Asianet News TeluguAsianet News Telugu

సరికొత్త యాప్: కరోనా వ్యాధి లక్షణాలు మీకున్నాయా తెలుసుకోవాలంటే!

మీకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయా, లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రభుత్వం సరికొత్త యాప్ ను విడుదల చేసింది. ఆ యాప్ ద్వారా మీకు కరోనా లక్షణాలు ఉన్నాయా, లేదా తెలుసుకోవచ్చు.

Govt new App to find out Coronavirus infection for you
Author
Delhi, First Published Mar 31, 2020, 11:48 AM IST

ఈ కరోనా సంక్షోభ సమయంలో ప్రజలకు సరైన విధంగా ఉపయోగపడే ఒక సరికొత్త యాప్ ప్రభుత్వ సహకారంతో ఆవిష్కరించబడింది. మీకు కానీ, మీ కుటుంబానికి కరోనా వైరస్ వ్యాధి రిస్క్ ఎంతో తెలుసుకోవడానికి భారత్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నేషనల్ ఇంటిగ్రేటెడ్ హెల్త్, వెల్ నెస్ కేర్ నెట్ వర్క్ NIHWN.Co సంజీవన్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఈ సరికొత్త యాప్ ని ఆవిష్కరించారు.

ఈ యాప్ ద్వారా మీకు కరోనా లక్షణాలున్నాయా? లేదా? మీ కుటుంబంలో ఇంకెవరికైనా ఈ లక్షణాలున్నాయా అని తెలుసుకునే వీలు ఉంది. 

దీనికి మనం యాప్ లో అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తే సరిపోతుంది. మనకు కానీ, మన కుటుంబంలో ఎవరికైనా కరోనా లక్షణాలున్నాయో లేదో ఖచ్చితమైన అంచనాతో చెప్తుంది.

అంతేకాదు... కరోనాకి సంబంధించి ఫేక్ సమాచారంతో  విసిగిపోతున్న మనకు ఈ యాప్ ద్వారా కరోనా బాధితులకు సంబంధించిన, మరియు కరోనా వ్యాధి గురించిన ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లో కానీ, ఆపిల్ ప్లే స్టోర్ లో కానీ NIHWN అని టైప్ చేసి ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు లేదా ఈ కింది లింక్ ల ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

గూగుల్ ప్లే స్టోర్ లింక్: https://tinyurl.com/NIHWNgoogle
ఆపిల్ ప్లే స్టోర్ లింక్: https://tinyurl.com/NIHWNapple

Follow Us:
Download App:
  • android
  • ios