Asianet News TeluguAsianet News Telugu

సెప్టెంబర్ వరకు లాక్ డౌన్..? సోషల్ మీడియాలో న్యూస్ వైరల్

భారత్‌లాంటి విశాల దేశంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతో వైరస్‌ నియంత్రణ అసాధ్యమని, విధాన నిర్ణయాలూ ప్రభావశీలంగా లేవని మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సంస్థ బోస్టన్‌ కన్సల్టెంగ్‌ గ్రూప్‌ (బీసీజే) రూపొందించిన ఓ నివేదిక పేర్కొన్నట్లు ఆ వార్త సారాంశం. 

Lockdown will continue till september in india?
Author
Hyderabad, First Published Apr 7, 2020, 10:26 AM IST

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తోంది. సరిగ్గా మరో వారం రోజుల్లో లాక్ డౌన్ పూర్తి కానుంది. అయితే... ఆ లాక్ డౌన్ ఇంతటితో ముగిస్తారా లేదా... కొనసాగిస్తారా అనే విషయంపై ప్రజల్లో సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలో.. సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.

Also Read దేశంలో విస్తరిస్తున్న మహమ్మారి: 4 వేలు దాటిన కరోనా కేసులు, మృతుల సంఖ్య 114...

ఈ లాక్ డౌన్ సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది అనేది ఈ వార్త సారాంశం.భారత్‌లాంటి విశాల దేశంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతో వైరస్‌ నియంత్రణ అసాధ్యమని, విధాన నిర్ణయాలూ ప్రభావశీలంగా లేవని మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సంస్థ బోస్టన్‌ కన్సల్టెంగ్‌ గ్రూప్‌ (బీసీజే) రూపొందించిన ఓ నివేదిక పేర్కొన్నట్లు ఆ వార్త సారాంశం. 

ఇది వైరల్‌ అయి కొన్ని వర్గాల్లో ఆందోళన రేపింది. ఒక నివేదికలో జూన్ వరకు అని.. మరో నివేదికలో సెప్టెంబర్ వరకూ లాక్‌డౌన్‌ పొడిగించవచ్చని ఉంది. దీనికి కారణం జూన్‌ రెండు, మూడు వారాలకు కరోనా విస్తరణ ప్రబలమై భారత్‌లో పతాకస్థాయికి చేరవచ్చని నివేదిక పేర్కొన్నట్లు వార్తలొచ్చాయి. 

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా మీడియా సమావేశంలో ఈ నివేదికను ప్రస్తావించడం విశేషం. అయితే ఈ వార్తలను బీసీజే ఖండించింది. లాక్‌డౌన్‌ పొడిగింపుపై తామెలాంటి అంచనాలూ వెలువరించలేదని స్పష్టం చేసింది. లాక్ డౌన్ గురించి గానీ, కరోనా వైరస్ గానీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం రాత్రి సోషల్ మీడియాలో పోస్టుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios