Asianet News TeluguAsianet News Telugu

కరోనా వాక్సిన్ రెడీ అంటున్న హైదరబాదీ కంపెనీ: గతంలో స్వైన్ ఫ్లూకి కూడా...

తాజాగా భారత ఫార్మా దిగ్గజం, మన హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ కరోనా వాక్సిన్ ని తాయారు చేస్తున్నట్టు తెలిపింది. మిగిలిన వాక్సిన్లలా కాకుండా ఇది సహజంగా కరోనా వైరస్ మనుషుల్లోకి ప్రవేశించే ముక్కు మార్గం గుండానే మనిషి శరీరంలోకి ప్రవేశపెట్టేదిగా నేసల్ వాక్సిన్ ని తయారుచేస్తున్నట్టు తెలిపారు. 

Intranasal vaccine for Covid-19 under development says Bharat Biotech
Author
Hyderabad, First Published Apr 3, 2020, 3:03 PM IST

కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడటానికి ఇప్పటికింకా సరైన మందు లేకపోవడంతో వాక్సిన్ మాత్రమే దిక్కని అందరూ భావిస్తూ... త్వరగా ఈ వాక్సిన్ మార్కెట్లోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన కంపెనీలు ఈ వాక్సిన్ ని తాయారు చేసే పనిలో బిజీగా ఉన్నాయి. 

తాజాగా భారత ఫార్మా దిగ్గజం, మన హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ కరోనా వాక్సిన్ ని తాయారు చేస్తున్నట్టు తెలిపింది. మిగిలిన వాక్సిన్లలా కాకుండా ఇది సహజంగా కరోనా వైరస్ మనుషుల్లోకి ప్రవేశించే ముక్కు మార్గం గుండానే మనిషి శరీరంలోకి ప్రవేశపెట్టేదిగా నేసల్ వాక్సిన్ ని తయారుచేస్తున్నట్టు తెలిపారు. 

ఇప్పటికే గతంలో స్వైన్ ఫ్ల్యూ కి విజయవంతంగా వాక్సిన్ తయారుచేసిన ఘనత కలిగిన భారత్ బయోటెక్ మరోసారి కరోనా వాక్సిన్ ని తయారు చేసేందుకు పూనుకుంది. ఇప్పటికే మనుషులకు ఎటువంటి హాని కలిగించని ఫ్లూ వాక్సిన్ బేస్ మీదనే ఈ వాక్సిన్ ని కూడా తాయారు చేస్తున్నట్టు తెలిపారు. 

Also read:కరోనా: వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది రక్షణకు బయో సూట్ తయారీలో డీఆర్‌డిఓ

యూనివర్సిటీ అఫ్ విస్కాన్సిన్- మాడిసన్ తో పాటుగా ఫ్లూ జెన్ కంపెనీ వైరాలజిస్టులతో కలిసి భారత్ బయోటెక్ ఈ వాక్సిన్ ని తయారు చేస్తుంది. దీనికి కోరోఫ్లు అని నామకరణం చేసారు. 

ఫ్లూ జెన్ కంపెనీకి చెందిన వాక్సిన్ బేస్ ఎం2ఎస్ఆర్ ను ఇందుకోసం వినియోగించనున్నారు. ఈ  ఎం2ఎస్ఆర్ మానవ శరీరంలోకి వెళ్ళగానే.... అది ఫ్లూ కి వ్యతిరేకంగా శరీరం నుంచి రక్షక కణాలను విడుదల చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ  ఎం2ఎస్ఆర్ లోకి కరోనా వైరస్ ని ఎక్కించి మనిషి శరీరంలోకి పంపిస్తే... అప్పుడు కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు మానవా శరీరం ఎప్పటిలాగే రక్షక కణాలను విడుదల చేస్తుంది. 

కాబట్టి ఈ వాక్సిన్ సక్సెస్ అవ్వడానికి అత్యధిక ఆస్కారం ఉంది. క్లినికల్ ట్రయల్స్ పూర్తవగానే 300 మిలియన్ల డోసులను ఉత్పత్తిలో చేయాలనుకుంటున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.  అన్ని అనుకున్నట్టు సజావుగా సాగితే సెప్టెంబర్ నాటికి మనుషుల మీద ట్రయల్స్ నిర్వహిస్తామని ప్రతినిధులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios