కరోనా  వైరస్ మహమ్మారి అటు దేశ ఆర్ధిక వ్యవస్థని, ఇటు దేశ ప్రజలని వదలట్ లేదు. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా  వైరస్ కేసులు, లాక్ డౌన్ పొడిగింపు వల్ల అత్యవసర సేవలు మినహా అన్నీ నిలిచిపోయాయాయి. లాక్ డౌన్ వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని భావించాం.

కానీ ఇప్పుడు కేసుల సంఖ్యను గమనిస్తే ప్రతిరోజు కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దేశంలో మొత్తం కేసులు ఇప్పటికే 21వేలు దాటిపోయాయి. ఇలాంటి సమయంలో ఈఎంఐ మారటోరియం పెంచాలని అందరూ కోరుతున్నారు. మొదట ఈఎంఐ కట్టకుండా మారటోరియం 3 నెలలుకు వరకు ఆప్షన్ ఇచ్చింది.

కానీ కరోనా వైరస్ కేసుల వ్యాప్తి చూస్తుంటే ఇప్పట్లో తగ్గేలా లేదు. వ్యాక్సిన్ వస్తే తప్ప కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కష్టంగా మారుతోంది. దేశంలో ప్రజలు సామాజిక దూరం పటిస్తున్న వ్యాప్తి మాత్రం విస్తరిస్తుంది. ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 21 వేలు దాటిపోయింది. ఇక మరణాల సంఖ్య 700కు సమీపంలో ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బి‌ఐ) ఇప్పటికే తన బ్యాంక్ కస్టమర్లకు 3 నెలలు ఈఎంఐ కట్టకుండా మారటోరియం ఆప్షన్ అందించిన విషయం మీకు తెలిసిందే. అయితే కరోనా వైరస్ కేసులు కంట్రోల్ కాకపోవడం వల్ల మూడు నెలల ఈఎంఐ మారటోరియంను మరి కొంత కాలం పొడిగిస్తే బాగుంటుందనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.


ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తాజాగా కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వు బ్యాంక్ (ఆర్‌బి‌ఐ) పలు కీలక సూచనలు చేసింది. కరోనా వైరస్ వల్ల ప్రతికూల ప్రభావం ఎదుర్కొంటున్న రంగాలపై ఆర్థిక భారం తగ్గించాలని సూచించింది.

ఎంఎస్ఎంఈ లోన్స్‌కు క్రెడిట్ గ్యారంటీ, కరోనా వైరస్ (కోవిడ్ 19) వల్ల ప్రభావం పడిన రంగాలకు వన్ టైమ్ లోన్ రిస్ట్రక్చరింగ్, ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి ఉపశమనం కల్పించడం, మారటోరియం పెంపు (3 నుంచి 6 నెలలకు) వంటి సదుపాయలను కల్పించాలని తాజాగా ప్రతిపాదించింది.

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం లోన్ రిస్ట్రక్చరింగ్ అనేది నిషేధం. అలాగే డిఫాల్ట్ అయినా రుణాలను దివాల చట్టం ప్రకారమే పరిష్కరించాలి. వివిధ రంగాలకు చెందిన పరిశ్రమ వర్గాలు అందించిన సూచనలను పరిగణలోకి తీసుకొని ఐబీఏ తాజాగా కేంద్రానికి, ఆర్‌బీఐకి వివిధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేసింది.

ఎస్‌బీఐ చైర్మన్ రజ్‌నీష్ కుమార్ మాట్లాడుతూ లోన్ మారటోరియం పీరియడ్‌ను 3 నెలల నుంచి 5-6 నెలలకు పెంచాలని ఐబీఏ బ్యాంకులను కోరిందని గతంలోనే తెలియజేశారు. కాగా కరోనా వైరస్ వల్ల దేశీ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. జీడీపీ 1 శాతం లేదా ఇంకా సున్నాగా కూడా నమదు కావొచ్చని అంచనాలు ఉన్నాయి.