Asianet News TeluguAsianet News Telugu

ఫేస్‌బుక్ యుజర్ల డేటా లీక్…26 కోట్ల మంది సమాచారం వారి చేతుల్లోకి..

 సోషల్ మీడియా  యాప్స్ అడ‌గ్గానే మ‌నం మన సొంత స‌మాచారం ఇచ్చేస్తాం. ఆయా సంస్థ‌లు వినియోగ‌దారుల స‌మాచారాన్ని ఏంచేస్తున్నారు, ఎవ‌రికి అమ్ముతారో తెలియని ప‌రిస్థితి నెలకొంది. మన సొంత సమాచారం మనకు తెలియకుండ  ఎవరు ఉపయోగించుకుంటున్నారో కూడా మనకు  తెలియని పరిస్తితి. 

facebook users data of over 267 million users leaked to dark web says report
Author
Hyderabad, First Published Apr 25, 2020, 2:54 PM IST

ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తి, ప్రపంచలోని ఆగ్రా దేశాలతో సహ భారత దేశం కూడా లాక్ డౌన్ అమలు పరిచింది. కరోనా కేసుల వ్యాప్తి మరింత పెరగడంతో లాక్ డౌన్ మళ్ళీ పొడిగించారు.

దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు, లాక్ డౌన్ పేరుతో టెలికాం ఆపరేటర్లు కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతున్నారు. దీంతో ప్రజలు ఎక్కువ సమయం ఇంటర్నెట్ పైనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

కాకపోతే ఇంటర్నెట్ లో ఉన్న సమాచారం ఎంత‌మాత్రం సేఫ్ కాదు. సోషల్ మీడియా  యాప్స్ అడ‌గ్గానే మ‌నం మన సొంత స‌మాచారం ఇచ్చేస్తాం. ఆయా సంస్థ‌లు వినియోగ‌దారుల స‌మాచారాన్ని ఏంచేస్తున్నారు, ఎవ‌రికి అమ్ముతారో తెలియని ప‌రిస్థితి నెలకొంది.

మన సొంత సమాచారం మనకు తెలియకుండ  ఎవరు ఉపయోగించుకుంటున్నారో కూడా మనకు  తెలియని పరిస్తితి. ఇప్ప‌టికే ఇటువంటి ఘ‌ట‌న‌లు మనం అనేకం చూశాం. ఎన్నో పేరు మోసిన సైట్ల నుంచి కూడా డేటా హ్యాకర్ల హార్డ్ డిస్కోల్లోకి చేరిపోతుంది.

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ఇందుకు మిన‌హాయింపు అసలు  కాదు అని గుర్తుపెట్టుకోవాలి. యూజ‌ర్ల డేటా విష‌యంలో ఇప్ప‌టికే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న‌ ఫేస్ బుక్ 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సంద‌ర్భంగా భారీగా అప‌ఖ్యాతి మూట‌గ‌ట్టుకుంది.

తాజాగా మరోసారి ఫేస్ బుక్ వినియోగ‌దారుల‌ సమాచారం లీకైనట్టు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. దాదాపు 26 కోట్ల మందికి పైగా ఫేస్ బుక్ వినియోగ‌దారుల ప‌ర్స‌న‌ల్ డేటా ‘డార్క్ వెబ్’ చేతుల్లోకి వెళ్లినట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘సోఫోస్’ వెల్లడించింది.

యూజర్ ఐడీలు, యూజర్ ఫుల్ నేమ్, ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్, టైమ్ స్టాంప్ వివరాలు, ఏజ్, రిలేషన్ షిప్ స్టేటస్ మొదలగు వివరాలన్నీ ‘డార్క్ వెబ్’ కు అమ్మిన‌ట్లు ‘సోఫోస్’ పేర్కొంది. ఫేస్ బుక్ లోని థర్డ్ పార్టీ ఏపీఐ లోపాల ఆధారంగా ఈ డేటాను దొంగిలించి ఉండే అవకాశం ఉందని మరో సైబర్ సెక్యూరిటీ సంస్థ అభిప్రాయ‌ప‌డింది.

ఫేస్ బుక్ వినియోగ‌దారులు వెంటనే తమ అకౌంట్స్ పాస్ వర్డ్ మార్చుకోవాలని హెచ్చరించింది. డార్క్ వెబ్ అంటే ఎన్ క్రిప్షన్ చేయబడిన వెబ్ సైట్ డేటా. ఇలాంటి వెబ్ సైట్లు సాధారణ సెర్చ్ ఇంజిన్లలో కనిపించవు. స్పెష‌ల్ గా నిర్వాహకుల నుంచి ‘కీ’ లభిస్తేనే, దాని సాయంతో చూడవచ్చు. సైబర్ సెక్యూరిటి నిపుణులు వేలైనంత వరకు ఫేస్‌బుక్  పాస్ వర్డ్ లను మార్చుకోవాలని  చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios