Asianet News TeluguAsianet News Telugu

కరోనా కి మలేరియా మందు.. వికటించి డాక్టర్ మృతి

మలేరియా మందులు వేసుకుంటే.. కరోనా రాకుండా ఉంటుందని భ్రమ పడ్డాడు. ఈ క్రమంలోనే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. మలేరియా మందులు వేసుకున్న తర్వాత తన ఆరోగ్యం సరిగా లేదంటూ అతను తన స్నేహితుడికి వాట్సాప్ లో మెసేజ్ పంపడం గమనార్హం.

COVID-19: Assam Doctor Dies Allegedly After Taking Anti-Malarial Drug As Virus Prevention
Author
Hyderabad, First Published Mar 31, 2020, 11:41 AM IST

కరోనా మహమ్మారి విజృంభణ మమూలుగా లేదు. భారత్ లో ఈ వైరస్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ నుంచి దేశాన్ని రక్షించేందుకు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ... కేసులు తగ్గకపోవడం గమనార్హం. ప్రజలు కరోనా పేరు చెబితేనే భయపడిపోతున్నారు. ఈ భయంతో తెలిసీ తెలియక వారు చేస్తున్న కొన్ని పొరపాట్లు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా ఓ డాక్టర్ ఇలానే ప్రాణాలు కోల్పోయాడు.

అస్సాంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం  రాజధాని గౌహతికి చెందిన ఓ ప్రైవేటు హా స్పిటల్ డాక్టర్ ఉత్పల్ జిత్ బారమాన్(44) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. అయితే... కరోనా రాకుండా ఉండేందుకు చేసిన ఓ పొరపాటు కారణంగానే ఇాలా ప్రాణాలు కోల్పోయినట్లు తర్వాత తెలిసింది.

పోస్టుమార్టం ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే... ఆయన మలేరియా మందులు వేసుకున్నాడు. మలేరియా మందులు వేసుకుంటే.. కరోనా రాకుండా ఉంటుందని భ్రమ పడ్డాడు. ఈ క్రమంలోనే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. మలేరియా మందులు వేసుకున్న తర్వాత తన ఆరోగ్యం సరిగా లేదంటూ అతను తన స్నేహితుడికి వాట్సాప్ లో మెసేజ్ పంపడం గమనార్హం.

Also Read కరోనా ఎఫెక్ట్... ఉద్యోగుల గుండెల్లో గుబులు..136మిలియన్ల ఉద్యోగాలు..

స్థానికంగా ఈ వార్త తీవ్ర సంచలనం రేపింది. కాగా... ఈ వార్త అధికారుల దృష్టికి వెళ్లడంతో.. ప్రజలను హెచ్చరిస్తున్నారు. కరోనా భయంతో ఎలాంటి మందులు వేసుకోవద్దని సూచిస్తున్నారు.

ఇదిలా ఉండగా... భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సోమవారం 1,071కు పెరిగాయి. 24 గంటల్లో 106 కొత్త కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి.

దీంతో దేశంలో మృతుల సంఖ్య 29కి చేరింది. ఒక్క మహారాష్ట్రలోనే 10 మరణాలు నమోదయ్యాయి. ఇది మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ. 

పుణెలో కరోనా సోకిన 52 ఏళ్ల వ్యక్తి సోమవారం మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.  మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో 3 రోజుల క్రితం మరణించిన 38 ఏళ్ల వ్యక్తి నమూనాల పరీక్షా ఫలితాలు సోమవారం వచ్చాయి. అతనికి కరోనా ఉన్నట్లు తేలింది. 

కేరళలో కొత్తగా 32 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 213కు చేరింది. 

దేశంలో ఇదే అత్యధికం. 193 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. ఒక్క రోజులో తమిళనాడులో 17, ఉత్తరప్రదేశ్‌లో 16 కేసులు నమోదయ్యాయి. 

దీంతో ఆ రాష్ట్రాల్లో మొత్తం కేసులు వరుసగా 67, 88కి చేరాయి. కర్ణాటకలో 80, ఉత్తరప్రదేశ్‌ 88, గుజరాత్‌ 69, రాజస్థాన్‌ 60, ఢిల్లీ 53, పంజాబ్‌ 38, హరియా ణా, మధ్యప్రదేశ్‌ 33 చొప్పున, జమ్మూ కశ్మీర్‌ 45, పశ్చిమ బెంగాల్‌ 22, లద్దాఖ్‌ 13, బిహార్‌ 11, అండమాన్‌ నికోబార్‌ 10, చండీగఢ్‌ 8, చత్తీ్‌సగఢ్‌, ఉత్తరాఖండ్‌ 7 చొప్పున, గోవా 5, హిమాచల్‌ ప్రదేశ్‌, ఒడిసాలో మూడు చొప్పున, పుదుచ్చేరి, మి జోరాం, మణిపూర్‌ ఒక్కో కేసు నమోదయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios