Asianet News TeluguAsianet News Telugu

కరోనా కలకలం.. ట్రక్కుల్లో 300మంది కార్మికులు

మొత్తం రెండు ట్రక్కుల్లో 300 మంది కార్మికులు ఉన్నట్లు గుర్తించారు. కాగా.. ట్రక్కు డ్రైవర్ల పొంత లేని సమాధానాల వల్లే తమకు అనుమానం కలిగిందని.. తెరచి చూడగా కార్మికులు ఉన్నారని అధికారులు చెప్పారు. 

Maharashtra Cops Opened 2 Container Trucks, Found Over 300 Migrant Workers
Author
Hyderabad, First Published Mar 27, 2020, 11:57 AM IST

కరోనా వైరస్ ని అరికట్టేందుకు భారత ప్రభుత్వం 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఎవరూ ఇంట్లో నుంచి బయటకు కూడా అడుగు పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో.. వలస కార్మికులు అవస్థలు పడుతున్నారు. తమ ప్రాంతాలకు తమను వెళ్లనివ్వాలని వేడుకుంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో రహస్యంగా స్వగ్రామాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అలా ప్రయత్నిస్తూ 300 మంది కార్మికులు పోలీసులకు చిక్కారు.

Also Read కరోనా అనుమానం: భయంతో సొంత తమ్ముడిని చంపిన అన్న...

తెలంగాణ నుండి రాజస్థాన్‌కు అవసరమైన వస్తువులను రవాణా చేస్తున్న రెండు కంటైనర్ ట్రక్కుల లోపల 300 మందికి పైగా వలస కార్మికులు ఉన్నట్లు  మహారాష్ట్ర పోలీసులు  గుర్తించారు. తెలంగాణ బోర్డర్ లో పోలీసులు సోదాలు చేయగా.. కార్మికులను గుర్తించారు.

వారంతా  రాజస్థాన్ నుండి తెలంగాణకు వలస వచ్చారు. తిరిగి తమ ఇంటికి వెళ్లేందుకు ఈ మార్గం ఎంచుకున్నారని అధికారులు చెబుతున్నారు. లాక్ డౌన్ తో తమకు పనులు లేకుండా పోయాయని.. దీంతో పస్తులు ఉండాల్సి వస్తోందని అందుకు స్వగ్రామాలకు వెళ్లాలని అనుకుంటున్నామని వారు చెప్పడం గమనార్హం.

మొత్తం రెండు ట్రక్కుల్లో 300 మంది కార్మికులు ఉన్నట్లు గుర్తించారు. కాగా.. ట్రక్కు డ్రైవర్ల పొంత లేని సమాధానాల వల్లే తమకు అనుమానం కలిగిందని.. తెరచి చూడగా కార్మికులు ఉన్నారని అధికారులు చెప్పారు. 

ట్రక్కు డ్రైవర్లపై చర్యలు తీసుకోనున్నట్లు వారు చెప్పారు. కాగా.. కార్మికులను ఎక్కడికి తరలించాలి అనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios