Asianet News TeluguAsianet News Telugu

మారుతి మరో సరికోత్త రికార్డు.. గడువుకు ముందే అత్యధిక బీఎస్-6 కార్ల సేల్స్

ముందస్తు ప్రణాళిక ఉంటే ఎటువంటి లక్ష్యాన్నైనా సాధించొచ్చు. ఒకవైపు ఆర్థిక మందగమనంతోపాటు బీఎస్-6 ట్రాన్సిషన్ దిశగా అడుగులేస్తున్న ఆటోమొబైల్ రంగం విక్రయాల్లేక విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే. కానీ గతేడాది ప్రారంభం నుంచే బీఎస్-6 వర్షన్ మోడల్ కార్లను విడుదల చేయడం ప్రారంభించాయి దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలు.. ఫలితం సుప్రీంకోర్టు పెట్టిన గడువుకు ముందే పది లక్షలకు పైగా బీఎస్-6 కార్లను విక్రయించిన ఘనత సాధించాయి. అదేంటో ఒక్కసారి చూద్దాం..
 

Despite outbreak, sales of BS-VI vehicles cross over 1 million
Author
Hyderabad, First Published Apr 7, 2020, 11:03 AM IST

ముంబై: ఒకవైపు కరోనా మహమ్మారి (కొవిడ్-19) దాడి చేస్తున్నా.. దేశీయంగా వాహనాల విక్రయాల్లో రికార్డు నమోదైంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి దేశీయ ఆటోమొబైల్ రంగం బీఎస్-6 ప్రమాణాల తరంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. కొన్ని సంస్థలు ఇప్పటికే విపణిలోకి బీఎస్-6 వర్షన్ వాహనాలను ప్రవేశపెట్టగా, మరికొన్ని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి.

కానీ కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల కొన్ని ఆటోమొబైల్ సంస్థలు వాటిని విపణిలోకి ప్రవేశపెట్టలేకపోయాయని ఆటోమొబైల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ముందస్తు ప్రణాళికతో ముందే బీఎస్-6 వర్షన్ వాహనాలను విపణిలోకి విడుదల చేసిన సంస్థల వల్ల ఒక ఏడాది ముందే అంటే అధికారికంగా ‘బీఎస్-6’ తరం ప్రారంభం కావడానికి ముందే పది లక్షలకు పైగా వాహనాలు అమ్ముడు పోయాయి. 

ముందస్తుగా మంచి ఉత్పత్తులపై ప్రణాళికలు వేసుకుని, అంతర్జాతీయ సహకార సంస్థలతో సహకార ఒప్పందాలతో మార్కెట్లోకి మారుతి సుజుకి నూతన వాహనాలను విడుదల చేయడంలో ముందు పీఠిన నిలిచింది. గత ఏడాది కాలంలో కేవలం మారుతి సుజుకి బీఎస్-6 మోడల్ వాహనాలు 7.5 లక్షలకు పైగా విక్రయించింది. 

దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ ఇప్పటి వరకు బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాలు 1.23 లక్షల యూనిట్లను విక్రయించింది. తర్వాతీ స్థానంలో గతేడాది ఆగస్టులో సెల్టోస్ మోడల్ కారును ఆవిష్కరించిన దాని అనుబంధ సంస్థ కియా మోటార్స్ 84,971 యూనిట్లను విక్రయించింది. 

also read  కారు స్పేర్ పార్ట్లతో ఆక్సిజన్ వెంటిలేటర్... టెస్లా కంపెనీ ముందడుగు

టయోటా కిర్లోస్కర్ మోటార్స్ తన కార్లు 39 వేల యూనిట్లు విక్రయించుకున్నట్లు టయోటా సేల్స్ అండ్ సర్వీస్ సీనియర్ ఉపాధ్యక్షుడు నవీన్ సోనీ తెలిపారు. గత జనవరి నాటికి టయోటా కిర్లోస్కర్ మోటార్స్ తన మోడల్ కార్లన్సీ బీఎస్-6 వర్షన్ లోకి మార్చివేసింది. డీజిల్ వాహనాల ఆవిష్కరణలు జాప్యం చేస్తాయి. 

మరోవైపు ఎంజీ మోటార్స్ నాలుగు వేల యూనిట్లను విక్రయించింది. గత నెలాఖరు నాటికి మహీంద్రా అండ్ టాటా మోటార్స్ కలిసి ఏడు వేల వాహనాలు విక్రయించింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో వినియోగదారులు అధిక ధరలు పలుకుతున్న బీఎస్-6 ప్రమాణాల వర్షన్ కార్ల కొనుగోలుకు వెనుకాడుతున్నారు.

బీఎస్-6 పెట్రోల్ వర్షన్ కార్ల ధరలు మూడు శాతం లోపు, డీజిల్ వర్షన్ కార్ల ధరలు 5-10 శాతం పెరుగుతాయని ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. 

ఎర్నెస్ట్ అండ్ యంగ్ పార్టనర్ సోం కపూర్ స్పందిస్తూ ‘కరోనా మహమ్మారి ప్రభావం నుంచి బయటకు వచ్చిన తర్వాత బీఎస్-6 ప్రమాణాలతో కూడిన టెక్నాలజీతో కూడిన ఎన్విరాన్మెంట్ ప్రధానంగా ఉత్పత్తి చేసే వాహనాలపైనే వినియోగదారులు ద్రుష్టి పెడతారు‘ అని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios