చైనా పెట్టుబడులకు బ్రేక్‌.. ఆ మూడు కంపెనీలకు షాక్..

దేశంలోకి చైనా పెట్టుబడుల రాకపై కేంద్రం నూతనంగా విధించిన ఎఫ్‌డీఐ నిబంధనలతో బిగ్ బాస్కెట్, ఓలా, పేటీఎం వంటి స్టార్టప్ సంస్థలకు ఎదురు దెబ్బ తగలనున్నది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినడాన్ని తనకు అనువుగా మార్చుకోవాలన్న చైనా వ్యూహానికి అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం ఎఫ్ డీఐ నిబంధనలు కఠినతరం చేసింది. 
 

Fresh Chinese investments in India's tech economy may slowdown

న్యూఢిల్లీ: దేశీయ సంస్థల్లో చైనాతోపాటు ఇరుగుపొరుగు దేశాల పెట్టుబడులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఎఫ్‌డీఐ నిబంధనలు మూడు కంపెనీలను దెబ్బ తీయనున్నాయి. ప్రత్యేకించి దేశీయ స్టార్టప్ కంపెనీలైన బిగ్ బాస్కెట్, ఓలా, పేటీఎం వంటి టెక్ స్టార్ట‌ప్‌లపై తీవ్ర ప్రభావం పడనున్నది. ఈ కంపెనీల్లో చైనీస్ పెట్టుబడులు తగ్గే అవకాశం ఉంది. 

ఆన్‌లైన్ గ్రోసరీ రిటైలర్ బిగ్‌బాస్కెట్, డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎం, రైడ్ షేరింగ్ ప్లాట్‌‌ఫామ్ ఓలా కంపెనీల్లో చైనీస్ కంపెనీలు ఇప్పటికే కోట్ల కొద్దీ డాలర్లను ఇన్వెస్ట్‌ చేశాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌‌ మెంట్ (ఎఫ్‌డీఐ) రూల్స్‌‌ ఈ కంపెనీల్లోకి తాజాగా పెట్టుబడులు పెట్టాలంటే చైనీస్ ఇన్వెస్టర్లకు ఆటంకంగా మారాయి. 

ఇక ఇండియన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలంటే చైనా పెట్టబడి దారులు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. కరోనా దెబ్బకు దేశీయ కంపెనీలన్ని భారీగా నష్టపోతోన్న సంగతి తెలిసిందే. దీన్ని అవకాశంగా తీసుకుని, ఇండియన్ కంపెనీల్లో చైనా వాటాలు పెంచుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో లోకల్ కంపెనీలను రక్షించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ

 నిరయం తాజాగా ఇండియన్ స్టార్టప్‌లలో టెన్సెంట్, అలీబాబా వంటి చైనీస్ ఇన్వెస్టర్లు పెట్టే పెట్టుబడులపై ఎఫెక్ట్ చూపనుంది. ‘కొత్త ఎఫ్‌డీఐ గైడ్‌లైన్స్ ప్రకారం, చైనీస్ కా పిటల్ ఇండియన్ కంపెనీల్లోకి రావాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఈ రూల్స్ ​ఇష్టం లేని వారు ఇన్వెస్ట్​మెంట్లకు దూరమవుతారు. ముఖ్యంగా ఫోన్‌పే వంటివి ఇబ్బంది పడుతాయి’ అని భారత్‌ పే కో ఫౌండర్, సీఈవో అశ్‌నీర్ గ్రోవర్ అన్నారు.

బిగ్ బాస్కెట్‌‌కు ఇటీవల అలీబాబా నుంచి 50 మిలియన్ డాల‌ర్ల ఫండింగ్ వచ్చింది. బిగ్‌బాస్కెట్‌లో అలీబాబా మరోసారి చేయబోయే క్యాపిటల్ ఇన్‌ఫ్యూజన్‌పై ఎఫ్‌డీఐ పాలసీ దెబ్బకొట్టనున్నది. గతేడాదే పేటీఎం 100 కోట్లడాలర్లను జపాన్ సాఫ్ట్ బ్యాంక్, అలీబాబా యాంట్ ఫైనాన్షియల్ నుంచి సేకరించింది.

ఇండియా పేమెంట్ స్పేస్‌లో గ్లోబల్‌ కంపెనీలన్ని పోటీ పడుతున్నాయి. గూగుల్ పే, ఫోన్‌పే మరింత వెచ్చించేందుకు చూస్తున్నాయి. ఒరిజినల్ ఇన్వెస్ట్‌‌మెంట్ ఆటోమేటిక్ రూట్‌లో వచ్చి, అదనపు ఇన్వెస్ట్‌‌ మెంట్‌‌కు ప్రభుత్వం అనుమతి తీసుకురావడం కాస్త గందరగోళమేనని ఎనలిస్ట్‌‌లు అంటున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios