోనా కేసులు  విపరీతంగా పెరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఒక లేఖను విడుదల చేసారు. ఇందులో ఆయన ఢిల్లీలో తబ్లీగి జమాత్ కార్యక్రమం ఎలా నిర్వహించిందని, ఢిల్లీ పోలీసులు ఎలా పర్మిషన్ ఇచ్చారని ఇంకా అనేక ప్రశ్నలు ఆయన ఈ లేఖలో లేవనెత్తారు. 

అసలు ఢిల్లీ పోలీస్ ఈ ఈవెంట్ కి పర్మిషన్ ఎందుకు ఇచ్చింది. ఢిల్లీ పోలీస్ పర్మిషన్ ఇచ్చిందంటే, కేంద్ర హోమ్ శాఖ పాత్ర ఇందులో ఏముంది? అర్థరాత్రి రెండు గంటలకు అజిత్ దోవల్ మర్కజ్ కు వెళ్లవలిసిన వసరం ఏముంది? ఈ పర్మిషన్ ఇచ్చింది ఇంతకులు ఢిల్లీ  పోలీసులా,లేక అజిత్ దోవల్ స్పెషల్ ఇంటరెస్ట్ ఎమన్నా ఉందా ఈ పర్మిషన్ లో అని ప్రశ్నించారు. 

Maharashtra Home minister makes sensational comments on Centre,  NSA Ajit Doval regarding tabligi jamat links

అర్థరాత్రి అజిత్ దోవల్ మర్కజ్ మౌలానా తో మాట్లాడిన తరువాత ఇంతకు ఢిల్లీ పోలీసులు కానీ, అజిత్ దోవల్ కానీ ఎందుకు మాట్లాడలేదు? ఆ మీటింగ్ తరువాత నుంచి మౌలానా ఎందుకు కనబడడం లేదు?

ఈ అన్ని విషయాలను పరిశీలించిన తరువాత మూడు విషయాలు మాత్రం స్పష్టంగా అర్థమవుతున్నాయని మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ అన్నారు. 

మర్కజ్ లోకి మీకు ఆక్సెస్ ఉంది, మీరు మీటింగ్ ని ఆపగలిగే స్థితిలో ఉంది కూడా కావాలనే ఆపలేదు. పర్మిషన్ ఇచ్చారు. మీకు తబ్లీగి జమాత్ తో సంబంధాలున్నాయి అని అనిల్ దేశ్ ముఖ్ అన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios